ఆర్సీబీ విజయంపై ఈసీ స్పందన.. నెటిజనులు ఫిదా

Publish Date:May 31, 2026

Advertisement

ఐపీఎల్ 2026 సీజన్  చాంపియన్ గా నిలిచిన  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై ప్రశంసల వర్షం కురుస్తోంది.  దేశవ్యాప్తంగా  క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.  సోషల్ మీడియా వేదికగా అభిమానులు, ప్రముఖులు ఆర్సీబీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  అయితే ఈ భారీ విజయంపై కేంద్ర ఎన్నికల సంఘం   స్పందించిన తీరు  అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.  యువతలో ఓటు హక్కుపై అవగాహన పెంచేందుకు ఈసీ ఆర్సీబీ ఐపీఎల్ చాంప్ గా నిలిచిన సందర్భాన్ని అత్యంత సృజనాత్మకంగా ఉపయోగించుకుంది.  

ఆర్సీబీ అద్భుతవిజయాన్ని ఓటర్ల చైతన్యానికి అనుసంధానిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక  పోస్ట్ పెట్టింది.  ఐపీఎల్ 2026 ట్రోఫీని ముద్దాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు హృదయపూర్వక అభినందనలు. నిజమైన ఛాంపియన్లు ఎప్పుడూ తమ సరైన సమయం కోసం ఎంతో ఓపికగా సిద్ధంగా ఉంటారు. సరిగ్గా అలాగే మీరు కూడా మీ బాధ్యతను నెరవేర్చడానికి సిద్ధం కావాలి. మీకు ప్రస్తుతం 18 ఏళ్లు నిండుతున్నాయా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే ఫారం 6 నింపండి. ఒక ఛాంపియన్‌ తరహాలో మీ ప్రజాస్వామ్య విధిని విజయవంతంగా నెరవేర్చడానికి నడుం బిగించండి. గుర్తుంచుకోండి..  దేశ భవిష్యత్తును మార్చే మీ ఓటు ఎంతో విలువైంది అంటూ ఈసీ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చింది. ఈ ఆసక్తికరమైన పోస్టుకు రన్ మిషన్ విరాట్ కోహ్లీతో పాటు ఆర్సీబీ ఆటగాళ్లు ఐపీఎల్ ఛాంపియన్ ట్రోఫీతో ఎంతో ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్న ఫొటోను జత చేసింది.  

నిజానికి యువతను ఓటు నమోదు దిశగా ప్రోత్సహించేందుకు,  ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం  సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్వీప్)  అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగానే యువతకు బాగా ఇష్టమైన క్రీడలు, పండుగలు, పాపులర్ సినిమాలను ఒక సాధనంగా వాడుకుంటూ దేశంలోని నవతరం ఓటర్లకు మరింత చేరువవ్వడం ఈసీ ప్రధాన వ్యూహం. ఒకవైపు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలనే సందేశాన్ని ఇస్తూనే, మరోవైపు ఆర్సీబీ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని ప్రశంసించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

 కేంద్ర ఎన్నికల సంఘం చేసిన ఈ క్రేజీ పోస్ట్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతంఆసక్తికర చర్చ నడుస్తోంది. దీనిపై నెటిజన్లు, విశ్లేషకుల నుంచి భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈసీ చూపించిన అద్భుతమైన సృజనాత్మకతను,  సమయస్ఫూర్తిని ప్రశంసిస్తుంటే..   మరికొందరు   దేశంలో ఎన్నికల సమర్థవంతమైన నిర్వహణ మరియు ఇరదర కీలకమైన బాధ్యతలపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన ఎన్నికల సంఘం, ఇలాంటి క్రీడా వినోదాలు మరియు ఐపీఎల్ మ్యాచ్ ఫలితాలపై అధికారికంగా స్పందించడం అంత సరికాదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తం మీద ఆర్సీబీ విజయంపై ఈసీ ట్వీట్  తెగ వైరల్ అవుతోంది.

By
en-us Political News

  
మాసిమ్ పట్టణానికి నైరుతి దిశగా సుమారు 32 కిలోమీటర్ల దూరంలో, సముద్ర ఉపరితలం నుంచి 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంత భారీ స్థాయిలో సముద్ర గర్భంలో పలకల కదలికలు సంభవించడంతో, సముద్ర అలలు భారీ ఎత్తున ఎగసిపడే ప్రమాదం ఉందని విశ్లేషించారు.
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో ఒక్కసారియా వెస్ట్ ఆసియా అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఆకస్మిక క్షిపణి దాడులతో జనం తీవ్ర భయాందోళనల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత షెల్టర్లలోకి పరుగులు తీశారు.
నైరుతి తెలంగాణ ప్రవేశం మరో రెండు మూడు రోజుల తరువాతేనని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 10 నుంచి 12 మధ్య రైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్ డేట్ ఇచ్చింది.
కెప్టెన్‌గా గిల్ బ్యాటింగ్ సగటు సుమారు 82.8కి చేరింది. ఇప్పటివరకు టెస్ట్ చరిత్రలో కెప్టెన్‌గా వెయ్యికి పైగా పరుగులు చేసిన 101 మంది ఆటగాళ్లలో ఒక్క డాన్ బ్రాడ్‌మన్ మాత్రమే గిల్ కంటే ఎక్కువ సగటు 99.94 కలిగి ఉన్నారు.
భాగ్యనగర ప్రజలకు అలర్ట్. నగరంలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సరికొత్త ప్రస్థానానికి సిద్ధమైంది.
న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పరుగుల పండగ చేసుకుంది.
తనను చూడాలని ఉందటూ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో అర్ధరాత్రి నిర్వహించిన ఓ సీక్రెట్ ఆపరేషన్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణవ్యాప్తంగా వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు రాష్ట్ర విద్యాశాఖ ఒక అతి ముఖ్యమైన శుభవార్తను అందించింది.
ఏపీలో కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నట్టే 108 అంబులెన్స్ సర్వీసులూ లక్షలాదిమందికి ప్రాణదాతగా నిలుస్తూ సమర్థతను చాటుకుంటున్నాయి.
సినీ రంగంలో నటుడిగా, అద్భుతమైన కొరియోగ్రాఫర్‌గా, విలక్షణ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ చుట్టూ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.