రాజకీయ నాయకులకు డ్రగ్స్ టెస్టులు తప్పనిసరి చేయాలి!

Publish Date:Apr 3, 2026

Advertisement

రాజకీయాలు, అవినీతి, సామాజిక అంశాలపై ప్రముఖ జర్నలిస్ట్, జమీన్‌రైతు సంపాదకులు డోలేంద్ర ప్రసాద్‌తో కలిసి తెలుగువన్ ఎండి కె. రవిశంకర్ నిర్వహిస్తున్న సంచలనాత్మక చర్చా కార్యక్రమం వాస్తవ వేదిక విజయవంతంగా కొనసాగుతోంది. తాజా సంచికలో   తెలుగు రాజకీయాల్లో డ్రగ్స్ ప్రకంపనలపై విస్తృతంగా చర్చించారు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.  రాజకీయ నేతలు సమాజానికి రోల్ మోడల్స్‌గా ఉండాల్సిన తరుణంలో, వారిపై ఇటువంటి ఆరోపణలు రావడం ఆందోళనకరమన్నారు. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వాలు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌లను ఏర్పాటు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు ఈ వ్యసనం బారిన పడటం ఆందోళనకరమన్నారు. ఇక రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి వాడుకుంటున్నాయే తప్ప, మూలాల నుంచి ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేయడం లేదన్నారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు, వారి అనుచరులు డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్నప్పుడు, అది   మీడియా చర్చలకే పరిమితమవుతోంది తప్ప వారికి కఠినమైన శిక్షలు పడిన దాఖలాలు దాదాపు లేదన్నారు. 

డ్రగ్స్ మాఫియాను అరికట్టడానికి కేవలం పోలీసు చర్యలు సరిపోవనీ,  ఇందులో వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు,  రాజకీయ నాయకుల ప్రమేయం ఉండటం వల్ల డ్రగ్స్ కేసుల విచారణలు తరచుగా నీరుగారిపోతున్నాయని డోలేంద్రప్రసాద్, రవిశంకర్ లు అభిప్రాయపడ్డారు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే..  డ్రగ్స్ వినియోగాన్ని చట్టపరంగా తీవ్రమైన నేరంగా పరిగణించకపోవడం కూడా డ్రగ్స్ వినియోగం నిర్మూళనకు అడ్డంకిగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుత చట్టాల ప్రకారం డ్రగ్స్ అమ్మడం నేరం కానీ, తీసుకోవడం పెద్ద నేరంగా పరిగణించడం లేదనీ,  దీనివల్ల నిందితులు సులభంగా బయటపడే అవకాశం ఉందన్నారు. 

రాజకీయ పార్టీలు ఇప్పుడు ఒక నూతన వ్యూహాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఆస్తులను ప్రకటించినట్లే, తాము డ్రగ్స్ వంటి వ్యసనాలకు దూరంగా ఉన్నామని నిరూపించుకోవడానికి  డోప్ టెస్ట్'  నివేదికలను సమర్పించే నిబంధనను తీసుకురావాలని చెప్పారు. ప్రజా ప్రతినిధులుగా ఉండేవారు ప్రతి ఆరు నెలలకోసారి రక్త పరీక్షలు చేయించుకుని, ఆ నివేదికలను బహిరంగపరచడం ద్వారా పారదర్శకతను పెంచాల్సి ఉందన్నారు. ఇది ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఒక సానుకూల సందేశాన్ని పంపుతుందన్నారు. 
 
రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో నైతిక విలువలకు పెద్దపీట వేయాలని రవిశంకర్ పేర్కొన్నారు.  డ్రగ్స్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న వారిని రాజకీయాల నుంచి బహిష్కరించడం లేదా ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే రాజకీయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని అభిప్రాయ పడ్డారు. పంజాబ్ రాష్ట్రం ఎదుర్కొన్న 'ఉడ్తా పంజాబ్' వంటి దుస్థితి తెలుగు రాష్ట్రాలకు రాకూడదంటే, రాజకీయ నేతలు స్వచ్ఛందంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టాలనీ, రాజకీయాలు కేవలం అధికారం కోసమే కాకుండా, సామాజిక బాధ్యతను నెరవేర్చే వేదికలుగా మారినప్పుడే ఈ డ్రగ్స్ మహమ్మారిని అంతం చేయడం సాధ్యమౌతుందనీ డోలేంద్రప్రసాద్, రవిప్రసాద్ లు పేర్కొన్నారు.  

By
en-us Political News

  
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.