జీ.వినోద్ సహా మాజీ క్రికెటర్ల నివాసాలలో ఈడీ సోదాలు..
Publish Date:Nov 22, 2023
Advertisement
మాజీ క్రికెటర్ల నివాసాలలో బుధవారం (నవంబర్ 22) ఈడీ సోదాలు నిర్వహించింది. మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అర్షద్ ఆయూబ్ నివాసాలతో పాటు హెచ్ సీఏ మాజీ అధ్యక్షుడు జి. వినోద్ నివాసాలలోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డారన్న అభియోగాలపై వీరిపై ఏసీబీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసుల ఆధారంగానే ఇప్పడు ఈడీ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. కాగా ఈ సోదాలలూ అర్షద్ ఆయూబ్, శివలాల్ యాదవ్, జి.వినోద్ ల నుంచి బ్యాంకు ఖాతాల వివరాలను తీసుకున్న ఈడీ పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. కాగా మంగళవారం కూడా చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ నివాసాలలో ఐటీ శాఖ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసింది. అయితే బుధవారం (నవంబర్ 22) వినోద్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించడం సంచలనం సృష్టించింది. అయితే వినోద్ హెచ్ సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కావడం, గతంలో అంటే ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈ ఈడీ సోదాలు జరిగాయని అంటున్నారు. వినోద్ నివాసంపైనే కాకుండా హెచ్ సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ ఆయూబ్, అలాగే బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్ నివాసాలపై కూడా ఈడీ దాడులు నిర్వహించింది. ఈముగ్గురిపైనా కూడా ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో జరిగిన అవినీతిపై తెలంగాణ ఏసీబీ చార్జిషీట్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ చార్జిషీట్ లలో ప్రస్తావించిన అంశాలపైనే ఇప్పుడీ దాడులు జరిగినట్లు చెబుతున్నారు. అలాగే చార్జిషీట్ లో అంశాలపై ఈడీ ఈ ముగ్గురినీ ప్రశ్నించి వివరాలను సేకరించినట్లు తెలియవచ్చింది.
http://www.teluguone.com/news/content/ed-raids-in-former-crickters-houses-39-165634.html





