వైసీపీకి బిగ్‌ షాక్‌.. ఇద్ద‌రు ఐపీఎస్ ల‌పై ఈసీ బ‌దిలీ వేటు

Publish Date:Apr 23, 2024

Advertisement

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ వైసీపీ స‌ర్కార్ కు ఈసీ బిగ్‌ షాక్ ఇచ్చింది. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఇద్ద‌రు ఐపీఎస్ అధికారుల‌పై  ఈసీ బ‌దిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజ‌నేయులు, విజ‌య‌వాడ సీపీ కాంతిరాణాను బ‌దిలీ చేస్తూ ఎన్నిక‌ల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వీరిద్ద‌రూ ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కు ఎలాంటి ఎన్నిక‌ల విధుల్లో పాల్గొన‌వ‌ద్ద‌ని,  ఎన్నిక‌ల‌కు సంబంధంలేని విధుల‌ను వీరికి అప్ప‌గించాల‌ని ఆదేశించింది. వీరి స్థానంలో ఒక్కో పోస్టుకు ముగ్గురేసి   పేర్ల‌తో కూడిన ప్యానెల్‌ను బుధ‌వారం (ఏప్రిల్ 24) మ‌ధ్యాహ్నం 3గంట‌ల లోపు పంపించాల‌ని, అధికారుల వార్షిక ప‌నితీరు నివేదిక ఆధారంగా పేర్లు సూచించాల‌ని ఈసీ స్ప‌ష్టం చేసింది. గ‌తంలోనూ ఆరుగురు అధికారుల‌పై ఈసీ బ‌దిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ ప‌లువురు ఐపీఎస్‌, ఐఏఎస్‌లు  వైసీపీకి అనుకూలంగా ప‌నిచేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల‌ను ప‌రిశీలించిన ఎన్నిక‌ల సంఘం.. ఎన్నిక‌ల కోడ్ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా అధికార వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ముగ్గురు ఐఏఎస్‌లు, ఆరుగురు ఐపీఎస్‌లపై ఈసీ గతంలోనే బదిలీ వేటు వేసింది.  తాజాగా మ‌రో ఇద్ద‌రు ఐపీఎస్ అధికారుల‌పై ఈసీ బ‌దిలీ వేటువేసి వైసీపీకి షాకిచ్చింది.

 ఏపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోలీస్ వ్య‌వ‌స్థ‌తో పాటు ప‌లువురు అధికారుల‌ను వైసీపీ కార్య‌క‌ర్త‌లుగా మార్చేసుకుని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఐదేళ్ల పాల‌న‌లో అభివృద్ధిని మ‌రిచి కేవ‌లం క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కే ప‌రిమిత‌మైన జ‌గ‌న్‌.. పోలీసుల‌ను అడ్డుపెట్టుకొని వైసీపీ వ్య‌తిరేకుల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డంతోపాటు ప‌లువురిని పోలీస్ స్టేష‌న్‌ల‌లో చిత్ర‌హింస‌ల‌కు గురిచేశారు. గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై గొంతెత్తిన వారిపై పోలీసులు అక్ర‌మ కేసులు బ‌నాయిస్తూ ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పై ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించారు. ఐదేళ్ల‌పాటు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అరాచ‌కాల‌ను భ‌రించిన ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రాగానే ఊపిరిపీల్చుకున్నారు. అయినా  ప‌లువురు ఐపీఎస్‌, ఐఏఎస్ అధికారులు వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు. కోడ్ ను లెక్క చేయకుండా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. దీంతో, బీజేపీ, కాంగ్రెస్‌, తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల నేత‌లు వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప‌లువురు ఐపీఎస్‌, ఐఏఎస్ అధికారుల‌పై ఈసీకి ఫిర్యాదులు చేయ‌డంతో.. ఈసీ ఫిర్యాదుల‌పై క్షేత్ర‌స్థాయిలో నిజానిజాల‌ను నిగ్గుతేల్చుకొని ఐపీఎస్‌, ఐఏఎస్‌ల‌పై బ‌దిలీ వేటు వేసింది.   కొద్దిరోజుల క్రితం తొమ్మిదిపై బ‌దిలీ వేటు ప‌డ‌గా.. తాజాగా ఇంటెలీజెన్స్ డీజీ, విజ‌య‌వాడ సీపీల‌పై ఈసీ బ‌దిలీ వేటు వేసింది.  

ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజ‌నేయులు, విజ‌య‌వాడ సీపీ కాంతిరాణాల‌పై విప‌క్ష నేత‌లు ఈసీకి అనేక సార్లు ఫిర్యాదు చేశారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బ‌స్సు యాత్ర చేప‌ట్టారు. బ‌స్సు యాత్ర విజ‌య‌వాడ‌లోని అజిత్ సింగ్ న‌గ‌ర్ ప్రాంతంకు చేరుకోగానే రాయిదాడి ఘ‌ట‌న జ‌రిగింది. ఈ దాడిలో సీఎం జ‌గ‌న్ కంటి పైభాగంలో గాయ‌మైంది. రాయిదాడి ఘ‌ట‌నకు పోలీసుల‌తోపాటు ఇంటెలిజెన్స్  విభాగం వైఫ‌ల్యం కార‌ణ‌మ‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం సీపీ కాంతిరాణా నుంచి నివేదికను అందుకుంది. జ‌గ‌న్‌పై రాయిదాడి ఘ‌ట‌న‌లో పోలీసుల వైఫ‌ల్యంతో పాటు ఇంటెలిజెన్సీ విభాగం వైఫ‌ల్యం కూడా కార‌ణ‌మ‌ని ఈసీ నిర్దార‌ణ‌కు వ‌చ్చింది. దీనికితోడు ఇంటెలిజెన్స్ డీజీ, విజ‌య‌వాడ సీపీ కాంతిరాణాలు వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు ఈసీకి ఫిర్యాదు చేశారు. చిల‌క‌లూరి పేట ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పాల్గొన్న‌ స‌భ‌లో భ‌ద్ర‌తా వైఫ‌ల్యాల‌తో పాటు, ఎక్క‌డిక‌క్క‌డ చెక్ పోస్టులు పెట్టి కార్య‌క‌ర్త‌లు స‌భా ప్రాంగ‌ణానికి చేరుకోకుండా ఇంటెలిజెన్స్ డీజీ ఇబ్బంది పెట్టార‌ని, చాలా మంది విప‌క్ష నేత‌ల అక్ర‌మ అరెస్టుల‌కు కూడా ఆయ‌నే బాధ్యులుగా ఉన్నార‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు ఈసీకి ఫిర్యాదు చేశాయి. సీఎం జ‌గ‌న్‌పై రాయిదాడి ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకున్న ఈసీ.. ప్ర‌తిప‌క్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల‌ను కూడా  ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని విచార‌ణ చేసింది. ఈ విచార‌ణ‌లో ఇంటెలిజెన్స్ డీజీ, విజ‌య‌వాడ సీపీపై ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని తేల‌డంతో వారిద్ద‌రిపై ఈసీ బ‌దిలీ వేటువేసింది.
 
ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సేవలో తరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిలదే తరువాతి వంతు అన్న చర్చ రాజకీయ అధికార వర్గాల్లో జోరుగా జరుగుతోంది. వారిద్దరినీ  ఆ పదవుల నుంచి పక్కకు తప్పించడం ఖాయమని అంటున్నారు. సీఎస్‌ జవహర్‌ రెడ్డి తొలినుంచీ జగన్‌ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నారనీ,  ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత కూడా ఆయన వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రాలేదనీ చెబుతున్నారు. ముఖ్యంగా పింఛన్ల పంపిణీకి వలంటీర్లను దూరంగా ఉంచాలన్న ఈసీ ఆదేశాలను ఆసరాగా తీసుకుని.. ఉద్దేశపూర్వకంగానే పింఛన్ల పంపిణీని ఆలస్యం చేసి, ఆ పాపాన్ని విపక్షాలపై నెట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. దీనికితోడు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు సీఎస్ తీరుపై ఈసీకి ఫిర్యాదు చేశాయి. పోలీస్‌ బాస్‌ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డిపైనా బదిలీ వేటుకు ఈసీ రంగం సిద్ధమైనట్లు సమాచారం. రాజేంద్ర‌నాథ్ రెడ్డి ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన త‌రువాత‌కూడా వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం పంపించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం వారిపై నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. అక్క‌డ నుంచి  ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎస్‌, డీజీపీపై వేటు పడటం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి ఎన్నిక‌ల కోడ్ స‌మ‌యంలోనూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోసం ప‌నిచేస్తున్న ఐపీఎస్‌, ఐఏఎస్ అధికారుల‌పై ఈసీ కొరడాఝుళిపిస్తోంది. రానున్న రోజులలో మరింత మంది అధికారులపై ఈసీ చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

By
en-us Political News

  
మామూలు ఓట్లతో మెజారిటీలు సాధిస్తే పోస్టల్ బ్యాలెట్ లెక్కించినా నామమాత్రం అవుతుంది. కానీ ఈసారి నెక్ టూ నెక్ గా ఏపీలో పోరాటం ఉంది. వంద, యాభై, పాతిక, పదీ ఓట్ల తేడాతో కూడా అభ్యర్ధుల గెలుపు ఉండనుంది. దాంతో అపుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లే డిసైండ్ ఫ్యాక్టర్ గా మారనున్నాయి. అందుకే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కి ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యత పెరిగింది.
మాట తప్పను మడమ తిప్పను అనే జగన్ ఇచ్చిన మాటకు పూచిక పుల్లంత విలువ కూడా ఇవ్వరన్న సంగతి ఈ ఐదేళ్ల కాలంలో పదే పదే రుజువైంది. మాట ఇవ్వడం మడమ తప్పటం అన్నది జగన్ నైజంగా జనం భావించే పరిస్థితికి వచ్చేశారు.
నార్సీ వ్యాధికి వున్న కొన్ని లక్షణాలను ఫస్ట్ పార్ట్.లో చెప్పడం జరిగింది. ఈ మానసిక వ్యాధిగ్రస్థులకి వుండే మరికొన్ని లక్షణాలను చూద్దాం.
మనీలాండరింగ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇప్పట్లో ఊరట లభించే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే . గత ఏడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ సిఎం మనీష్ సిసోడియాకు ఇంత వరకు బెయిల్ లభించలేదు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. అసలు స్వరూపం ఏమిటో మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ బట్టబయలు చేశారు. ఆ యాక్ట్ ను తీసుకువచ్చేసి.. ఇంకా అమలులోకి రాలేదు. పరిశీలనలో ఉంది అంటూ ఏపీ మంత్రులు చేస్తున్న ప్రకటనల డొల్ల తనాన్ని ఆయన ఒకే ఒక్క ట్వీట్ తో బయటపెట్టేశారు. తాను ప్రత్యక్ష బాధితుడిని అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాష్ట్రంలో దుమారం రేపుతోంది. జగన్ ప్రభుత్వ దొడ్డిదారి యవ్వారాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
జగన్‌కి వున్న మానసిక వ్యాధి గుట్టు రట్టయింది.. ఆ వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’, షార్ట్‌కట్‌లో ‘నార్సీ’ అంటారు.
హైదరాబాద్ బిజెపి అభ్యర్థి మాధవిలత తరపున కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్ షో తర్వాత కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటయ్యాయి. ప్రత్యర్థి బిజెపి అభ్యర్థిని ఎదుర్కోవడానికి ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించాలని నిర్ణయించాయి.
ఒక నాయకుడు ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే వారి మనస్సులు గెలవాలి. అయితే ఇంట్లోనే ఆయన తీరుకు, వైఖరికీ నిరసన వ్యక్తం అవుతుంటే..సొంత కుటుంబ సభ్యులే బయటకు వచ్చి తమ వారిని నమ్మొద్దని చెబుతుంటే ఆ నేతను జనం ఎలా నమ్ముతారు. ఎందుకు విశ్వసిస్తారు. ముందు ఇంట గెలు.. ఈ తరువాత రచ్చగెలవడం గురించి ఆలోచించు అంటారు కదా?
ఏపీ ఇన్‌ఛార్జ్ డీజీపీగా శంఖబ్రతా బాగ్చి నియమితులయ్యారు. ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయి డీజీపీని నియమించేవరకు బాగ్చి డీజీపీ
చంద్రబాబు చండ్ర నిప్పులు చెరిగారు. తన స్వభావానికి విరుద్ధంగా ఆగ్రహాన్ని ప్రదర్శించారు. స్కిల్ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేసిన్పుడు కూడా ఆయన శాంతంగానే ఉన్నారు. న్యాయస్థానాలలోనే తేల్చుకుంటానని, తనపై కేసే తప్పంటూ క్వాష్ పిటిషన్ వేశారు. ఎక్కడా ఆగ్రహం ప్రదర్శించలేదు. జనాలకు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎ వేటు వేసింది. అయితే ఇప్పటికే ఆలస్యమైపోయిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎన్నికల సంఘం తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాల ఫిర్యాదులు, ఆరోపణలకు పూచికపుల్ల విలువ ఇవ్వకుండా ఎన్నికల సంఘం వ్యవహరించిందని అంటున్నారు.
ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలాంటిదని చెప్పవచ్చు. పార్టీకి వ్యతిరేక పవనాలు వీచిన 2019 ఎన్నికలలో కూడా ప్రకాశం జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో తెలుగుదేశం విజయం సాధించింది. అయితే దర్శినియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఒకింత భిన్నంగా మారాయి.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (మే6) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 19 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.