దొంగిలించిన ఫోన్…తిరిగి చేతిలోకి...ఇది తెలంగాణ కొత్త చరిత్ర
Publish Date:Apr 27, 2026
Advertisement
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ తిరిగి దొరుకుతుందనే ఆశ చాలామందికి ఉండదు. కానీ ఇప్పుడు ఆ కథ మారుతోంది. డిజిటల్ యుగంలో సైబర్ భద్రతకు ప్రాధాన్యం పెరుగుతున్న వేళ, తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచేలా ఒక గొప్ప మైలురాయిని చేరుకుంది.దొంగిలించ బడిన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీలో రాష్ట్రం 1,24,850 ఫోన్లు తిరిగి యజమానులకు అందిస్తూ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిచింది.మొబైల్ దొంగతనాలను అరికట్టేం దుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూ నికేషన్స్ అభివృద్ధి చేసిన CEIR వ్యవస్థ దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. పైలట్ రాష్ట్రాల తర్వాత 19 ఏప్రిల్ 2023న తెలంగాణ లో ఈ సేవ ప్రారంభమైంది. ఆలస్యంగా ప్రారంభమైన ప్పటికీ అమలులో మాత్రం తెలంగాణ వేగం చూపిం చింది. కేవలం మూడేళ్లలోనే దేశానికి ఒక కొత్త ప్రమా ణాన్ని ఏర్పరచే స్థాయిలో ఫలితాలు సాధించింది. 2023 ఏప్రిల్ నుంచి 2026 ఏప్రిల్ వరకు నమోదైన గణాంకాలు రాష్ట్రం చేసిన కృషిని స్పష్టంగా చెబుతు న్నాయి. ఈ కాలంలో 1,24,850 మొబైల్ పరిక రాలు రికవరీ కాగా, 4,82, 652 పరికరాలు బ్లాక్ చేయబడ్డాయి. మరో 2,82,260 పరికరాలను ట్రేస్ చేసి అన్‌బ్లాక్ చేశారు. ఈ సంఖ్యలు కేవలం గణాంకాలు మాత్రమే కాకుండా వేలాది కుటుంబా లకు తిరిగి చేరిన విలువైన డేటా, జ్ఞాపకాలు, జీవనా ధారాన్ని ప్రతిబింబిస్తు న్నాయి.ఈ విజయానికి వెనుక ఉన్న ప్రధాన బలం తెలంగాణ పోలీసులు మరియు CID సమన్వ యం మాత్రమే.... రాష్ట్రం లోని 780 పోలీస్ స్టేషన్లలో CEIR వ్యవస్థను పూర్తిస్థా యిలో అమలు చేయడం ద్వారా ఫిర్యాదు నమోదు నుంచి మొబైల్ తిరిగి యజమానికి అప్పగించే వరకు ఒక క్రమబద్ధమైన విధానం అమల్లోకి వచ్చింది. ఇతర రాష్ట్రాల్లో వినియోగంలో ఉన్న మొబైల్ పరికరాలను కూడా తిరిగి రాబట్టేందుకు పోలీస్ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమం ఎంత గంభీరం గా అమలు అవుతుందో చూపుతోంది.పోగొట్టుకున్న మొబైల్ తిరిగి చేతిలో పడినప్పుడు ప్రజల ముఖా ల్లో కనిపించే ఆనందమే ఈ కార్యక్రమానికి అసలైన విజయం. డిజిటల్ భద్రతలో తెలంగాణ సాధించిన ఈ ఘనత ఇప్పుడు దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. పోగొట్టుకున్న ఫోన్ తిరిగి దొరకడం అసాధ్యం కాదు” అనే నమ్మకాన్ని తెలంగాణ పోలీసులు సాకారం చేశారు.
నోడల్ అధికారులు, పోలీస్ స్టేషన్ స్థాయి ఆపరేటర్లకు విస్తృత శిక్షణ ఇవ్వడం, సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించే కోర్ టీమ్ ఏర్పాటు చేయడం, జిల్లాల పనితీరును నిరంతరం సమీక్షించడం వంటి చర్యలు ఈ విజయా నికి పునాది అయ్యాయి.ప్రజల్లో అవగాహన పెంచేందుకు మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేపట్టడం కూడా కీలకంగా మారింది. ఇప్పుడు పౌరులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయగలుగుతు న్నారు.
http://www.teluguone.com/news/content/telangana-dgp-36-218415.html




