హిమాచల్ లో ఎన్నికల నగారా.. గుజరాత్ ఊసే లేదు!

Publish Date:Oct 14, 2022

Advertisement

కేంద్ర ఎన్నికల సంఘం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. శుక్రవారం ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం వచ్చెనెల 12న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం   హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ నెల 17న విడుదల కానుంది. అదే రోజు నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు సమయం ఉంటుంది.

సాధారణంగా 6 నెలల్లోపు అసెంబ్లీల పదవీ కాలం ముగుస్తున్న రాష్ట్రాలన్నిటికీ కలిపి ఒకే సారి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్‌ మాత్రం గుజరాత్ ను వదిలి కేవలం హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మాత్రమే విడుదల చేయడం పట్ల విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.  హిమాచల్‌ ప్రదేశ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 8కి ముగుస్తుండగా, గుజరాత్ అసెంబ్లీ గడువు  వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ముగుస్తుంది.  హిమాచల్‌, గుజరాత్‌ రాష్ట్రాలలో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి, ప్రతిపక్షాలను తిప్పిగొట్టేందుకు వ్యూహరచన చేసే అవకాశం మోదీ సర్కారుకు ఇచ్చేందుకే వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హిమాచల్‌ అసెంబ్లీతో పాటు గుజరాత్‌కు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించకపోవడాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తప్పుపట్టారు.  గుజరాత్ లో భారీ వాగ్దానాలు, ప్రారంభోత్సవాలు చేయడానికి ప్రధాని మోదీకి తగిన సమయం లభించాలన్న ఉద్దేశంతోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకుండా జాప్యం చేశారని విమర్శించారు. అయితే ఈ విమర్శలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన చేయడంలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని స్పష్టం చేసింది.

శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని హిమాచల్‌ షెడ్యూల్‌ను ముందుగా విడుదల చేసినట్లు పేర్కొంది.  రెండు రాష్ట్రాల అసెంబ్లీల గడువు ముగియడానికి  మధ్య 40 రోజుల వ్యవధి ఉందనీ, నిబంధనల ప్రకారం ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మరో రాష్ట్రంపై ప్రభావం చూపకుండా ఉండాలంటే 30 రోజుల వ్యవధి సరిపోతుందని చెప్పారు. అంతే కాకుండా 2017లో కూడా ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా షెడ్యూల్‌ ప్రకటించిన విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తు చేసింది. అప్పట్లో అక్టోబరు 13న హిమాచల్‌ ప్రదేశ్‌కు, 25న గుజరాత్‌కు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసినట్లు  తెలిపింది.

By
en-us Political News

  
లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు చేపట్టిన నషా ముక్త్ భారత్ యాత్రకు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
తమిళనాడులో సంచలనం సృష్టించిన మహిళా ఐఏఎస్ అధికారిణి వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
మదురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద శనివారం దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో పర్యటించారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో అనూహ్య విమాన ఘటన చోటుచేసుకుంది.
సైబరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కొత్త చర్యలకు సిద్ధమవుతోంది.
ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై హెచ్చరిక చిహ్నాల అమలులో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సర్వం సిద్ధమైంది.
హైదరాబాద్ నగరంలోని రేతిబౌలి ప్రాంతంలో జరిగిన పెళ్లి ఊరేగింపులో కత్తులు చేతబట్టి నృత్యం చేసిన నలుగురు వ్యక్తులను గుడిమల్కాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.