ఒడిశా అడవుల్లో ఈగల్ ఫోర్స్ దాడి.. 500 కిలోల గంజాయి స్వాధీనం
Publish Date:Jun 18, 2026
Advertisement
తెలంగాణకు భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాపై ఈగల్ ఫోర్స్ మరోసారి ఉక్కు పాదం మోపింది. ఒడిశా లోని దట్టమైన కోరాపుట్ అటవీ ప్రాంతంలో అత్యంత సాహసోపేతంగా నిర్వహిం చిన ఈ ఆపరేషన్‌లో ఈగల్ ఫోర్స్ 500 కిలోల గంజా యిని స్వాధీనం చేసుకు న్నారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఈగల్ ఫోర్స్ నిర్వహించిన ఈ హై రిస్క్ ఆపరేషన్‌కు ఒడిశా పోలీసులు ప్రత్యేకంగా ప్రశంసల వర్షం కురిపిం చారు.విశ్వసనీయమైన సమాచారం అందడంతో రంగంలోకి దిగిన ఈగల్ ఫోర్స్ బృందాలు, బలిమేళా నుంచి జయపూర్ వరకు సుమారు 80 కిలోమీటర్ల మేర గంజాయి తరలిస్తున్న బొలెరో వాహనాన్ని వెంబడించారు. అడవులు, ఘాట్ రోడ్లు దాటుకుంటూ సాగిన ఉత్కంఠభరిత చేజింగ్ అనంతరం వాహ నాన్ని అటవీ ప్రాంతం లో నిలిపివేసిన డ్రైవర్ చీకటి మాటున పరారయ్యాడు. అనంతరం వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులు అందులో మొత్తం 115 ప్యాకెట్లలో దాచిన 500 కిలోల గంజాయి ఉన్నట్లుగా గుర్తించారు. వీటిలో 90 ప్యాకెట్లు ఐదు కిలోల చొప్పున, మరో 25 ప్యాకెట్లు రెండు కిలోల చొప్పున ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయితో పాటు బొలెరో వాహనాన్ని ఒడిశా కోరాపుట్ పోలీసు లకు అప్పగించారు. ఈ ఘటనపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసు కున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాహనం ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాకు చెందిన అమీర్ అలీ ఖాన్ పేరిట రిజిస్ట్రేషన్ అయినట్లు అధికారులు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.కాగా, 2024లో కూడా రాంచీ వరకు వెంబడించి 500 కిలోల గంజాయిని పట్టుకున్న ఈగల్ ఫోర్స్, మరోసారి అదే స్థాయిలో విజయవంతమైన అంతర్రాష్ట్ర ఆపరేషన్ నిర్వ హించడం విశేషం.... తెలంగాణకు మాదకద్ర వ్యాల సరఫరాను అడ్డుకునే క్రమంలో ఈగల్ ఫోర్స్ చేప డుతున్న వరుస చర్యలు స్మగ్లింగ్ ముఠాల్లో గుండె దడ పుట్టిస్తున్నాయి... తెలంగాణ ఈగల్ ఫోర్స్ చేసిన సాహసాన్ని చూసి ఒరిస్సా పోలీసులు సైతం అవాక్కయ్యారు.... ఒరిస్సా పోలీసు ఉన్నతాధికారులు ఈగల్ ఫోర్స్ ను అభినందించారు...
http://www.teluguone.com/news/content/eagle-force-attack-in-odisha-forests--interstate-gang-25-223407.html





