పవన్ కల్యాణ్ మాటలలో ముందస్తు ఎన్నికల సంకేతం?

Publish Date:May 12, 2023

Advertisement

ఏపీలో ముందస్తు ఎన్నికల ముచ్చట గతంలో కంటే గట్టిగా వినిపిస్తోంది.  విపక్షాలలో అయోమయాన్ని సృష్టించి ఆ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మరల్చుకునేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా ముందస్తు ముచ్చటను తెరమీదకు తెచ్చిందన్న వాదన వినవస్తున్నా..  విశ్వసనీయ సమాచారం మేరకు వైసీపీ యిప్పటికే పార్టీ జెండాలు, ఇతర ఎన్నికల సరంజామాకు పెద్ద ఎత్తున ఆర్డర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది.

కారణాలేమైనా జగన్  అసెంబ్లీని గడువుకు ముందే రద్దు చేసి  ప్రజా తీర్పును కోరుతారన్న భావన రాజకీయ వర్గాలు, పరిశీలకుల్లోనే కాదు.. సామాన్య ప్రజానీకంలో కూడా వెల్లువెత్తుతోంది. పార్టీలో అసంతృప్తి, అంతర్గత కలహాలు, కోర్టు కేసులు, ఆర్థిక సంక్షోభం.. అన్ని వర్గాలలోనూ వెల్లువెత్తుతున్న ప్రభుత్వ వ్యతిరేకత కలిపి ప్రభుత్వంపై ముప్పేట దాడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి ఫ్రెష్ మేండెట్ కోరడం ద్వారానే ఒకింత ఊరట పొంందావచ్చని జగన్ భావిస్తున్నట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా గురువారం (మే 11)  మంగళగిరిలో విలేకరులతో మాట్లాడుతూ  జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున తాను ఇక ఏపీలోనే ఉంటానని ప్రకటించారు. ఆయన పొత్తల గురించి ఎలాంటి శశబిషలూ లేకుండా క్లరిటీ ఇవ్వడం.. పొత్తులకు సీఎం పదవి అనేది ఎంత మాత్రం అవరోధం కాదనీ, తాను ఆ పదవి కోసం వెంపర్లాడటం లేదనీ రేసులో లేదనీ కూడా స్పష్టంగా చెప్పేసి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఐక్యంగా ముందుకు సాగడమే మిగిలిందని కుండబద్దలు కొట్టేశారు.

పార్టీలో  పొత్తును ఇష్టపడని వారినీ, ఇతర వైసీపీ వ్యతిరేక పార్టీలలో ఏ పార్టీ అయినా పొత్తును వ్యతిరేకిస్తుంటే వారినీ ఒప్పించే బాధ్యత తానే తీసుకుంటున్నాననీ కూడా జనసేనాని విస్పష్టంగా చెప్పేశారు. దీంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల జరగడం ఖాయమన్న భావన సర్వత్రా వ్యక్తమౌతోంది. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కూడా సన్నాహాలు ప్రారంభించేసినట్లు వార్తలు వినవస్తున్నాయి. ఇక జనసేనాని తన ఎన్నికల సన్నద్ధతకు సంబంధించిన వివరాలను కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. వచ్చే నెల 3 నుంచి తాను ఏపీలో నే ఉంటానని తేటతెల్లం చేయడం ద్వారా సినిమాలకు విరామం ఇచ్చేసినట్లేనన్న సంకేతాలిచ్చారు. దీంతో ముందస్తు ఎన్నికలకు సంబంధించిన స్పష్టమైన సమాచారం పవన్ కల్యాణ్ వద్ద ఉందని పరిశీలకులు అంటున్నారు. 

 మొత్తంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల  సెంట్రిక్ గానే పవన్  పొత్తులు, ముఖ్యమంత్రి పదవి గురించి తమ పార్టీ శ్రేణులకే కాకుండా అభిమానులకు కూడా ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వడం ద్వారా  పొత్తులపై అధికారిక ప్రకటన వచ్చే సమయానికి ఎటువంటి ఇబ్బందులూ, అసమ్మతులూ వెల్లువెత్తకుండా ఇప్పటి నుంచే జాగ్రత్త పడ్డారన్న భావన రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నది. మొత్తం మీద పవన్ కల్యాణ్  పొత్తులు, పదవులు, సీట్ల పంపకం తదితర అంశాలపై ఇచ్చిన క్లారిటీ కారణంగా రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేనల పొత్తుకు ఒక సానుకూల వాతావరణాన్నీ, ఆ పొత్తుకు ఇరు పార్టీలే కాకుండా జనం సమ్మతిని ముందుగానే పొందే అవకాశం ఏర్పడిందని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.