డ్రగ్స్‌ రహిత హైదరాబాద్‌ సాధ్యమేనా?

Publish Date:Mar 15, 2026

Advertisement

 

హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. నగరాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. అయినప్పటికీ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ క్రయవిక్రయాలు జరుగుతున్నట్లు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా యువత, విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాల విక్రయాలు సాగుతున్నాయని పోలీసులు గుర్తించారు. ఇటీవల వరకూ వనస్థలిపురం, రాచకొండ ప్రాంతాల్లో డ్రగ్స్ పట్టివేతల వార్తలు వినిపించగా, ఇప్పుడు నగరంలో నిత్యం రద్దీగా ఉండే ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్ ప్రాంతాల్లోనూ డ్రగ్స్ దందా బయటపడింది. 

కొన్ని హాస్టళ్లను అడ్డాగా చేసుకుని మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతున్నట్లు హైదరాబాద్ నగర పోలీసులు గుర్తించారు. విద్యార్థులు ఉండే హాస్టళ్లలోనే ఈ వ్యాపారం సాగుతుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే కఠిన తనిఖీలు నిర్వహించి ఉంటే డ్రగ్స్ సమస్య ఇంతగా పెరిగేది కాదని వారు అంటున్నారు.స్థానికుల అభిప్రాయం ప్రకారం, అప్పుడప్పుడు దాడులు చేయడం కాకుండా హాస్టళ్లపై పోలీసులు నిరంతరం నిఘా పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే యువత డ్రగ్స్ మహమ్మారి బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల మరోసారి టాలీవుడ్‌కు సంబంధించిన పేరు హైదరాబాద్ డ్రగ్స్ కేసులో వినిపించడం సంచలనం సృష్టిస్తోంది. ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రకుల్ ప్రీత్ సింగ్  కుటుంబానికి చెందిన వ్యక్తి పేరు ఈ కేసులో బయటకు రావడం చర్చనీయాంశమైంది. 

మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలో పోలీసులు, ఈగల్ టీం సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో కొకైన్, ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఇద్దరు వ్యాపారవేత్తలు ఇచ్చిన సమాచారంతో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్‌ను కొనుగోలు చేసే రెగ్యులర్ కస్టమర్‌గా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్లు సమాచారం.గత బీఆర్‌ఎస్ హయాంలో టాలీవుడ్‌కు సంబంధించిన డ్రగ్స్ కేసులపై కూడా గతంలో పెద్ద ఎత్తున విచారణలు జరిగాయి. ఈ కేసుల్లో సినీ ప్రముఖుల నుంచి గోళ్లు, వెంట్రుకల నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. 

ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదికలో వారి శరీరాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని తేలడంతో ఆరు కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారాలు గతంలోనూ సంచలనం రేపాయి. పలువురు సెలబ్రిటీల పేర్లు విచారణల్లో వినిపించిన నేపథ్యంలో, ఇప్పుడు మరోసారి సినీ ప్రముఖుల కుటుంబాలకు సంబంధించిన పేర్లు వెలుగులోకి రావడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. మరోవైపు నగరంలో డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. తాజాగా హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ప్రాంతంలో ఉన్న ఓ ఫామ్ హౌస్‌లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీ పోలీసుల దాడితో బట్టబయలైంది. డ్రగ్స్ కేసులో  ఏలూరు ఎంపీ పుట్ట మహేశ్‌కుమార్, బీఆర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి అడ్డంగా దొరికారు.

By
en-us Political News

  
పశ్చిమ ఆసియాలోని హార్మూజ్ జలసంధి, ఒమన్ గల్ఫ్ అంతర్జాతీయ సముద్ర తీర ప్రాంతాల్లో ఒక్కసారిగా పెరిగిన ఉద్రిక్తతలు భారతీయ నావికుల కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి.
దేశ అభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాదని నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మల్కాజ్‌గిరిలో సంచలనం సృష్టించిన నిషారాణి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగవంతం చేసింది.
విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ఇటీవల చోటుచేసుకున్న ఘోర ప్రమాదం పెను సంచలనంగా మారింది.
మాజీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాల యానికి తరలించారు. లిక్కర్ రవాణా వ్యవహారా ల్లో ఆయన పాత్రపై అధి కారులు విచారణ చేపట్టారు.
కోడి కూర చేయడానికి ఓపిక లేదనీ, రేపు వండుతానని చెప్పింది. అయితే తప్పతాగి ఉన్న రమేశ్ కోడి కూర ఇప్పుడే వండాలంటూ భార్యపై చేయి చేసుకున్నాడు.
పలావు ఫ్లాగ్‌తో ప్రయాణిస్తున్న ఎంటీ సెట్టెబెల్లో అనే చమురు ట్యాంకర్ 24 మంది భారతీయ సిబ్బందితో గల్ఫ్ ఆఫ్ ఒమన్ గుండా వెళుతోంది. ఇరాన్ చమురు రవాణాపై అమెరికా విధించిన ఆంక్షలను ఈ నౌక ఉల్లంఘించిందనే నెపంతో, యూఎస్ సెంట్రల్ కమాండ్ కు చెందిన యుద్ధ విమానాలు ఈ నౌకపై దాడి జరిపాయి.
ఖమ్మంలో కీచకుడి దాడిలో గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు.
పశ్చిమ బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ (TMC) చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రమైన రాజకీయ సంక్షోభంలో మునిగిపోయింది.
గతంలో సిట్ కేవలం సాధారణ అవినీతి నిరోధక చట్టాల కింద విచారణ జరపగా, ఈడీ ఎంట్రీ తో కథ కొత్త మలుపు తిరిగింది. మద్యం సిండికేట్లు, వివిధ షెల్ కంపెనీల ద్వారా సేకరించిన దాదాపు 3,500 కోట్ల రూపాయల భారీ ముడుపులు ఎక్కడెక్కడికి చేరాయి? హవాలా మార్గాల ద్వారా విదేశీ ఖాతాల్లోకి ఎలా తరలిపోయాయి? అనే మనీ ట్రయిల్ గుట్టును పూర్తిగా రట్టు చేసేందుకు ఈడీ సిద్ధమైంది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సాధారణంగా తనదైన దూకుడు రాజకీయ శైలితో, వాడీవేడి వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ షాక్ ఇచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ రూట్ ఎందుకు ఆలస్యం కానుంది? రియల్ ఎస్టేట్‌పై చూపే ప్రభావం, రాజకీయ దుమారం పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.