ఏపీ ప్రభుత్వ దుర్నీతి మరోసారి బట్టబయలైంది. విజయవాడ దుర్గ గుడి సెక్యూరిటీ టెండర్ ను సెక్యూరిటీ నిర్వహణలో ఘోరంగా విఫలమై బ్లాక్ లిస్ట్ లో ఉన్న ఏఝిల్ సంస్థ దక్కించుకుంది. తెలంగాణలోని ప్రతిష్టాత్మక వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి సెక్యూరిటీ నిర్వహణలో ఘోరంగా విఫలమైన ఏజిల్ బ్లాక్ లిస్ట్ లో చేరింది.
వరంగల్ ఎంజీఎంలో ఎలుకల దాడి చేసిన ఘటనలో ఓ రోగి మృతి చెందాడు. అప్పట్లో ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులు, సెక్యూరిటీ సంస్థపై చర్యలకు ఉపక్రమించారు. అప్పటికి ఎంజీఎం సెక్యూరిటీ సంస్థ అయిన ఏజిల్ ను బ్లాక్ లిస్ట్ లో పెడుతూ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు. అటువంటి సంస్థకు దుర్గగుడి సెక్యూరిటీ టెండర్ కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో అదీ విజయవాడలో మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం జరిగిన ప్రభుత్వ ఆసుపత్రి సెక్యూరిటీ వైఫల్యం కూడా ఏజిల్ దే.
ఏరి కోరి విఫల సంస్థకు సెక్యూరిటీ టెండర్ కట్టబెట్టిన ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు బ్లాక్ లిస్ట్ లో ఉన్న సంస్థ దుర్గగుడి సెక్యూరిటీకి టెండర్ ఎలా వేసిందని, అటువంటి సంస్థకు టెండర్ ఎలా కట్టబెడతారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆలయాలలో ఒకటైన దుర్గ గుడి సెక్యూరిటీ బాధ్యతలు అప్పగించడం దారుణమని, వెంటనే ఆ టెండర్ ను రద్దు చేయాలని డిమాండ్ వెల్లువెత్తుతోంది. బ్లాక్ లిస్ట్ లో ఉన్న ఏజిల్ కు దుర్గగుడి సెక్యూరిటీ టెండర్ కట్టబెట్టిన విషయం ఆర్టీఐ సమాచాచం ఆధారంగా బయటపడింది. బ్లక్ లిస్ట్ లో ఉన్న సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టడం అదీ అత్యంత ప్రతిష్టాత్మకమైన, నిత్యం భక్తుల రద్దీతో కిక్కిరిసి ఉండే దుర్గ గుడి సెక్యూరిటీ అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్హత లేకపోయినా నిబంధనలను పక్కన పెట్టి మరీ దుర్గగుడి సెక్యూరిటీ టెండర్ ను ఏజిల్ సంస్థకు కట్టబెట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై దుర్గ గుడి అధికారుల తీరుపైనా అనుమానాలు వ్యక్త మౌతున్నాయి. విజయవాడ దుర్గగుడిలో సెక్యూరిటీ టెండర్లను ఫిబ్రవరిలో నిర్వహించగా మూడు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. వాటిలో అత్యధిక టర్నోవర్ ఉన్న ఏజిల్ సంస్థకు సెక్యూరిటీ టెండర్ ఇచ్చారు. అయితే దుర్గగుడి సెక్యూరిటీ టెండర్లకు సంబంధించి అత్యధిక టర్నోవర్ నిబంధనపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. టర్నోవర్ ఉన్నంత మాత్రాన బ్లాక్ లిస్ట్ లో ఉన్న ఏజిల్ కు సెక్యూరిటీ టెండర్ కట్టబెట్టడమేమిటని జనం ప్రశ్నిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/durga-gudi-security-tender-to-agile-which-is-in-black-list-25-136814.html
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.