కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఈడీ మళ్లీ సమన్లు పంపింది. ముందుగా పంపిన సమన్ల ప్రకారం రాహుల్ గాంధీ గురువారం ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా ఈడీ ఎదుట హాజరు కాలేదు.
హాజరయ్యేందుకు మరి కొంత సమయం కావాలని రాహుల్ కోరారు. ఈ మేరకు తమకు సమాచారం అందిందని ఈడీ పేర్కొంది. అయితే శుక్రవారం మరోసారి రాహుల్ కు ఈడీ సమన్లు పంపించింది. ఈ సారి ఈనెల 13న ఈడీ విచారణకు రావాలని ఆ సమన్లలో పేర్కొంది. ఇలస్ట్రేటెడ్ విక్లీ మనీ లాండరింగ్ కేసులో ఈడీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు, పార్టీ సీనియర్ నాయకుడు అయిన రాహుల్ కు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈడీ సమన్ల మేరకు సోనియాగాంధీ ఈనెల 8న ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉండగా, ఆమె కరోనా బారిన పడ్డారు. అప్పటికి కోలుకుంటే సోనియాగాంధీ ఈడీ ఎదుట విచారణకు హాజరౌతారని కాంగ్రెస్ అధికార ప్రతినిథి రణదీప్ సింగ్ సూర్జేవాలా తెలిపారు.
ఇంతకీ ఇలస్ట్రేటడ్ వీక్లీ కేసు ఏమిటంటే.. రాహుల్ గాంధీ డైరెక్టర్ గా ఉన్న యంగ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ ద్వారా ఎజెఎల్ అనే కంపెనీని రాహుల్ కొనుగోలు చేశారంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదుతో ఇలస్ట్రేటెడ్ వీక్లీ మనీలాండరింగ్ వ్యవహారం వెలుగులోనికి వచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం పీఎంఎల్ఎ) కింద సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వాంగ్మూలాలు నమోదు చేయనున్నట్లు ఈఢీ పేర్కొంది. ఈ మేరకు వారికి సమన్లు పంపింది. కాగా రాజకీయ ప్రత్యర్థులను కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా కేంద్రంలోని మోడీ సర్కార్ వేధిస్తున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ed-summons-again-to-rahul-gandhi-25-136965.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.