కేసినో కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డిని విచారించిన ఈడీ
Publish Date:Nov 17, 2022
Advertisement
కేసీనో వ్యవహారంలో ఈడీ వైసీపీ నేతలపైకి తన దృష్టి సారించింది. చీకోటి ప్రవీణ్ కేసినో వ్యవహారం కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు ఉన్నారన్న ఆరోపణలు అప్పట్లోనే వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇదే కేసుకు సంబంధించి ఈడీ అధికారులు బుధవారం తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సోదరులు ఇద్దరిని సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ ఎల్ రమణకు కూడా నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. అదలా ఉంటే.. ఇదే కేసినో కేసులో ఏపీ రాజకీయ నేతలనూ ఈడీ విచారించనుంది. తాజాగా ఈ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయన గురువారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.కేసినో కేసుకు సంబంధించి ఏపీకి చెందిన పలువురు రాజకీయ నాయకులకు కూడా ఈడీ విచారణకు రావలసిందిగా నోటీసులు పంపే అవకాశం ఉందని చెబుతున్నారు. నగదు ఇక్కడ ఇచ్చి వాటిని కాయిన్లుగా మార్చుకుని విదేశాలలో క్యాసినోల్లో మార్చుకుని ఆడతారు. ఇలా వందల మంది ఆడారని అంటున్నారు. చీకోటి ప్రవీణ్ను విచారించినప్పుడు ఈడీ సేకరించిన సమాచారం ఆధారంగా ఈడీ కేసినో కేసులో పలువురికి వరుసగా నోటీసులు జారీ చేసి విచారిస్తోంది. గురువారం ఈ కేసులో విచారణకు గుర్నాథరెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడు యుగంధర్ కూడా హాజరయ్యారు వీరిద్దరూ చీకోటి ప్రవీణ్ నిర్వహించిన కేసినోల్లో పాల్గొనడానికి ఇతర దేశాలకు వెళ్లేందుకు హవాలా మార్గం ద్వారా డబ్బులు చెల్లించారన్న ఆరోపణలపై ఈడీ ప్రశ్నిస్తోందంటున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకూ వంద మందికి ఈడీ నోటీసులు జారీ నట్టు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/ed-inquire-ycp-ex-mla-gurnath-reddy-in-casino-case-25-147244.html





