తెలుగు రాష్ట్రాలలో బుధవారం (డిసెంబర్ 4) భూమి కంపించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో పలు ప్రాంతాలలో ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. ఈ భూప్రకంపనలు కనీసం రెండు నుంచి మూడు సెకండ్లు సంభవించినట్లు సమాచారం. తెలంగాణలోని హైదరాబాద్, హనుమకొండ, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, గోదావరి ఖని, భూపాలపల్లి, చిర్ల, చింతకాని, ములుగు, భద్రాచలంలలో భూమి కంపించింది. అలాగే ఏపీలో విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం ప్రాంతాలలో కూడా భూమి కంపించింది.
భూమి కంపించడంతో భయభ్రాంతులకు గురైన జనం ఒక్క సారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప కేం్దరం ములుగు జిల్లాలో ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. భూమి లోపల 40 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు చెప్పారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. ఎటువంటివ ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/earth-quake-in-telugu-states-25-189402.html
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.