నటసింహం ఆప్తుడు తన్నులు తిన్నాడు

Publish Date:Nov 7, 2015

Advertisement



సింహం గుడ్డిదైతే ఎలుకలు ఎకసెక్కాలాడాయంట...! ఇప్పుడు తన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా కళ్ళుమూసుకున్న నటసింహం పరిస్థితి కూడా అలాగే తయారైంది. నటసింహం నిజంగానే సింహమే... కానీ ఆయన చుట్టు వున్నది మాత్రం ఎలుకలు కాదు... ఏకంగా పందికొక్కులు... ఇసుకను బొక్కేసే పందికొక్కులు. శాండ్‌ని శాండ్‌విచ్‌లాగా మింగేసే ప్రయత్నంలో ఆ పందికొక్కుల కీచులాటలు నటసింహం ప్రతిష్టకే ఇబ్బందికరంగా మారే పరిస్థితులు వచ్చాయి.

అసలింతకీ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుకే బంగారమైపోయింది. బెల్లం వున్న చోట ఈగలు మూగినట్టు ఇసుక వున్న చోట ఇసుక బకాసురుల మాఫియా మూగుతోంది. ఆంధ్రప్రదేశ్ అధికార ప్రముఖుడు నటసింహం చుట్టూ తిరిగే ఒక వ్యక్తికి తూర్పు గోదావరి జిల్లాలోని ఒక ఇసుక ర్యాంపు మీద కన్నుపడింది. నటసింహం పేరు చెప్పి ఆ ఇసుక ర్యాంపును బినామీ పేరుతో సొంతం చేసుకున్నాడు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా ఆ ఇసుక ర్యాంపు కొనుగోలుకు అవసరమైన డబ్బు కోసం కొంతమందిని పార్టనర్లుగా చేర్చుకున్నాడు. సొంత పార్టీలో ఎవరూ లేనట్టుగా ప్రతిపక్ష హోదాకూడా లేని ఓ పార్టీకి చెందిన వ్యక్తిని ఒక పార్టనర్‌గా చేర్చుకున్నాడు. ఆ పార్టనర్ మరెవరో కాదు... దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ఆత్మకి ఆత్మబంధువుగా ఒక వెలుగు వెలిగిన వ్యక్తికి స్వయానా బావమరిది. వీళ్ళంతా కలసి ‘నటసింహం’ పేరు ఉపయోగించుకుంటూ మూడు జేసీబీలు ఆరు లారీల్లాగా ఇసకని రొల్లుకున్నారు..

ఇంతవరకూ బాగానే వుందిగానీ, ఆ తర్వాతే అసలు ప్రాబ్లం వచ్చింది. ఈమధ్య తూర్పు గోదావరి జిల్లాలోని ఇసుక ర్యాంపు  ద్వారా వచ్చిన కొన్ని కోట్ల రూపాయలని మన నటసింహం గారి తాలూకు వ్యక్తి  గప్‌చుప్‌గా తన జేబులో వేసేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన సదరు బావమరిది ఆవేశంతో రగిలిపోయాడు. నువ్వు జేబులో వేసుకున్న డబ్బులో నా వాటా నాకివ్వు అని డిమాండ్ చేశాడు. అయితే నటసింహం తాలూకు మనిషి ఈ డిమాండ్‌ని ఎంతమాత్రం పట్టించుకోలేదు. రేపు మాపు అని తిప్పుకోవడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వడు.. లెక్కలు చెప్పడు... డబ్బులు గట్టిగా అడిగితే ఎక్కువగా మాట్లాడితే నటసింహంతో నీ గురించి బ్యాడ్‌గా చెబుతా అని బెదిరించడం మొదలెట్టాడు. దాంతో బావమరిది గారికి ఫుల్లుగా కోపం వచ్చేసింది. నటసింహం తోకలాంటి సదరు వ్యక్తినిహైదరాబాద్‌లోని ఒక స్టార్ హోటల్‌కి పిలిపించాడు. అక్కడ అతన్ని ఆ ఎడాపెడా తన్నాడు. దాంతో ఈ విషయం పెద్ద ఇష్యూ అయి కూర్చుంది. ప్రస్తుతం ఈ విషయంలో ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అయితే ఈ అంశంలో ఇద్దరూ ఇసుక మింగే పందికొక్కులే. కాకపోతే ఈ పందికొక్కులకారణంగా సింహం లాంటి నటసింహానికి చెడ్డపేరు వస్తోంది. నటసింహం ఎవరు ఎలాంటివారో తెలుసుకోకుండా తనచుట్టూ చేర్చుకోవడం వల్ల వాళ్ళు ఇలాంటి అవినీతి పనులకు పాల్పడుతూ నటసింహానికి చెడ్డపేరు తెస్తున్నారు. నటసింహానికి తోకలాగా వుండే వ్యక్తిని వైఎస్సార్ ఆత్మకి బామ్మర్ది కొట్టాడన్న విషయం ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో మార్మోగుతోంది. ఈ విషయం నలుగురికీ తెలిసినా నటసింహానికి తెలియకపోవడం ఆశ్చర్యకరమే.  అందువల్ల మచ్చలేని చంద్రుడి లాంటి నటసింహం ఇప్పటికైనా కళ్ళు తెరిచి జూలు విదల్చాలని, తన చుట్టూ వున్నవాళ్ళు చేస్తున్న అవకతవకలను అరికట్టాలని, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునేవాళ్ళని దూరంగా పెట్టాలని ఆయన్ని అభిమానించేవారు కోరుకుంటున్నారు.

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.