Publish Date:Mar 28, 2023
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మళ్లీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 11,20,21 తేదీల్లో కవిత ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణను సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. లిఖితపూర్వక వాదనలు వినిపించాలని కవిత, ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కవితకు ఏ క్షణమైనా నోటీసులు ఇచ్చే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం కీలకంగా మారింది.
అయితే ఈ విచారణకు సంబంధించి ఆమె కానీ, ఆమె ప్రతినిథి కానీ హాజరు కావచ్చని ఈడీ పేర్కొంది. దీంతో ఈ రోజు విచారణకు కవితకు బదులుగా ఆమె న్యాయవాది సోమ భరత్ ను కవిత పంపించారు. కవిత ఈడీకి అందజేసిన మొబైల్ ఫోన్లను తెరవనున్నామనీ, ఆ సమయంలో స్వయంగా హాజరుకావడం లేదా తన ప్రతినిధిని పంపాలనీ ఈడీ పేర్కొన్నదనీ, అందుకే కవితకు బదులుగా ఆమె ప్రతినిథిగా న్యాయవాది సోమ భరత్ ఈడీ కార్యాలయానికి వెళ్లారని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ed-notices-to-mlc-lavita-25-153060.html
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు