తగ్గుతున్న రిలయన్స్ పన్నుల చెల్లింపు
Publish Date:Mar 10, 2012
Advertisement
తూర్పుగోదావరి జిల్లా: తూర్పుగోదావరి జిల్లాలో వాణిజ్య పన్నులశాఖకు ప్రధానంగా పన్నుల రూపంలో చమురు సంస్థలు ఆదాయాన్ని ఇస్తున్నాయి. రిలయన్స్, ఓఎన్ జిసి, గెయిల్ సంస్థల నుంచి ఏటా వందలాదికోట్ల రూపాయలు వాణిజ్య పన్నుల రూపంలో ఇస్తున్నాయి. రిలయన్స్, ఓఎన్ జిసి, గెయిల్ సంస్థల నుంచి ఏటా వందలాదికోట్ల రూపాయలు వాణిజ్య పన్నుల రూపంలో తూర్పుగోదావరి జిల్లా: తూర్పుగోదావరి జిల్లానుంచి లభిస్తున్నాయి. నిజానికి ఈ పన్నుల రాబడి ఏటేటా పెరగాల్సి ఉండగా, అనూహ్యంగా రిలయన్స్ మాత్రం పన్నులను తక్కువగా కడుతోంది. గత ఏడాది రిలయన్స్ రూ.471 కోట్లు వాణిజ్య పన్నుల రూపంలో చెల్లించగా వర్తమాన సంవత్సరంలో 373 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇదే సమయంలో ఓఎస్ జిసి చెల్లించిన వాణిజ్య పన్నులు రూ.129 కోట్లనుంచి రూ.167 కోట్ల వరకు, గెయిల్ సంస్థ చెల్లించిన వాణిజ్య పన్నులు 21 కోట్లనుంచి 78కోట్లకు పెరిగాయి. ప్రభుత్వ రంగానికి చెందిన రెండు చమురు, గ్యాస్ సంస్థల వాణిజ్య పన్నుల చెల్లింపు ఏటేటా పెరగుతుండగా రిలయన్స్ పన్నులు మాత్రం తగ్గుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. రిలయన్స్ వెలికి తీస్తున్న బావుల్లో చమురు తగ్గిపోవడం వల్ల ఉత్పత్తి తగ్గి ఆ మేరకు వాణిజ్య పన్నులు తగ్గుతున్నాయని ఆ సంస్థ అధికారులు అంటున్నారు. అయితే వీటికి సమీపాన గల ఓఎన్ జిసి బావుల నుంచి చమురు ఉత్పత్తి ఏమాత్రం తగ్గలేదు సరికదా మరింత పెరగడంతో ఆ సంస్థ పన్నులచెల్లింపు కూడా 20శాతం పెరిగింది. దీంతో రిలయన్స్ చెప్పే వాదనల్లో నిజం లేదని వెల్లడవుతుంది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడితే తప్ప నిజానిజాలు వెల్లడి కావని స్థానికులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/east-godavari-24-12535.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





