ఏటీఎం నగదు దోపిడీ కేసులో దర్యాప్తు ముమ్మరం

Publish Date:Feb 16, 2026

Advertisement

 

హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలో ఎటీఎం క్యాష్ వాహనంలో భారీ నగదు దోపిడీ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే... ఈ కేసులో డ్రైవర్ ఆచూకీ ఇప్పటివరకు లభ్యం కాలేదు. రూ.60 లక్షల నగదుతో పరారైన డ్రైవర్ అజీత్ అలియాస్ శివ్ కోసం సైబరాబాద్ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఘటన జరిగి రెండు రోజులు గడిచినా  కూడా ఇంతవరకు నిందితుడి ఆచూకీ లభించకపో వడంతో దర్యాప్తు మరింత వేగవంతం చేశారు.

గోపన్‌పల్లి ప్రాంతంలోని ఎటీఎం నుంచి నగదు లోడింగ్ చేసిన అనంతరం CMS క్యాష్ వాహనంతో బయలుదేరిన డ్రైవర్, కోల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్లాపూర్ సమీపంలో వాహనాన్ని వదిలి నగదుతో పరారయ్యాడు. ఆ తర్వాత అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో పోలీసులకు అనుమానాలు మరింత పెరిగాయి.ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి సారించిన సైబరాబాద్ పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటికే వందకు పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీ లించినట్టు సమాచారం. డ్రైవర్ కదలికలను గుర్తించే దిశగా సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు.

ఆరు నెలల క్రితమే ఉద్యోగంలో చేరిన అజీత్ ఈ దోపిడీకి పాల్పడటం గమనార్హంగా మారింది. అతనికి ఈ చోరీలో మరెవరైనా సహకరించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. క్యాష్ వాహనాన్ని వదిలి వెళ్లిన ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలు కీలకంగా మారనున్నాయి. నిందితుడి పరారికి ఉపయోగించిన మార్గాలు, అతనికి సహకరించిన వ్యక్తులపై పోలీసులు దృష్టి సారించారు. ఈ ఘటనతో నగరంలో ఎటీఎం క్యాష్ రవాణా భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
 

By
en-us Political News

  
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ తిరిగి దొరుకుతుందనే ఆశ చాలామందికి ఉండదు.
రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు
విశాఖపట్నం నగరంలోని చారిత్రాత్మక ఆంధ్రా విశ్వవిద్యాలయం శత వసంతాలను పూర్తి చేసుకుంది.
రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, మహేశ్వరం మండలం పరిసర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.
పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ పర్యటనలో ఉన్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సీపీఆర్వో గా పనిచేస్తున్న మారబోయిన మధుసూదన్ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు
హైదరాబాద్ నగర సమీపంలోని శంకర్పల్లి ప్రాంతంలో సోమవారం సాయంత్రం సమయంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
విశాఖపట్నం నగరానికి గర్వకారణమైన ఆంధ్రా యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాల ముగింపు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.
కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ఈ సమీక్షకు పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమస్య పరిష్కారానికి ఆదివారం రాత్రి నుంచి ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై సీఎం అధికారులను వివరణ కోరారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అంబర్‌పేట్ చే నంబర్ చౌరస్తా వద్ద సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.