గోదావరి నీటితో ద్వారంపూడి వ్యాపారం.. ప్రభుత్వ ఆదాయానికి పంగనామాలు

Publish Date:Jul 18, 2025

Advertisement

కాకినాడను తన అక్రమాలకు అడ్డగా మార్చుకుని వైసీపీ హయాంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి నియంతలా చెలరేగిపోయారు. వైసీపీ ప్రభుత్వంలో గోదావరి జిల్లాల సీఎంగా ద్వారంపూడి చక్రం తిప్పారు. రేషన్ బియ్యం దగ్గర నుంచి డ్రగ్స్ వరకు ఆయన టీమ్ అన్ని రకాల దందాలకు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. ద్వారంపూడి అక్రమాలపై ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందే ధ్వజమెత్తారు. సదరు ద్వారంపూడి అక్రమార్జనలో గోదావరి నీటిని కూడా వదలలేదన్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది.  కాకినాడ సిటీ  మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు  ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఇప్పటికీ తన తీరుతో అధికారులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువు నీళ్లు తాగిస్తున్న చందంగా వ్యవహరిస్తున్నారు  గనులు, గ్రావెల్‌, ఇసుక ఒకటేంటి ఎక్కడపడితే అక్కడ వాలిపోయి ఆనాడు రూ. కోట్లలో వెనకేసుకున్నారు. కాకినాడలో ద్వారంపూడి చాలా కాలంగా నీళ్ల వ్యాపారం చేస్తున్నారు. కాకినాడ పోర్టుకు వచ్చే నౌకలకు నీళ్లు విక్రయిస్తూ రూ.కోట్లు సంపాదిస్తున్నారు. కానీ, ప్రభుత్వానికి చెల్లించాల్సిన నీటి బకాయిలు మాత్రం కట్టడం లేదు. పదకొండేళ్ల నుంచీ ఎగవేస్తుండటంతో ఇప్పుడు ఆ బకాయి రూ.13.84కోట్లకు చేరింది.

కాకినాడ నగరాన్ని ఆనుకుని ఎరువుల కర్మాగారం, ఆయిల్‌ ఫ్యాక్టరీలు, కాకినాడ సీ పోర్టు ఉన్నాయి. వీటి పారిశ్రామిక అవసరాలకు నీళ్లు అవసరం. బాయిలర్ల కూలింగ్‌ దగ్గర నుంచి గ్రీన్‌ బెల్ట్‌ నిర్వహణ, ఉద్యోగులు, కార్మికుల అవసరాలకు నీళ్లు కావాలి. అలాగే కాకినాడ సీపోర్టులో కార్గో ఎగుమతి దిగుమతుల సందర్భంగా పనిచేసే కార్మికులకు, లోపలకు లారీలు వెళ్లి వచ్చే సమయంలో రేగే ధూళి నియంత్రణ, నిత్యం వచ్చిపోయే నౌకల్లో వివిధ అవసరాలకు నీళ్లు పెద్దఎత్తున అవసరం. ఈ నేపథ్యంలో పారిశ్రామిక, ఓడరేవు అవసరాలు తీర్చేలా జిల్లా పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ విభాగం నీటిపారుదలశాఖ ద్వారా గోదావరి నీటిని వివిధ ప్రైవేటు సంస్థలకు పైపులైన్ల ద్వారా కేటాయిస్తోంది. ఈ సంస్థలు నీటిని తీసుకుని వివిధ పరిశ్రమలకు విక్రయించుకుంటాయి.
నీటి సరఫరా చేసినందుకు ఈ సంస్థల నుంచి నామ మాత్రపు చార్జీలను ప్రభుత్వం వసూలు చేస్తోంది. ద్వారంపూడి తన తనయ అంజని పేరుతో గోదావరి నీటిని ఎప్పటినుంచో తీసుకుంటున్నారు. అంజనీ ఏజెన్సీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో నిత్యం 0.25ఎంజీడీ నీటిని పైపులైన్ల ద్వారా తీసుకుంటున్నారు. ఈ నీటిని కాకినాడ పోర్టుకు సమీపంలోని శ్రీ విద్యా కాలనీలో శుద్ధి చేస్తున్నారు. ఇందుకోసం నీటి శుద్ధి ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ శుద్ధి చేసిన నీటిని ద్వారంపూడి కాకినాడ సీపోర్టు, అందులోకి వచ్చే నౌకలకు విక్రయిస్తున్నారు.

ద్వారంపూడి కంపెనీ తరహాలోనే నీళ్ల వ్యాపారం చేస్తున్న తక్కిన కంపెనీలు దాదాపుగా బాకీలు చెల్లిస్తున్నాయి. నాగార్జున ఎరువుల కర్మాగారం ప్రభుత్వానికి రూ.1.47కోట్లు బాకీ ఉంది. నోటీసులు జారీ చేయడంతో బాకీలు చెల్లించడానికి ఆ కంపెనీ ముందుకు వచ్చింది. కానీ సదరు ద్వారంపూడి మాత్రం తననెవరూ ఏం చేయలేరనే ధీమాతో వ్యవహరిస్తున్నారు. ఇటీవల అధికారులు నీటి చార్జీల ఎగవేత గుర్తించి తక్షణం బాకీలు చెల్లించాలని గత నెల 27న నోటీసులు జారీ చేశారు. ద్వారంపూడికి 14రోజులు గడువు ఇచ్చారు. ఈ గడువు ఇప్పటికే ముగిసిపోయింది. కానీ ద్వారంపూడి కంపెనీ నుంచి మాత్రం చలనం లేదు. ఇదిలాఉంటే బాకీలు చెల్లించని నేపథ్యంలో ఈ కంపెనీకి గోదావరి ముడి నీటి సరఫరా నిలిపివేయాల్సి ఉన్నా కనీసం ఆ దిశగా నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.

ప్రభుత్వం నుంచి ద్వారంపూడి కంపెనీ నీటిని లీటరు రూ.10 చొప్పున కొనుగోలు చేస్తోంది. అదే నీటిని శుద్ధి చేసి రూ.30 చొప్పున పోర్టు, నౌకలు, వివిధ పరిశ్రమలకు విక్రయిస్తున్నారు. ఇలా సరఫరా చేసినందుకు ఎప్పటికప్పుడు ఆయా కంపెనీల నుంచి ఠంచనుగా తమకు రావాల్సిన డబ్బులను వసూలు చేస్తూ ద్వారంపూడి ఏటా కోట్లలో సంపాదిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న గోదావరి నీటికి మాత్రం అసలు చార్జీలే చెల్లించడం లేదు. 2014, ఏప్రిల్‌ 18 నుంచి 2025, మే 31 వరకు ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి కట్టకుండా నీళ్ల దందా కొనసాగిస్తున్నారు. ఏడాదికి రూ.1.24కోట్ల చొప్పున 11ఏళ్లపాటు ద్వారంపూడి కంపెనీ చెల్లించాల్సిన బాకీలు పేరుకుపోయాయి.

By
en-us Political News

  
ఇప్పటి వరకూ కవితకు బీఆర్ఎస్ లోనే వ్యతిరేకత ఉందని అంతా భావించారు. ప్రస్తుతం ప్రస్తుతం ఆమె అధ్యక్షత వహిస్తోన్న తెలంగాణ జాగృతిని పూర్తి స్థాయి పార్టీ చేస్తారన్న వార్తలు వెల్లువెత్తాయి.
భార‌త్ అంటే భ‌గ్గుమంటున్నారు ట్రంప్. అంతేనా ఇండియాపై యాభై శాతం సుంకాల మోత మోగిస్తున్నారు. దీంతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవ్వాల్సిన సరుకంతా ఇండియాలోనే డెడ్ చీప్ గా అమ్ముకుని అస‌లైనా స‌రే రాబ‌ట్టుకోవాల్న ఆలోచన చేస్తున్నారు మన వ్యాపారులు.
స్వాతంత్య్ర దినోత్సవ వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభవార్త చెప్పారు. ఈసారి దీపావళి రెండింతల ఆనందాన్ని తీసుకురాబోతున్నది అంటూ వస్తు,సేవల పన్ను విధానంలో కొత్త తరం సంస్కరణలను తీసుకువస్తున్నామని వెల్లడించారు.
ఇటీవల జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలలో వైసీపీ అడ్డాలోనే ఆ పార్టీని మట్టికరిపించిన ఉత్సాహంతో ఉన్న తెలుగుదేశం కూటమి సర్కార్.. మూడు నెలల ముందు స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు ఇసుమంతైనా వెనుకాడటం లేదు.
వైసీపిలో తిరుగుబాటు జరగనుందా? మరీ ముఖ్యంగా ఇప్పడు వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలలో ఆరుగురు జగన్ ను ధిక్కరించనున్నారా? త్వరలో అంటే ఈ నెలలోనే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఆ చర్చ జోరుగా సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధకారంలో ఉన్న సమయంలో సజ్జల పార్టీనీ, ప్రభుత్వాన్నీ గుప్పిట పట్టి ఓ ఆటాడుకుంటే.. ఆయన పుత్రరత్నం పిల్ల సజ్జల.. అదే నండి సజ్జల్ బార్గవ్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా వింగ్ కు చీఫ్ గా పెత్తనం చెలయించారు.
కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ తో బీఆర్ఎస్ పార్టీలో గత కొంత కాలంగా సంచలనంగా మారి, పార్టీలో సంక్షోభానికి కారణమైన కేసీఆర్ తనయ కథ ముగిసినట్లేనా? అంటే కాదు అన్న సమాధానమే వస్తోంది. పరిశీలకులు బీఆర్ఎస్ లో అసలు కథ ఇప్పుడే మొదలైందంటున్నారు.
ఆకుకు అందకుండా పోకకు పొందకుండా మాట్లాడడంలో వైసీపీ సీనియర్ నాయకుడు, జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి సిద్ధహస్తుడు. ఆయన చాలా గ్యాప్ తరువాత తాజాగా మీడియా ముందుకు వచ్చారు.
బీఆర్ఎస్ నుంచి సస్పెండైన కల్వకుంట్ల కవిత దీటుగా స్పందించారు. పార్టీకీ, పార్టీద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేశారు.
తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణకు కోర్టు నిర్దేశించిన మూడు నెలల గడువు ఈ నెలాఖరుతో ముగుస్తున్నది. అయితే ఈ నెలాఖరులోగా స్థానక ఎన్నికల నిర్వహణ అసాధ్యంగా భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో మారు హైకోర్టును ఆశ్రయించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మద్యం కుంభకోణం వైసీపీ పునాదులనే కదిపేలా ఉండటంతో ఆ పార్టీలో కంగారు మొదలైంది. మద్యం కుంభకోణంలో అరెస్టై జైలు పాలైన తమ పార్టీ నేతలను కలవడానికి కూడా వైసీపీ అధినేత జగన్ ముందువెనుకలాడుతున్నారు.
బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోతోందా? 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం, ఆ తరువాత గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవకుండా సాధించిన జీరో రిజల్ట్ తరువాత ఆ పార్టీ ఇప్పటి వరకూ కోలుకున్నట్లు కనిపించదు.
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఆ పార్టీలో గందరగోళానికి దారి తీసింది. ఆమె మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ లపై తీవ్ర విమర్శలు గుప్పించిన నేపథ్యంలో పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.