సాంకేతికతను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబకు ఎవరూ సాటి రారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు సార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి సిఎంగా ఐదేళ్లు, ఇప్పుడు కూడా ఆయన ప్రజల ప్రయోజనాల కోసం సాంకేతికను వాడుకునే విషయంలో ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తున్నారు.
విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తిన సందర్భంగా ఆయన అహర్నిశలూ ప్రజల క్షేమం కోసం, వారికి సత్వరంగా సహాయం అందించడం కోసం తపన పడ్డారు. విజయవాడలోని ముంపు ప్రాంతాలను చేరుకోవడానికి ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకున్నారు. బోట్లు, హెలికాప్టర్ల ద్వారా కూడా చేరుకోలేని ముంపు ప్రాంతాలలో బాధితులను ఆదుకునేందుకు ఆయన డ్రోన్ లను వినియోగించారు. వాటి ద్వారా అహారం, నిత్యావసరాలు, అత్యవసర మందుల పంపిణీ జరిగేలా చూశారు. బహుశా ముంపు ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు డ్రోన్ల వినియోగం దేశంలో ఇదే మొదటి సారి కావచ్చు. ఇటీవలి కాలంలో డ్రోన్ల ప్రయోజనం, ఉపయోగాల గురించి పదే పదే చెప్పిన చంద్రబాబు సరిగ్గా అవసరమైన సమయంలో వాటిని సంపూర్ణంగా వినియోగించి ప్రజలను ఆదుకున్నారు.
కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడి ద్వారా ఈ ఆపత్సమయంలో డ్రోన్లను రాష్ట్రానికి రప్పించి, సరైన సమయంలో సమర్ధవంతంగా వాటి సేవలను వినియోగించుకున్నారు. డిజాస్టర్ హెల్స్ కోసం తొలిసారిగా డ్రోన్లను రంగంలోకి దింపి సకాలంలో బాధితులను ఆదుకున్నారు. ఆయన విజన్ కు, ప్రజలకు కష్ట సమయంలో అండగా నిలవడానికి ఉన్న ఏ అవకాశాన్నీ వదులుకోని పట్టుదలకు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/drones-for-disaster-help-25-184175.html
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.