Publish Date:Aug 29, 2022
ఏపీ ప్రభుత్వం గణేష్ మండపాల నిర్వాహకుల నుంచి వసూళ్లు ఆరంభించింది. కరెంట్ చార్జీలు, సౌండ్ బాక్స్లు, మండపాల సైజుల వారీగా భారీగా వడ్డించింది. అనుమతులు కావాలంటే సొమ్ములు చెల్లించకతప్పదని ఖరాకండీగా చెప్పేసింది. అన్నీ చేసినా కూడా చివరికి రాజకీయ ప్రత్యర్థులు అంటే తెలుగుదేశం వారి మండపాలకు అనుమతులు ఇవ్వడం లేదు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వసూళ్లు కేవలం హిందూ పండుగలకే ఎందుకు అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. బీజేపీ అయితే ఒక అడుగు ముందుకు వేసి ఇది హిందూ పండుగలపై ఏపీ సర్కార్ చేస్తున్న దాడిగా ప్రకటించి.. ఎలాంటి రుసుమూ చేసుకోకుండానే మండపాలు ఏర్పటు చేసుకోవాలని పిలుపు ఇచ్చింది. వివాదం పెద్దది అవుతుండటం, ఎక్కడికక్కడ జనం తిరగబడుతుండటంతో ఏపీ సర్కార్ ప్లేట్ ఫిరాయించింది. గణేష్ మండపాల నుంచి ప్రత్యేకంగా ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదని, అదంతా దుష్ప్రచారమేనని ఒక ప్రకటన చేసి చేతులు దులుపుకుంది.
అయితే ఇదంతా దుష్ప్రచారమే అయితే, పండుగ రెండు రోజుల ముందు వరకూ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని మండపాల నిర్వాహకులు నిలదీస్తున్నారు. ఇప్పట వరకూ చేసిన వసూళ్ల సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఏపీలో గణేష్ మండపాలు పెట్టుకోవడానికి నానా ఇబ్బందులు పడ్డామనీ, సర్కార్ హుకుం మేరకు అడిగినంతా చెల్లించామనీ, తీరా ఇప్పుడు పండుగ రెండు రోజులలో ఉందనగా రుసుములేమీ అవసరం లేదంటూ ప్రకటన చేసి చేతులు దులుపుకోవడమేమిటని జనం నిలదీస్తున్నారు.
కోనసీమ జిల్లాలో ఈ సారి పండుగ సందడే కనిపించడం లేదనీ, ఇందుకు ప్రభుత్వ తీరే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండపానికి రోజుకు మండపం సైజును బట్టి కనీసం వేయి రూపాయలు చెల్లించాల్సిందేనని అధికారులు ఖరాకండీగా చెప్పారని స్థానికులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-government-orders-ganesh-mandapams-tp-to-pay-huge-ammounts-25-142848.html
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.