కొత్త సంవత్సరం ప్రారంభ వేళ జపాన్‌ను భారీ భూకంపం కుదిపేసింది. జపాన్ తూర్పు నోడా తీర ప్రాంతంలో బుధవారం (డిసెంబర్ 31) భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6గా నమోదైంది. కొత్త సంవత్సర వేడుకలకు జపాన్ ముస్తాబవుతున్న వేళ భూమి కంపించడంతో జనం భయంతో వణికిపోయారు.
నోడా నగరానికి తూర్పున 91 కిలోమీటర్ల దూరంలో.. సముద్ర మట్టానికి 19.3 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు. అయితే గత కొన్ని వారాలుగా జపాన్ లో తరచూ భూమి కంపిస్తున్నది. డిసెంబర్ 8న జపాన్ ను రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో సంభవించిన భూకపంపం అతలా కుతలం చేసిన సంగతి తెలిసిందే. ఆ భూకంపం కారణంగా దాదాపు 90 వేల మంది నిరాశ్రయులయ్యారు. అప్పట్లో అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/earth-quake-in-japan-36-211867.html
భూకంప తీవ్రత అసోంతో పోలిస్తే త్రిపురలో చాలా స్వల్పంగా ఉంది. త్రిపురలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైంది. ఇక పోతే మేఘాలయలోని పలు ప్రాంతాలలో కూడా భూమి స్వల్పంగా కంపించింది.
అమెరికా ఆయుధాల తయారీపై దృష్టి సారించింది. అప్పటి వరకూ వస్తు ఉత్పత్తిపైనే దృష్టి కేంద్రీకరించిన అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ కి తగిన బుద్ధి చెప్పాలన్న ఆలోచన కొద్దదీ.. ఆయుధాల తయీరీవైపు మళ్లింది. అణుబాంబు తయారు చేసి ఆ యుద్ధానికి బెస్ట్ ఫినిషర్ గా నిలిచింది.
అమెరికా అద్యక్షుడు ట్రంప్ దీన్ని అమెరికన్ సైనిక శక్తి అద్భుత ప్రదర్శనగా అభివర్ణిస్తూ తన భుజాలను తానే చరుచుకున్నారు. ఇక వెనుజులాలో అధికార మార్పిడి ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఆ దేశాన్ని అమెరికాయే నడిపిస్తుందని ప్రకటించారు.
నికోలస్ మదురో వెనిజులా నేచురల్ రిసోర్సస్ ను చైనాకు అప్పగించి దోపిడీకి సహకరిస్తున్నారంటున్న ట్రంప్.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ కూడా బలోచిస్థాన్ లెని ఖనిజ సంపద, సముద్ర వనరులను చైనాకు తాకట్టు పెడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని డాక్టర్ తారాచంద్ ప్రశ్నించారు.
రష్యా చమురు విషయంలో భారత్ అమెరికాకు సహకరించకుంటే.. ఆ దేశంపై టారిఫ్ లు మరింత పెంచుతామని ట్రంప్ ఓ బహిరంగ సభలో ప్రకటించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతోంది.
2036 ఒలిపింక్ క్రీడల నిర్వహణకు భారత్ పూర్తిస్థాయిలో సన్నద్దమవుతోందని ప్రధాని మోదీ తెలిపారు.
హైదర్‌నగర్ గేటెడ్ కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్‌లో పడి అర్జున్ కుమార్ (3) అనే మూడేళ్ల బాలుడు మృతి చెందాడు
సంక్రాంతి పండుగకు ఊరెళ్లే వారికి హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు.
చంద్ర గ్రహణం కారణంగా మార్చి 03న తిరుమలలో శ్రీవారి ఆలయన్ని మూసివేయనున్నట్లు తెలిపారు
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ కంటెంట్ గురించి కీలక ప్రకటన చేసింది.
ఢిల్లీ అంతర్జా తీయ విమానాశ్రయంలో 2.1 కిలోల కోకైన్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ పాతబస్తీలోని చంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద శనివారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఊహించని ఘటన చోటుచేసుకుంది.