ప‌ర్యావ‌ర‌ణ ర‌క్ష‌ణ అంటే మొక్క‌లు నాట‌డ‌మేనా?

Publish Date:Jun 6, 2022

Advertisement

ప‌రిస‌రాలు బాగుంటే అనారోగ్యం  ద‌రి జేర‌దు  అనేది పూర్వం  నుంచే వుంది.  మ‌న ఇంటి ప‌రిస‌రాలు, ప్రాంతం, మ‌న వూరు, మ‌న ప‌ట్ట‌ణం వీల‌యినంత శుభ్రంగా వుంటే మ‌న‌సు ప్ర‌శాంతంగా వుంటుంద‌నే వారు.   అస‌లు ఎవ‌రికివారు ప‌రిశుభ్ర‌త‌ను పాటించ‌డ‌మ‌న్న‌ది స్వ‌త‌హాగా అబ్బే గుణం. త‌ల్లిదండ్రులు లేదా ఇంట్లో పెద్ద‌వాళ్లు చెబుతూ, ఆ అల‌వాటు చేస్తూంటారు. నిజానికి ఏ మంచి అల‌వాట‌యినా ఇంటి నుంచే అమ‌లు కావాల‌న్న‌ది గొప్ప సూత్రం.

ఇప్పుడు చెట్లు నాటండి  మీ ప్రాంతం అద్భుతంగా మారిపో తుంద‌ని  లోక మంతా రాజ‌కీయ‌, సామాజిక నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు తెగ ప్ర‌చారం చేస్తున్నారు. వాళ్ల త‌ప్పు కాదు.. కాలం  అలా మారింది.  కేవ‌లం మొక్క‌లు నాట‌డం, చెట్ల సంర‌క్ష‌ణ‌తోనే అంతా అయిపోదు. ప‌రిశుభ్ర‌త అనేది మంచి నీరు, గాలి పొంద‌గ‌లిగే ప‌రిస్థితులు క‌ల్పించుకోవ‌డంలోనూ అమ‌లు చేయడంలోనూ ఉంటుంది.  నీరు, గాలి క‌లుషిత‌మ‌యితే అంతే సంగ‌తులు. వాటి ప్ర‌భావం అంతాయింతా కాదు. అనారోగ్యానికి అంతు వుండ‌దు.  ప్ర‌పంచంలో అన్ని ప్రాంతాల్లో జ‌రుగుతున్న యుద్ధాలు,  అర్ధ‌ ర‌హితంగా జ‌రుగుతున్న ప‌రిశ్ర‌మ‌ల విస్త‌ర ణ‌తో  దాదాపు అన్ని దేశాల్లోనూ వాతావ‌ర‌ణ కాలుష్యం,  నీటి  కాలుష్యం పెరిగిపోయింది.

అంద‌రూ పారిశ్రా మిక అభివృద్ధి, రాజ‌కీయ చిత్ర‌ ప‌టంలో మొద‌టి స్థానంలో దేశాన్ని నిల‌బెట్టాల‌న్న ఆకాంక్షే పెరుగుతోంది.  పోనీ అదీ అవ‌స‌ర‌మే అనుకుందాం. కానీ ఆ విధ‌మ‌యిన అభివృద్ధి కూడా సంక్షేమ కార్య్ర‌క‌మాల‌ను స‌క్ర మంగా అమ‌లు చేయ‌డం మీద‌నే ఆధార‌ప‌డింది. సంక్షేమం అంటే ప‌రిస‌రాలు, ప‌ర్యావ‌ర‌ణ సంర‌క్ష‌ణ కూడా అంతే ప్రాధాన్య‌త క‌లిగి వుంటాయ‌న్న‌ది ఇటీవ‌లి కాలం వ‌ర‌కూ పెద్ద దేశాల‌కు ప్ర‌పంచ ప‌ర్యావర‌ణ నిపుణులు, సంఘాలు, సంఘ‌సంస్క‌ర్త‌లూ మొత్తుకుంటూనే వున్నారు. ప్ర‌భుత్వాలు పాల‌సీలు మార్చుకోవాలి. అది త‌ప్ప అన్నీ చేస్తున్నార‌న్న‌ది ప‌ర్యావ‌ర‌ణ నిపుణుల మాట‌.

దాన్ని అంత‌గా ప‌ట్టించు కొన‌క‌పోవ‌డ‌మే మ‌నంద‌రి దుర‌దృష్టం. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు మ‌నమంతా ఒక్క‌టిగా పూనుకోవాలి అంటూ ప్ర‌చారాలు, జాతీయ‌, అంత‌ర్జాతీయ స‌మావేశాలు, చ‌ర్చ‌లు పెట్టుకుని ఫోటోలు తీయించు కోవ డంతోనే అయిపోతోంది. నిపుణులు చెప్పిన‌వి, గోడుపెట్టుకున్న అంశాలు కేవ‌లం ఫైళ్ల‌లో మూలుగుతు న్నాయి. ముఖ్యంగా జ‌ల‌, వాయు కాలుష్యాల విష‌యంలో ప్ర‌భుత్వాలు ఎలాంటి గొప్ప చ‌ర్య‌లూ తీసుకో లేదు. అది వారికీ తెలియ‌క‌ పోదు. కానీ రాజ‌కీయాల్లో త‌ల‌మున‌క‌ల‌యి,  పీఠాల‌ను కాపాడుకోవ‌డంలో ప‌ర్యా వర‌ణం గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఏదో ఏడాది కోమారు ఏ నిపుణుడో గ‌ట్టిగా ఏ మూల‌నో అరిస్తే, పెద్ద వ్యాసంతో భ‌య‌పెడితే త‌ప్ప ఆ సెగ నాయ‌కుల‌కు తగల‌డం లేదు. ఆ స్పృహ వున్న‌వారు  వారి మాట ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని బాద‌ప‌డ‌టం త‌ప్ప మ‌రోటి చేయ‌లేరు. ఎన్నాళ్లు ఎంద‌రితో పోరాడాలి?  రాజు కంటే మొండివాడే గొప్ప‌,  ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు గోడుపెడుతుంటారు, ప్ర‌భుత్వాధిప‌తులు, అధికారులు మునులయి విని వూరుకుంటున్నారు.

అంత‌ర్జాతీయ స్థాయిలో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ గురించిన ఆలోచ‌న 1970ల్లోనే  చేసేరు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర క్ష‌ణ దినం పాటించాల‌ని పూనుకున్నారు. 143 దేశాలు ఇందుకు కంక‌ణం క‌ట్టుకుని 1974లో తీర్మానం చేసాయి. ప్ర‌తీ ఏడూ జూన్ 5వ తేదీని ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినంగా త‌ప్ప‌కుండా పాటించాల‌ని  ప్ర‌క‌టిం చారు.  ప్ర‌పంచదేశాల్లో ముఖ్యంగా ఆర్ధికంగా, అభ‌వృద్ధిప‌రంగా బాగా వెనుక‌బ‌డిన దేశాల ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జారిపోకుండా వుండాలంటే ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకోవ‌ల‌సిన బాధ్యత‌ను అక్క‌డి ప్ర‌భుత్వా లు త‌ప్ప‌కుండా పాటించి తీరాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తీర్మానించింది. ఐక్య‌రాజ్య స‌మితి ఆధ్వ‌ర్యం లో ఏర్ప‌డిన సంస్థ ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ జాగ్ర‌త్త‌ల విష‌య‌మై అనేక విధాల ప్ర‌చారాలు,ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ ప్ర‌జ‌ల్లో ప‌ర్యావ‌ర‌ణ స్పృహ పెంచ‌డానికి ఎంతో కృషి చేస్తున్న‌ది. అంత‌ర్జాతీయ‌ స్థాయి గురించి చ‌ర్చించ‌కునే ముందు మ‌న‌ దేశం, మ‌న ప్రాంతం ప‌ర్యావ‌ర‌ణ ప‌రంగా ఎంత చ‌క్క‌గా వున్న‌దీ లేనిదీ ప‌రిశీలించుకోవాల్సిన అవ‌స‌రం ఎప్ప‌టికీ కీల‌క‌మే.  జ‌ల‌, వాయు కాలుష్యాలు, పారిశ్రామిక‌వాడ‌ల విస్త‌ర‌ణ‌లు వాటివ‌ల్ల క‌లుగుతున్న దుష్ప్ర‌భావాల‌ను అరిక‌ట్ట‌డానికి ప్ర‌తీ ఒక్క‌రూ కంక‌ణం క‌ట్టుకోవాలి.  

అనారోగ్యం, అ విద్య‌తో బాధ‌ప‌డే కంటే సామాజిక, ప‌ర్యావ‌ర‌ణ స్పృహ పెంచు కోవ‌డం ఎంతో అవ‌స‌రం.  అందువల్ల ప్ర‌భుత్వాలు ప్ర‌క‌ట‌న‌ల‌కు,ఉప‌న్యాసాలు, చ‌ర్చ‌ల‌కే ప‌రిమితం కాకుండా  వాస్త‌వ ప‌రిస్థితుల ప‌ట్ల దృష్టి సారించితే మాన‌వ మ‌నుగ‌డ మ‌రింత మెరుగుప‌డుతుంది.  అభివృద్ధి చెందుతున్న దేశం మ‌న‌ది అంటున్నామే గాని ఇంకా క‌లుషిత నీటి వ‌ల్ల లెక్క‌లేన‌న్ని మ‌ర‌ణాలు సంభవిస్తున్నాయి. అడ‌వుల న‌రికివేత‌తో గిరిజ‌న‌, ఆట‌విక కుటుంబాలు జీవితాలు కోల్పోతు న్నాయి.  ప‌ర్యావ‌ర‌ణ అంశం కూడా  చాలా సీరియ‌స్‌గా ప‌ట్టించుకోవాలి. కేవ‌లం జూన్ 5న ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం జ‌ర‌ప‌డం, నిపుణుల‌తో ఉప‌న్యాసాలు చెప్పించ‌డం, వ్యాసాలు రాయించి వూరుకోవ‌డం కాకుండా వారిచ్చే సూచ‌న‌లు, స‌ల‌హాలు కాస్తం

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.