ఎవరీ ద్రౌపది ముర్ము.. ఏమిటామె కథ!

Publish Date:Jun 22, 2022

Advertisement

రాష్ట్రపతి అభ్యర్థిగా పలువురు పేర్లు తెరపైకి వచ్చినప్పటికి ప్రధాని మోదీ అండ్ కో మాత్రం.. చివరి నిమిషంలో ద్రౌపది ముర్ము వైపు మొగ్గు చూపారు. దీంతో అధికార ఎన్డీఏ కూటమి.. తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ముని బరిలో నిలిపింది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఇటీవల పలువురి పేర్లు వినిపించినాయి... వాటిలో ద్రౌపది ముర్ము పేరు కూడా ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. చివరకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుని సైతం రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి ప్రకటించే అవకాశం ఉందనే ఓ వార్త  మంగళవారం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది. అయితే చివరినిమిషంలో మోదీ అండ్ కో.. ద్రౌపది ముర్ముని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడానికి గల రిజన్.. రిజనింగ్ ఏమిటీ..  ఇంతకీ ఆమె ఎవరు ?.. ఆమె స్వస్థలం ఎక్కడ?... ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటీ? తదితర విషయాలు తెలుసుకొనేందుకు నెటిజన్లు.. గుగూల్‌లో తెగ సెర్చి వెతికేస్తున్నారు.  

ఆ నేపథ్యంలో ద్రౌపది ముర్ము గురించిన వివరాలు  క్లుప్తంగా.. భారతదేశంలో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒడిశా ఒకటి. అలాంటి రాష్ట్రంలో మరింత వెనకబడిన జిల్లాల్లో మయూర్ భంజ్ ఒకటి. ఆ జిల్లాలోని బైడపోసి గ్రామంలో 1958, జూన్ 20 ద్రౌపది ముర్ము ఓ పేద కుటుంబంలో జన్మించారు. గిరిజనుల్లోని సంథాల్ తెగకు చెందిన ఆమె పేదరికపు అడ్డంకులను వరుసగా అధిగమిస్తూ ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని రమాదేవి డిగ్రీ కాలేజీలో ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేసి.. సాగునీరు,  విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తించారు. అలాగే రాయ్‌రంగాపూర్‌లోని శ్రీ అరబిందో సమీకృత విద్యాకేంద్రంలో ఉపాధ్యాయులురాలిగా   ఆమె స్వచ్ఛందంగా పని చేశారు.

 అనంతరం 1997లో రాయ్‌రంగ్‌పూర్ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఆమె బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అలా రాజకీయాల్లోకి ప్రవేశించిన ద్రౌపది ముర్ము.. ఆ తర్వాత అంటే 2000లో రాయ్‌రంగ్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగు పెట్టారు. అంతేకాదు.. నాడు అంటే 2000 - 2004 మధ్య నాటి బిజూ జనతాదళ్, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో రవాణా, మత్స్య, వాణిజ్య శాఖ మంత్రిగా కూడా పని చేశారు. 2004లో ఆమె రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ క్రమంలో ఒడిశాలో ఉత్తమ పని తీరు కనబరిచిన ఎమ్మెల్యేలకు ఇచ్చే నీలకంఠ అవార్డును ఆమె 2007లో అందుకున్నారు.  

ఈ ద్రౌపది పని తీరును గమనించిన కమలదళం ఆమెకు బీజేపీ ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్ష, ఉపాధ్యక్షరాలిగా కీలక బాధ్యతలు అప్పగించింది. అలాగే 2010, 2013లో మయూర్‌భంజ్ పశ్చిమ జిల్లా అధ్యక్షురాలిగా కూడా పని చేశారు. అనంతరం బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఆమెను కమలం పార్టీ నియమించింది. 2015, మే 18న ద్రౌపది జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. దీంతో జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్‌గా ద్రౌపతి ముర్ము చరిత్ర సృష్టించారు.

 మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో ఎన్డీఏ కూటమికి అత్యధిక బలం ఉంది. అలాగే మోదీ ప్రభుత్వానికి పలు రాష్ట్రాల్లోని బీజేపీ యేతర ప్రభుత్వాలు సైతం మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నిక నల్లేరు మీద నడకే అని రాజకీయ మేధావులు సైతం స్పష్టం చేస్తున్నారు. అయితే ఆమె రాష్ట్రపతిగా బాధ్యతలు చేపడితే.. తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. అలాగే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించిన తొలి రాష్ట్రపతిగా కూడా ఆమె ఖ్యాతి గాంచనున్నారు. అయితే ఇప్పటివరకు భారత రాష్ట్రపతిగా ఎన్నికైన వారంతా 1947కు ముందు జన్మించిన వారే కావడం గమనార్హం.   

ఇంకోవైపు ద్రౌపది ముర్ము.. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను   చవిచూశారని. ఆమె బంధువులు పేర్కొంటున్నారు. ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యామ్ చరణ్ ముర్ము. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి ఉన్నారు. అయితే ద్రౌపది భర్తతోపాటు ఇద్దరు కుమారులు గతంలోనే మరణించారని వారు చెబుతారు. భర్త, ఇద్దరు కుమారులు మరణించడంతో.. ద్రౌపది తన కుమార్తె ఇతిశ్రీనే సర్వస్వం అయిందని..  ఇతిశ్రీకి వివాహం అయి.. ఆమెకు ఓ పాప కూడా ఉందని వారు పేర్కొంటారు.   ఇటీవలే ద్రౌపది ముర్ము.. తన 64వ పుట్టిన రోజును జరుపుకున్నారు. పుట్టిన రోజు జరుపుకున్న మరునాడే.. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమె పేరు ప్రకటించడం పట్ల ద్రౌపది ముర్ము... సంతోషం వ్యక్తం చేశారు.

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.