ఏపీలో భూ ప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనాలు

Publish Date:Apr 4, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో  ఆదివాకం (ఏప్రిల్ 5) తెల్లవారుజామున   భూమి కంపించింది. జనం అంతా గాఢ నిద్రలో ఉన్నవేళ ఒక్కసారిగా భూమి కంపించడంతో క ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రకంపనల ప్రభావం పొరుగున ఉన్న విశాఖపట్నంలో కూడా కనిపించింది.  భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగుతు తీశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్  సమాచారం ప్రకారం, ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.7గా నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని హుకుంపేట మండలం జోగులపుట్టు గ్రామాన్ని   భూకంప కేంద్రంగా   గుర్తించారు. భూ అంతర్భాగంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు సంభవించాయి. 

తెల్లవారుజామున సుమారు 4:19 గంటల సమయంల  విశాఖపట్నంలోని అరిలోవ, మాధవధార, ఆక్కయ్యపాలెం, ఎంవీపీ కాలనీ, గాజువాక వంటి ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. నిద్రలో ఉన్న వారు ఒక్కసారిగా మంచాలు కదలడం, గృహోపకరణాలు కిందపడటంతో తీ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగలేదు. 

ఉత్తరాంధ్ర ప్రాంతంలో గతంలోనూ ఇటువంటి స్వల్ప ప్రకంపనలు అక్కడక్కడా సంభవించిన దాఖలాలు ఉన్నాయి. భూమి లోపల ఉండే ప్లేట్ల కదలికల వల్ల ఇలాంటి స్వల్ప భూకంపాలు సంభవిస్తాయని భూగర్భ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఆదివారం ఉదయం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో తమిళ సినీ నటుడు ఆర్యపై చీటింగ్ కేసు నమోదైంది.
రంగారెడ్డి జిల్లాలో ఒక బాధ్యతాయుతమైన పోలీసు అధికారి ప్రవర్తించిన తీరు ఇప్పుడు స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.
మారువేషంలో వచ్చిన మంత్రికి చేదు అనుభవం..
భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో తన అద్భుతమైన గాత్రంతో ఆరు దశాబ్దాల పాటు శ్రోతలను ఓలలాడించిన గానకోకిల ఎస్. జానకి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని దైవాలగూడ గ్రామంలో ఒకే ఒక్క అరగంట వ్యవధిలో ఆరుగురిని అత్యంత కిరాతకంగా నరికి చంపి
విశాఖపట్నం నగరంలో ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ప్రస్తుత సీజన్‌లో ఎల్ నినో పంజా విసరడం వల్ల రాయలసీమతో పాటు కోస్తాంధ్రలో అన్నపూర్ణగా పేరొందిన జిల్లాలపై తీవ్ర ప్రభావం పడింది. ఎండల తీవ్రతకు జలాశయాల్లోని నీరు ఆవిరైపోయే పరిస్థితులు తలెత్తాయి. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రధాన ప్రాజెక్టులు ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ వైపు నుంచి ఎగువ ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోయాయి.
తన సతీమణి సాధించిన ఈ గొప్ప విజయం పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఫార్చ్యూన్ ఇండియా అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో బ్రాహ్మణి చోటు దక్కించుకోవడం తనకు గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. ఆమె భవిష్యత్తులోనూ ఇదే ఉత్సాహంతో ముందడుగు వేస్తూ, మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి, ఆదర్శంగా నిలవాలని నారాలోకేష్ ఎక్స్ వేదికగా షేర్ చేసిన పోస్టులో ఆకాంక్షించారు.
భారతీయ మార్కెట్లో మిడ్, స్మాల్ క్యాప్స్ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కొత్త త్రైమాసికంలో కల్యాణ్ జ్యువెలర్స్, టీసీఎస్ లలో ఇన్వెస్ట్ చేయడానికి నిపుణులు ఇస్తున్న బెస్ట్ స్ట్రాటెజీ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద మెగా డ్యామ్ కింద ప్రమాదకరమైన భూకంప రేఖ ఉన్నట్లు చైనా శాస్త్రవేత్తలే గుర్తించారు. ఈ ప్రాజెక్టుతో భారత్‌కు పొంచి ఉన్న ముప్పేంటి? పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
AMFI తాజా జూన్ డేటా ప్రకారం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు ఫ్లెక్సీ క్యాప్ కంటే మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. 30 నెలల తర్వాత జరిగిన ఈ మార్పునకు కారణాలు, వాటి రిటర్న్స్ వివరాలు ఇక్కడ చూడండి.
అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ముగిసిందని డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 90కి పైగా సైనిక స్థావరాలపై అమెరికా దాడులు చేయగా, ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. పెరిగిన ముడి చమురు ధరల వివరాలు మరియు తాజా పరిణామాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.