వివేకాహత్య కేసులో ఈడీ ఎంట్రీ.. జరిగేదేంటంటే?

Publish Date:Aug 22, 2026

Advertisement

తెలుగు రాజకీయాల్లో  సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి   హత్య కేసులో ఇప్పుడు ఈడీ రంగప్రవేశం చేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన సన్నిహితుల నివాసాలలో ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించింది.  2019 మార్చిలో జరిగిన వివేకా హత్య వెనుక 40 కోట్ల సుపారీ  ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రూ.1 కోటి అడ్వాన్స్‌గా ఇచ్చారని, అందులో రూ.70 లక్షలు రికవరీ అయ్యాయని వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు దాదాపు ఏడేళ్ల తరువాత ఈడీ సోదాలు నిర్వహించిందంటే ఏం జరుగుతోంది?  ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ ఎలాంటి కీలక ఆధారాలు సేకరించబోతోంది? అన్న విషయంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, ఏపీ కమ్మకార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
  ఈ కేసులో కీలక సాక్షులు కొందరు ఇప్పిటికే అనుమానాస్పద స్థితిలో చనిపోయారు.   ఇలాంటి పరిస్థితుల్లో అప్రూవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం  కీలకంగా మారింది. జైలులో బెదిరింపులు వచ్చినా, కోట్లాది రూపాయల ఆఫర్లు ఇచ్చినా లొంగకుండా దస్తగిరి మెజిస్ట్రేట్ ముందు వివరాలు వెల్లడించారు. 

అదలా ఉంటే..   ప్రజా కోర్టులో  వివేకా హత్య కేసులో   తీర్పు వచ్చేసిందన్న అడుసుమిల్లి శ్రీనివాసరావు.. బాధితురాలైన కుమార్తెకు చట్టబద్ధంగా న్యాయం జరిగాల్సి ఉందన్నారు. అర్ధరాత్రి హత్య జరిగితే, తెల్లవారక ముందే ఫోన్ కాల్స్ వెళ్లడం, సాక్ష్యాధారాలు తుడిచిపెట్టే ప్రయత్నం జరగడంపై ఇప్పటికీ అనేక ప్రశ్నలు ఉన్నాయి?  అయితే ఇప్పుడు ఈ కేసులో ఈడీ ఎంట్రీ..  40 కోట్ల సుపారీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరెవరి ఖాతాల నుంచి ఎక్కడికి బదిలీ అయింది? అన్నది తేల్చడమే..   అయితే ఇప్పుడు ఇక ఈడీ సోదాల వల్ల ఒరిగిందేమీ ఉండదన్న అడుసుమిల్లి.. ఆ 40 కోట్లు వీళ్లకి రోడ్డు మీద దొరికాయని ఈడీ ముక్తాయించేసినా ఆశ్చర్యంలేన్నారు.  

ఏది ఏమైనా, ఓ మాజీ ఎంపీ, మాజీ మంత్రి   స్వగృహంలోనే హత్యకు గురైతే.. ఏళ్లు గడుస్తున్నా బాధ్యులకు సరైన శిక్ష పడకపోవడం వ్యవస్థల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈడీ దర్యాప్తులోనైనా అసలు సూత్రధారులు బయటకు వస్తారా? లేక ఇది కూడా కేవలం విచారణలకే పరిమితమవుతుందా చూడాల్సి ఉంది.

ED entry in YS Viveka Murder Case, ED Investigation AP, Avinash Reddy ED Raids, Dastagiri Statement, YS Jagan Mohan Reddy, AP Politics, TeluguOne

By
en-us Political News

  
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!
నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.