ఈడీ, సీబీఐ పొంచి ఉన్నాయ్ తస్మాత్ జాగ్రత్త!

Publish Date:Aug 29, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అప్రమత్తమయ్యారు. తాను అప్రమత్తం కావడమే కాకుండా పార్టీ నేతలనూ అప్రమత్తం చేస్తున్నారు. అదేదో మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయంతోనో లేదా వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి ప్రజావ్యతిరేకతను అధిగమించడానికి తీసుకోవలసిన చర్యలపైనో కాదు. కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు విషయంలో. రాష్ట్రంలో తెరాస అగ్రనాయకత్వం, నాయకులే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ చాలా కీన్ గా పరిశీలిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఆప్రమత్తమయ్యారు,

పార్టీ నేతలనూ అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో ఈడీ, సీబీఐలు అత్యంత క్రియాశీలంగా వ్యవహరిస్తున్నాయి. ఏదో తీగే కదా లాగుతున్నాయి అని పట్టీపట్టనట్టు ఉంటే డొంకలు కదిలే అవకాశం కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కూడా అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో ఈడీ సీబీఐ దాడులు, వాటి వల్ల చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను ఆయన సమీక్షంచారు. ఎర్రవల్లిలోని పాంహౌజ్ లో నిర్వహించిన సమావేశంలో  ఈ మేరకు ఆయన ఎర్రవల్లిలోని తన ఫాంహౌజ్‌లో సమావేశం నిర్వహించారని పార్గీ వర్గాలు తెలిపాయి.

సీబీఐ,  ఈడీ, ఐటీ విభాగాలు హైదరాబాద్‌లోని పలు సంస్థల్లో ఇటీవల ఆకస్మిక తనిఖీలు చేపడుతున్న విషయాన్ని ఈ భేటీలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ స్థాయిలో బీజేపీ విధానాలను, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఎండగడుతున్ననేపథ్యంలో గులాబీ నేతలు ఎక్కడ దొరుకుతారా కేసులు పెడదామా అని మోడీ ప్రభుత్వం కాచుకొని కూర్చుందని కేసీఆర్‌ ఈ భేటీలో పార్టీ నేతలను హెచ్చరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం  ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో తన కుమార్తె ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందంటూ బీజేపీ నాయకులు ఆరోపిస్తుండటాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించినట్లు తెలిసింది.  ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీకి చెందిన ప్రతిఒక్కరు, ప్రజాప్రతినిధులు అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు, సమావేశాలకు దూరంగా ఉండాలని కేసీఆర్‌ హెచ్చరించినట్లు చెబుతున్నారు.   అవినీతి, అవకతవకలు, కుంభకోణాల్లో ఇరుక్కో వద్దని, తద్వారా అనవసర ప్రచారాలకు, చెడ్డ పేరుకు తావు ఇవ్వొద్దంటూ ముఖ్యమంత్రి  హెచ్చరించారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

పాదయాత్రలో ఉన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ని అరెస్ట్‌ చేయటం, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యల వల్ల తలెత్తిన సంఘటనలను సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా ఉటంకించినట్లు సమాచారం.  గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రశాంత వాతావరణాన్ని బీజేపీ నాయకులు మతం పేరుతో, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ తన సన్నిహిత వర్గాల వద్ద పేర్కొన్నట్లు చెబుతున్నారు.

  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అమలుచేసిన పలు ఆదర్శవంతమైన విధానాల వల్ల దేశ, విదేశాల నుంచి పెట్టుబడులు పెరిగాయని, తద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతున్నాయని ఆయన చెప్పారని సంబంధిత వర్గాలు అన్నాయి. ఈ ప్రగతిని కాపాడుకోవాలని పార్టీ కేడర్ కు దిశా నిర్దేశం చేసినట్లు చెబుతున్నారు.

By
en-us Political News

  
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.