Publish Date:Nov 26, 2024
దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న ఆరు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం (నవంబర్ 26) ప్రకటించింది. వీటిలో ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే మూడు రాజ్యసభ స్ధానాలు ఉన్నాయి.
వైసీపీ ఎంపీలు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్. కృష్ణయ్యలు ఇటీవల తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ మూడు కాకుండా ఒడిశా, బెంగాల్, హర్యానాలలో కూడా ఖాళీగా ఉన్న ఒక్కో రాజ్యసభ స్థానాలకూ కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి.
కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ డిసెంబర్ 3న వెలువడుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేది డిసెంబర్ 10 కాగా డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు తుది గ డువు డిసెంబర్ 13. పోలింగ్ డిసెంబర్ 20వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన ఉంటుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ec-announces-rajyasabha-by-election-schedule-25-189013.html
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.