ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఈడీ ఎటాక్స్

Publish Date:Sep 6, 2022

Advertisement

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ దాడులు ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా ఏకకాలంలో దాదాపు 40 ప్రాంతాలలో ఈడీ దాడులు నిర్వహించింది. ఒక వైపు సీబీఐ, మరో వైపు ఈడీ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో స్పీడ్ పెంచేశాయి. దీంతో దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి.

అసలు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం రాజకీయంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కేంద్రం తాన రాజకీయప్రత్యర్థులను వేధించడానికే కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగించుకుంటోందన్న విమర్శల నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కుంభకోణంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ ఎఫ్ఐఆర్ లో ఏ1గా నమోదు చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

అలాగే ఒక వైపు సీబీఐ దర్యాప్తు జరుగుతుండగానే ఈడీ రంగంలోకి దిగడం,  ఢిల్లీ, లక్నో, గురుగావ్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌‌లలో ఏకంగా ముఫ్పై చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈడీల సోదాలతో  ఒక్క సారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. ఇక హైదరాబాద్ లో అయితే సీబీఐ ఎఫ్ఐఆర్‌లో ఉన్న రామచంద్ర పిళ్లై తో పాటు  అభిషేక్ రావ్, సూదిని సృజన్ రెడ్డి, గండ్రప్రేమ్ సాగర్ నివాసాలు, కార్యాలయాలపై ఈడీ సోదాలు జరుగుతున్నాయి. అలాగే ఒక ప్రముఖ రాజకీయ నేత పీఏ నివాసంపై కూడా ఈడీ దాడులు చేసినట్లు చెబుతున్నారు.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలకు కూడా విస్తరించి ఉండటం, రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్న వార్తలు రావడంతో అంతటా ఈడీ సోదాలపై ఆసక్తి కనబరుస్తున్నారు.ఈ కుంభ కోణంలో తెలంగాణ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తనపై ఆరోపణలు చేయకుండా ఆమె కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు. అలాగే  ఈ కేసులో విజయసాయిరెడ్డితో పాటు జగన్ సతీమణి పేరు కూడా ఉందని టీడీపీ  ఆరోపిస్తున్నది. దీనిపై రాజకీయదుమారం కొనసాగుతోంది.

సీబీఐ ఈడీ విచారణలతో రాజకీయంగానూ కీలక పరిణామాలు చోటు చేసుకోవడం అనివార్యంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే ఈ కేసులో మద్యం లిక్కర్ సిండికేట్ల తరపున డిపాజిట్ కట్టిన విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డిపై ఈడీ దాడులు ఎందుకు జరగడం లేదని తెలుగుదేశం ప్రశ్నిస్తోంది. ఎంపిక చేసిన వ్యక్తులు లక్ష్యంగానే ఈడీ, సీబీఐ దర్యాప్తు జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మోడీ విధానాలను విమర్శించే, వ్యతిరేకించే వారి దూకుడు తగ్గించేందుకే కేంద్రం కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగిస్తోందన్న విమర్శలకు ఈడీ దాడులు నిర్వహిస్తున్న తీరు అద్దం పడుతోందని విమర్శలు వెల్లువెత్తున్నాయి.  ఈ కుంభ కోణంలో చాలా మంది ‘పెద్దల’ పేర్లు బయటకు వచ్చినప్పటికీ దాడులు ‘చిన్న’లపైనే జరగడం అనుమానాలకు తావిస్తోందనీ, కేంద్రంపై కేంద్ర దర్యాప్తు సంస్థలను అనుచితంగా ఉపయోగిస్తోందన్న విమర్శలకు బలం చేకూర్చేదిగా ఉందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
ప్రభుత్వ కార్యాలయాల గోడలపై ఎక్కడ చూసినా ఒకే నినాదం కనిపిస్తుంది.. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
రాష్ట్రంలో అర్నబ్ తుపాను ప్రభావంతో పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.