రాహుల్ ఈడీ విచారణ కంటిన్యూస్..!

Publish Date:Jun 20, 2022

Advertisement

రాహుల్ గాంధీని ఈడీ సోమవారం కూడా విచారించనుంది. ఇంతకు ముందు వరుసగా మూడు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రాహుల్ విజ్ణప్తి మేరకు మధ్యలో మూడు రోజులు విరామం ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సంగతి విదితమే. తన తల్లి సోనియాగాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా రాహుల్ విరామం కోరగా ఈడీ అంగీకరించింది.

హెరాల్డ్ కేసులో ఈడీ రాహుల్ ను ఇప్పటికే ఈ నెల 13 నురంచి 15 వరకూ మూడు రోజుల్లో దాదాపు 28 గంటల పాటు విచారించింది.  యంగ్ ఇండియన్ కంపెనీ కార్యకలాపాలు, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులతో పాటు పలు అంశాలపై ఈడీ అధికారులు రాహుల్ గాంధీపై పలు ప్రశ్నలు సంధించారు.  రాహుల్ ఇచ్చిన సమాధానాలను ఆడియో, వీడియో రూపంలో భద్రపరిచారు. అయితే విచారణలో భాగంగా రాహుల్ ఇచ్చిన సమాధానలు తమ సందేహాలను పూర్తిగా నివృత్తి చేయలేదంటున్నా ఈడీ అధికారులు  ఆయనను మరో మారు విచారించనున్నారు.  

రాహుల్, సోనియా గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ప్రమోటర్లుగా ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్.. నేషనల్ హెరాల్డ్ పత్రికకు యాజమాన్య సంస్థ. అయితే, యంగ్ ఇండియన్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తోంది. కాంగ్రెస్ కు నేషనల్ హెరాల్డ్ బకాయి పడ్డ సుమారు 90 కోట్లను వసూలు చేసుకునే హక్కును కేవలం 50 లక్షలు చెల్లించడం ద్వారా సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి పదేళ్ల కిందట అంటే 2012లో ఫిర్యాదు చేశారు. ఆ కేసులోనే  ఇప్పుడు ఈడీ రాహుల్ గాంధీని ప్రశ్నిస్తోంది. మరోవైపు, ఈడీ విచారణను నిరసిస్తూ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది.  

By
en-us Political News

  
మెటా సంస్థ కేవలం ఒకరి ఫిర్యాదుతో ఓవర్ నైట్ ఏ అకౌంట్‌ను సస్పెండ్ చేయదని ఆయన చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను పదే పదే ఉల్లంఘించడం వల్లే ఈ బ్లాక్ జరిగిందని వివరించారు. ముఖ్యంగా ఇటీవల ముగిసిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియ డీఎస్సీ ద్వారా రికార్డు స్థాయిలో 15,941 మంది నిరుద్యోగులకు పారదర్శకంగా ఉద్యోగాలు లభించాయనీ.. అయితే వైసీపీ నేతలు తప్పుడు ఆధారాలు, ఫేక్ ఆడియో క్లిప్పింగులతో సమాజంలో అస్థిరత సృష్టించడానికి ప్రయత్నించారని అప్పసాని రాజేష్ ఆరోపించారు.
దేశవ్యాప్తంగా లోక్ సభ నియోజక వర్గాల సంఖ్యను ఏకంగా 50 శాతం మేర పెంచి, మొత్తం 815 స్థానాలకు చేర్చాలనేది ప్రాథమిక ప్రతిపాదన. అయితే.. దీనిపై కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహా మండలి ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక నివేదికను సిద్ధం చేసింది.
మెట్రో ఫేజ్ 1 టేకోవర్.. దానికి సంబంధించిన రీఫైనాన్సింగ్ నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మెట్రో మొదటి దశను నిర్వహించిన ఎల్ అండ్ టీ సంస్థ భారీ నష్టాల కారణంగా ఫేజ్ 2 విస్తరణకు ముందుకు రాకపోవడంతో.. కేంద్ర ప్రభుత్వ సలహా మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను తన అధీనంలోకి తీసుకుంది.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 90వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.
అసలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాని ఒక వ్యక్తి సుదీర్ఘ కాలం పాటు మంత్రి పదవిలో ఎలా కొనసాగుతారనే ప్రాథమిక రాజ్యాంగ ప్రశ్నను ఈ కేసు లేవనెత్తింది.
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ (DSC) నియామకాల చుట్టూ ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ వివాదం కూటమి ప్రభుత్వానికి సరికొత్త సవాలుగా మారింది.
భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రాంతీయ పార్టీల పాత్ర అత్యంత కీలకమైనది
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపు తిరుగుతోంది.
దేశ సమగ్రత, జాతీయ సమైక్యతే జనసేన పార్టీ మూల సిద్ధాంతమని జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ మరింత ముదురుతోంది.
ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డిని, అలాగే ఏపీబీసీఎల్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డిని ఈడీ అధికారులు మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరి అరెస్టుతో ఈ కుంభకోణం తాలూకు మూలాలు ఎక్కడికి దారితీస్తున్నాయి, అంతిమంగా దీని ప్రభావం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పడబోతోందా అనే విషయంపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో విశ్లేషించారు.
ఈ మొత్తం స్థలం విలువ బహిరంగ మార్కెట్లో వెయ్యి కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంటున్నారు. ఇందులో సింహభాగం అంతా ప్రభుత్వానికి చెందిన భూమి కావడం గమనార్హం. కాగా ఈ వ్యవహారంపై తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ అనలిస్ట్ భరద్వాజ మాట్లాడారు.
సహజంగా దేశ చరిత్రలో జవహర్‌లాల్ నెహ్రూ 17 సంవత్సరాల పాటు, ఇందిరా గాంధీ 16 సంవత్సరాల పాటు ప్రధానమంత్రులుగా సేవలందించారు. అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన రికార్డు ఎలా ? అన్న విషయాన్నితెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ ఎనలిస్టు వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.