జగన్‌పై 18వ కేసు.. సాయిరెడ్డి అప్రూవర్ గా మారతారా? 

Publish Date:May 30, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాకుల మీదు షాకులు తగులుతున్నాయి. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టులో జూన్ 1న విచారణ జరగనుంది. జగన్ బెయిల్ రద్దుపై సీబీఐ వేసే కౌంటర్ పైనే ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ఏమవుతుందోమోనన్న ఆందోళన వైసీపీలో కనిపిస్తోంది. ఇదిలా ఉండగానే గృహ నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించిన విచారణలో వెలుగుచూసిన అంశాల ఆధారంగా జగన్ పై  ఈడీ మరో అభియోగ పత్రంపై నమోదు చేసింది. 

జగన్​మోహన్ రెడ్డిపై ఇప్పటికే 11 సీబీఐ, 6 ఈడీ కేసులు విచారణలో ఉన్నాయి. ఈడీ దాఖలు చేసిన మరో ఛార్జ్​షీట్‌నూ న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. దీంతో సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్‌పై కేసుల సంఖ్య 18కి చేరాయి.  గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో అక్రమాలకు సంబంధించి ఈడీ  గత ఏడాదిలోనే ఛార్జ్​షీట్ దాఖలు చేసినప్పటికీ.. కొన్ని లోపాల వల్ల న్యాయస్థానం దానిని రిజెక్ట్ చేసింది. మార్చిలో మళ్లీ దాఖలు చేయగా విచారణ చేపట్టింది. తాజాగా నమోదైన 18వ కేసులో జగన్‌ తో పాటు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, ఇందూ గ్రూపు వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. 

బెంగళూరు స్థిరాస్తి వ్యాపారి జితేంద్రవీర్వానీ,ఇందూ ప్రాజెక్ట్స్,సైబరాబాద్ హైటెక్ ఇంటిగ్రేటెడ్ టౌన్​షిప్ డెవలప్​మెంట్ కార్పొరేషన్,ఇందూ ఈస్టర్న్ ప్రావిన్స్ ప్రాజెక్ట్స్, ఇందూ రాయల్ హోమ్స్, వసంత ప్రాజెక్ట్స్,ఎంబసీ ప్రాపర్టీ డెవలప్​మెంట్స్‌ సంస్థలను ఈడీ నిందితుల జాబితాలో చేర్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏపీ హౌసింగ్ బోర్డు గృహనిర్మాణ ప్రాజెక్టుల సందర్భంగా.. ఇందూ గ్రూప్ అధినేత శ్యాంప్రసాద్ రెడ్డికి అనుచిత ప్రయోజనాలు కల్పించినట్లు సీబీఐ, ఈడీ ఆరోపించాయి. ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి 70 కోట్ల రూపాయలను జగన్‌ కంపెనీల్లోకి మళ్లించగా… ప్రతిఫలంగా వైఎస్ సర్కారు తక్కువ ధరలకే హైదరాబాద్‌లోని కూకట్​పల్లిలో 65, గచ్చిబౌలిలో 21, బండ్లగూడలో 50, నంద్యాలలో 75 ఎకరాల చొప్పున కేటాయించినట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి.

బెంగళూరుకు చెందిన ఎంబసీ ప్రాపర్టీ డెవలప్​మెంట్స్ అధినేత జితేంద్రవీర్వానీ ఈ ప్రక్రియలో సహకరించడం ద్వారా… 50 కోట్ల 16 లక్షల రూపాయల అక్రమ లబ్ధి పొందినట్లు ఈడీ గుర్తించింది. ప్రస్తుతం తితిదే ఛైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి తన సహచరుడు, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌కు ప్రాజెక్టులో భాగస్వామ్యం కల్పించినట్లు ఈడీ దర్యాప్తులో తెలిపింది.వైవీ సుబ్బారెడ్డి, కృష్ణప్రసాద్ కలిపి గచ్చిబౌలి ప్రాజెక్టులో నాలుగున్నర ఎకరాల వాటాను శ్యాంప్రసాద్ రెడ్డికి ఇచ్చినట్లు సీబీఐ కూడా తన ఛార్జ్​షీట్​లో వెల్లడించింది. ఏపీహెచ్‌బీకి నష్టం కలిగించి అక్రమ లబ్ధి పొందిన నిందితులపై మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 3, 4 ప్రకారం చర్యలు తీసుకోవాలని కోర్టును ఈడీ కోరింది.117 కోట్ల 74 లక్షల రూపాయల ఆస్తులను 2018 జనవరిలో తాత్కాలికంగా జప్తు చేసింది. ఇందూ ప్రాజెక్ట్స్‌కు సంబంధించి అభివృద్ధి చేయని భూములు సహా వసంత ప్రాజెక్ట్స్, ఎంబసీ ప్రాపర్టీస్‌కు చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఈడీ అటాచ్ చేసింది. ఈ ఛార్జ్​షీట్‌పై విచారణను జూన్ 30కి కోర్టు వాయిదా వేసింది.  

ఈ కేసులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే…ఇందులో ఎంపీ విజయసాయిరెడ్డి పేరు తొలగించారు. జగన్‌కు చెందిన కార్మెల్ ఏషియా, ఐఏఎస్ అధికారి ఎస్.ఎన్.మహంతి పేర్లు కూడా లేవు. విజయసాయి రెడ్డి ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చేసిన లాబీయింగ్ వల్ల ఇలా జరిగిందా? అప్రూవర్ గా మారతారా ? అని నెటిజన్లు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. జగన్ విషయంలో విజయసాయి రెడ్డి హ్యాండివ్వడం అసంభవమని వైసీపీ మద్దతుదారులు కొట్టి పారేస్తున్నారు. ఏమో ఏదైనా జరగవచ్చని మరికొందరు చెబుతున్నారు. తాజా పరిణామాలతో సీఎం జగన్ కేసుల్లో ఏం జరగబోతోంది అన్నది ఏపీతో దేశ వ్యాప్తంగా ఆసక్తిగా మారింది. 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.