డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి..!

Publish Date:Dec 28, 2024

Advertisement

 

 

డ్రైవింగ్ నేర్చుకున్న వారికి చాలా సింపుల్ విషయం. కానీ  డ్రైవింగ్ రాని వారికి అది పెద్ద టాస్క్.  ఈ కాలంలో డ్రైవింగ్ ను చాలా ఈజీగా ప్రతి ఒక్కరూ నేర్చేసుకుంటున్నారు. కార్, బైక్, స్కూటీ ఇతర వాహనాలు ఏవైనా వాటిని ఎలా మెయింటైన్ చేయాలి? అందులో బటన్స్ కానీ,  బ్రేకులు కానీ ఎలాంటి సమయంలో ఎలా ఉపయోగించాలి? ఇవి తెలియడం,  వాహానాల రద్దీలో చాకచక్యంగా వాటిని వినియోగిస్తూ వెహికల్ ను ముందుకు నడపడం  తెలియాలి.  వీటిలో ఏమాత్రం తేడా వచ్చినా   యాక్సిడెంట్లు జరగడం,  ప్రాణాల మీదకు రావడం ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు..

ఫోన్..

ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదం.  ఈ విషయంలో ప్రభుత్వం నిషేధం విధించినా సరే.. చాలామంది ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తుంటారు. ఈ అలవాటు కేవలం డ్రైవింగ్ చేసే వారినే కాకుండా ఇతరుల జీవితాలను కూడా ప్రమాదంలో పడేస్తుంది.


వేగం..

వేగంగా ప్రయాణించడం సురక్షితం కాదు.. ఈ హెచ్చరిక బోర్డ్ చాలా చోట్ల రాసి ఉంటుంది. కానీ చాలామంది రాష్ డ్రైవింగ్ చేస్తుంటారు. ఇలా వేగంగా నడపడం వల్ల చాలా మంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయి.  ముఖ్యంగా డ్రైవింగ్ చేయడం అనేది తనకే కాదు.. ఎదుటి ప్రాణాలను ప్రమాదంలో నెట్టకుండా ఉండే చర్య అనే విషయం గుర్తుపెట్టుకోవాలి.

సీటు బెల్టు..

ప్రయాణించేటప్పుడు సీట్ బెల్టు పెట్టుకోవడం, బైక్ లో ప్రయాణిస్తున్నట్టైతే హెల్మెట్ వాడకం తప్పనిసరి.  ఇవి చేయనివారు ఎక్కువగా ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

తాగి డ్రైవ్ చేయవద్దు..

మద్యం సేవించి వాహనాలు నడపరాదు అనే హెచ్చరిక అందరికీ తెలిసిందే.  ముఖ్యంగా దీన్ని ప్రభుత్వాలే నిషేధించాయి కూడా.  అయినా సరే చాలామంది  అలాగే డ్రైవ్ చేస్తుంటారు. దీని వల్ల కొన్ని పరిస్థితుతులలో ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉంటుంది.

అలసట..

అలసటగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయడం కూడా మంచిది కాదు.  అలసిపోయినప్పుడు చాలామంది నిద్ర ఫీల్ అవుతారు.  డ్రైవ్ చేస్తుండగా నిద్రలోకి జారుకునే వారు కూడా ఉంటారు. ఇది చాలాపెద్ద ప్రమాదాలకు కారణం అవుతుంది.

ట్రాఫిక్..

ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ను అనుసరించి డ్రైవ్ చేయాలి.  ఈ నియమాలు ఉల్లంఘిస్తే  చట్టపరంగా డ్రైవింగ్ చేసే వారు సమస్యలు ఎదుర్కోవడమే కాకుండా ఇతరులు కూడా ప్రమాదంలో పడే అవకాశం, ఇతర వాహన చోదకులు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

హెడ్ లైట్..

హెడ్ లైట్లు ప్రతి వాహనాలకు ఉంటాయి. అయితే వీటిని సమర్థవంతంగా వినియోగించుకునేవారు చాలా తక్కువ.  హెడ్ లైట్ లు కేవలం వాహనానికి దారి చూపడానికే కాదు.. ముందు వెళుతున్న వాహనాలకు,  వెనుక వస్తున్న వాహనాలకు సరైన దిశానిర్దేశం చెయ్యడంలో కూడా సహాయపడతాయి.


                                            *రూపశ్రీ.

By
en-us Political News

  
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.