డ్యూటీ ఎక్కిన దువ్వాడ వాణీ!.. టెక్కలి వైసీపీలో మళ్లీ మొదలైన మూడుముక్కలాట!

Publish Date:May 30, 2025

Advertisement

రెండు తెలుగు రాష్ట్రాలలో దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణీ, దివ్వెల మధురిల వ్యవహారం ఎంత అలజడి రేపిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హై ఎనర్జిటిక్ ఫ్యామిలి డ్రామా అప్డేట్స్ అప్పట్లో మీడియాలో, సోషల్ మీడియాలో సైతం సేన్షేషన్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ టోటల్ ఎపిసోడ్ లో దువ్వాడ శ్రీను ఇంటికి దివ్వెల మాధురి ప్రవేశించడం.. అక్కడితో దువ్వాడ వాణి అకస్మాత్తుగా తన నిరసనకు మంగళం పాడి మాయం అవ్వడం.. క్లైమాక్స్ లేని కధగా మారింది. ఇప్పటికీ ఈ వ్యవహారంలో అనేక ప్రశ్నలకు సమాధానం లేకుండా పోయింది.

దువ్వాడ వాణి తన నిరసనను మాని.. మాయం అవ్వడంతో.. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి స్పీడ్ పెంచారు. వరుసగా ఇంతర్వ్యులు ఇస్తూ.. విడాకులు వచ్చిన వెంటనే తమ వివాహం అంటూ... శ్రీనుకు వారసుడిని కూడా ఇస్తాను అంటూ తమ పెయిర్ ను వైరల్ చేసుకున్నారు. ఓ వైపు శ్రీను, మాధురి స్పీడ్ పెంచడంతో పూర్తిగా మ్యుట్ అయిపోయారు దువ్వాడ వాణి.. అయితే జగన్ కు వీర భక్తుడిగా ముద్ర పడ్డ దువ్వాడ శ్రీను.. టెక్కలి వైసిపి ఇంచార్జ్ విషయంలో విభేదాలు రావడం, జగన్ మాటకు అడ్డు చెప్పడం స్టోరీలో పెద్ద ట్విస్ట్ గా చెప్పుకోవచ్చు. డామిట్.. కధ అడ్డం తిరిగింది అన్నట్టుగా.. వైసిపి నుండి దువ్వాడ శ్రీను సస్పెండ్ అవ్వడం తో.. మిగిలిన కధను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు మళ్ళీ తెరపై ప్రత్యక్షం అయ్యారు దువ్వాడ వాణి.  

మొదట్లో టెక్కలి వైసిపి ఇంచార్జ్ పెరాడ తిలక్ వెనుక ఉంటూ వచ్చిన వాణి.. ఇప్పుడు ఇండివిడ్యుయల్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. టెక్కలి నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో కార్యకర్తల ఫంక్షన్లు, పరామర్శలలో గడచిన కొద్ది రోజులుగా చురుకుగా పాల్గొంటున్న దువ్వాడ వాణి.. మళ్ళీ తన క్యాడర్ కు వేకప్ కాల్ ఇచ్చేసారు. దువ్వాడ వాణి ఇచ్చిన వేకప్ కాల్ తో ఆమె అభిమానులు ఆనందంలో ఉన్నా.. ఎక్కడ మళ్ళీ తమ ఇంచార్జ్ సీటుకు ఎసరు పెడతారో అన్న ఆందోళన మాత్రం పెరాడ తిలక్ వర్గీయులలో కనిపిస్తోంది.

గతంలో దువ్వాడ శ్రీనుకు, పెరాడ తిలక్ వర్గాలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండేవి.. దువ్వాడ శ్రీను సస్పెన్షన్  తో ఏపుగా పెరిగిన పచ్చగడ్డి..  దువ్వాడ వాణీ రాకతో కోతకు గురవుతుందా అన్న ఆందోళన కూడా స్థానిక వైసిపి  శ్రేణుల్లో లేకపోలేదు. ఇకోవైపు.. జగన్ కోపం తాత్కాలికమే అనీ.. మళ్ళీ తాను బౌన్స్ బ్యాక్ అవుతానని దువ్వాడ శ్రీను కుడా స్టేట్మెంట్ లు ఇస్తుండటం కూడా తిలక్ సేనను ఇరుకున పెడుతోంది. దీంతో చాలాకాలం తరువాత మళ్ళీ టెక్కలి వైసిపిలో మూడు ముక్కలాట మళ్ళీ మొదలైందనే చెప్పుకోవచ్చు. 

By
en-us Political News

  
బీఆర్‌ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌కు అస్వస్థతకు గురియ్యారు. ఆయన సీజనల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు.
కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుని తోమాల సేవ, అభిషేక సేవలలో కూర్చుని తనివి తీరా చూడాలని భావించిన వారి కోరిక ఫలించలేదు
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల స్థావరాల ఏర్పాటుపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌ వెల్లడించారు. ఎస్పీ కార్యాలయంలో డీఐజీ సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్, ఏస్ఆర్‌నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్రిష్ హొటల్ భవనంలో ఉన్న కాఫీడేలో మంటలు చేలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు.
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద్ కంపెనీకి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. డాబర్ చ్యవన్‌ప్రాష్ లక్ష్యంగా చేసుకుని తప్పుదోవ పట్టించే ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందేందుకు ఉన్న గరిష్ఠ వయోపరిమితిని 45 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ లివర్‌పూల్ స్టార్ ఆటగాడు డియోగో జోటా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.
పవన్ కళ్యాణ్‌ అయితే పూర్తిగా హిందుత్వ భావజాలాన్ని నెత్తికి ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది ఈ ట్రైలర్ ద్వారా మనకు అదే తెలుస్తోందంటారు కొందరు.. 2. 30 నిమిషాల ట్రైలర్ లోనే హిందూ శబ్ధం.. దాని ఛాయలు లెక్కలేనన్ని సార్లు కనిపించాయి.
ఐటీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్నమైక్రోసాఫ్ట్ సంస్థ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. వేలాది మంది ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులు జారీ చేయనున్నట్లు ప్రకటించడంతో టెక్ పరిశ్రమలో ఆందోళన నెలకొంది.
మాజీ సీఎం జగన్ పాదయాత్ర జపం వినిపిస్తున్నారు. ఎన్నికల ముందు పాదయాత్ర ఉంటుందని జగన్ ప్రకటించారు. ముందుగా జిల్లాల పర్యటనలు ఉంటాయని.. చివర్లో పాదయాత్ర ఉంటుందని ఆయన వెల్లడించారు.
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జులై 17న రైల్‌ రోకోకు ఆమె పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి శిద్దారాఘవరావు ఒకప్పుడు తెలుగుదేశంలో కీలక నేత. చంద్రబాబుకి సన్నిహితుడిగా పార్టీలో పలు కీలక పదవులు కూడా అనుభవించారు. కానీ తెలుగుదేశం 2019 ఎన్నికలలో అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ గూటికి చేరారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఆ మాజీ మంత్రిని పెద్దగా పట్టించుకున్న దాఖలులు లేవు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను గురువారం (జులై 3) భేటీ అయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.