మహిళా లోకానికి ఆదర్శం డ్రైవర్ సంద్యా రాణి!

Publish Date:Jul 15, 2025

Advertisement

ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్..  అన్నారు  చిలకమర్తి వారు.  ప్రసన్నయాదవం  పద్యకావ్యంలో... నాలుగు పాదాల చంపకమాల పద్యంలో ఇది నాలుగో పాదం. తెలుగు భాషఫై కొద్దిపాటి మక్కువ, కొంచెంగా ప్రవేశం ఉన్న ఎవరికైనా ఈ పద్య పాదం తరచూ గుర్తుకు వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా..  డ్రైవర్   సంధ్యారాణి వంటి వారి కథలు విన్నపుడు చిలకమర్తి వారి పద్యం  చటుక్కున వచ్చి నాలుక పై వాలుతుంది. కొద్దిగా ప్రేమగా నేర్పిస్తే ఆడ లేడీస్ అన్ని విద్యలు ఇట్టే  నేర్చుకుంటారని, ఈ పద్య పాదం అర్థం. సరే. ఆ విషయాన్ని అలా ఉంచి అసలు విషయంలోకి వస్తే..  ఒరిస్సా ప్రభుత్వం తొలిసారిగా  ఒక మహిళను ప్రభుత్వ వాహన డ్రైవర్ గా నియమించింది. ఈ వార్త ఒరిస్సాలోనే కాదు, దేశ వ్యాప్తంగా, ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

నిజానికి  కారు డ్రైవింగ్ అన్నది  ముదితలకు రాని విద్య కాదు.  మహిళలు నేర్వని విద్యా కాదు.  హైదరాబాద్ వంటి మహానగారాల్లో వందల మంది.. కాదు  వేల మంది మహిళలు, కార్లు నడుపుతున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ లో పురుషులను దాటి దూసుకు పోతున్నారు. సొంత కార్లే కాదు.. క్యాబులూ నడుపుతున్నారు. నిజానికి.. మహిళలు సొంత కార్లు క్యాబులు కాదు, ఏకంగా యుద్ధ విమానాలనే నడుపుతున్నారు. పహల్గావ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సిందూర్ లో భాగంగా మన వైమానిక దళం పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలను, నేలమట్టం చేసిన ఆపరేషన్ లో  విమెన్ పైలెట్స్  చేసి చూపిన సాహస విజయం ప్రపంచాన్నే విస్మయ పరిచింది. 

ఇలా భారతీ మహిళలు అన్నిరంగాలలోకి చొచ్చుకు పోతున్నపుడు, ఒక మహిళ ప్రభుత్వ కారు డ్రైవర్  కొలువు పొందడంలో విశేషం ఏముందని అనిపించవచ్చును. కానీ  ఉంది... ఎందుకంటే, ఒరిస్సా ప్రభుత్వంలో ప్రప్రధమ డ్రైవర్  సంధ్యారాణి. అంతే కాదు ఆమెకు ఇది వరకూ ప్రైవేట్ స్కూల్ బస్ వంటి భారీ వాహనాలను నడిపిన అనుభవం కూడా ఉంది. 

అదొకటి  అయితే, సంధ్యారాణికి మొదటి నుంచి డ్రైవింగ్ పట్ల మక్కువ ఉండేది. విద్యార్థిగా ఉన్నరోజుల్లోనే బైక్ నడపడం నేర్చుకున్నారు. వివాహం తర్వాత కారు కూడా నేర్చుకోవాలని తన భర్తకు తెలిపారు. అలా మెల్లిగా కారును డ్రైవ్ చేయడం నేర్చుకున్నారు. ఆ తర్వాత సంధ్యారాణి భర్త నానో కారు ఆమెకు బహుమతిగా ఇచ్చారు. దీంతో ఆమె, తన స్నేహితులను రాష్ట్రంలోని వివిధ టూరిస్ట్ ప్రాంతాలకు కారులో తీసుకెళ్లేవారు. అలా డ్రైవింగ్ అనుభవంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. తర్వాత ఆమెకు పెద్ద వాహనాలు నడపాలని కోరిక కలిగింది. భర్త, బంధువుల సహకారంతో రాష్ట్ర రవాణా సంస్థ ఆధ్వర్యంలో కటక్ ఛాటియాలోని హెవీ మోటార్ వెహికిల్ శిక్షణ కేంద్రంలో డ్రైవింగ్ నేర్చుకొని లైసెన్స్ పొందారు. శిక్షణ అనంతరం 2023లో విదేశాలలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల వెళ్లలేకపోయారు. ఆ తర్వాత వివిధ ప్రైవేటు స్కూల్ బస్సులు నడిపారు. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో డ్రైవర్ పోస్ట్లకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. దాని గురించి తెలుసుకున్న సంధ్యారాణి దరఖాస్తు చేసుకున్నారు. 2025 జూన్ లో ఒడిశా వాణిజ్యం, రవాణా, గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి ప్రధాన కార్యదర్శి ఉషా పాధీకి అధికారిక డ్రైవర్‌గా సంధ్యారాణి నియమితులయ్యారు. 

ఒక విధంగా ఇది మహిళా సాధికారిత దిశగా మరో ముందడుగు అని చెప్పాలి. నిజానికి చిన్ననాటి చిరు కోరికను  స్వయం కృషితో వృత్తిగా మలచుకున్న సంధ్యారాణి మహిళలకే కాదు.. అందరికీ ఆదర్శమే. అలాగే  ఒరిస్సా ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా అన్నట్లుగా.. ఆమె నియామకం మహిళా సాధికారత, సాంప్రదాయేతర వృత్తులలో చేర్చడం వైపు బలమైన అడుగు. అలాగే..  ఇది ఆరంభం మాత్రమే .. ముందు ముందు ప్రతి  సంవత్సరం 500మంది మహిళలకు డ్రైవింగ్ లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఒరిస్సా ప్రభుత్వం నిర్ణయించింది. అలా ఆమె వేసిన ముందడుగు..  మహిళా లోకానికి మరో ఉపాధి మార్గాన్ని చూపింది. అందుకే  డ్రైవర్ రాణి .. సంద్యారాణి  మహిళా లోకానికి ఒక ఆదర్శం.

By
en-us Political News

  
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా, బూతుల నానిగా అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న కొడాలి నాని, 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం, గుడివాడ నియోజకవర్గంలో తాను స్వయంగా ఓడిపోవడంతో వెనక్కు తగ్గారు. కేసుల భయంతో మౌనాన్ని ఆశ్రయించారు. అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు.
జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక కారణమైతే.. రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది.
కవిత సైతం త‌న వ‌ల్ల పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు.. అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనీ, లెక్కలు తేల్చాలనీ డిమాండ్ చేయడం ద్వారా మొత్తం బీఆర్ఎస్ నే డిఫెన్స్ లో పడేశారు. దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగి.. అప్పటి కేటీఆర్, కేసీఆర్ ల ప్రసంగాలు, ప్రకటనలను రీ పోస్టు చేస్తూ హడావుడి చేస్తున్నది.
తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల కిందట దుబాయ్ వెళ్లారు. మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరు అనారోగ్యంతో ఉండటంతో మెరుగైన చికిత్స అందించడం కోసం ఆయన దుబాయ్‌కు వెళ్లినట్లు సమాచారం. చికిత్స అనంతరం తిరిగి రావాలని భావిస్తున్న తరుణంలో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చి, ఆ ప్రభావంతో దుబాయ్ విమానాశ్రయం మూతపడింది.
అదొక మార్ఫింగ్ వీడియో, ఏఐ జ‌న‌రేటెడ్ వీడియో అన్నారు. ఇందులో త‌న ప‌రువు తీసే కుట్ర దాగి ఉంద‌న్న బీఆర్ నాయుడు.. త‌న‌తో పాటు టీటీడీ ప్ర‌తిష్ట మంట‌గ‌లిపే య‌త్నం ఉంద‌ని ఆరోపించారు. అందుకే తాను సైబ‌ర్ క్రైమ్ ని ఆశ్ర‌యించానన్నారు.
ఆ పార్టీ అగ్రనాయకత్వం అప్పట్లో ప్రదర్శించిన ఉదాశీనత.. కవిత అవినీతిని సర్టిఫై చేసినట్లైందని అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే విషయాన్ని కల్వకుంట్ల కవిత కోర్టు తీర్పు అనంతరం మీడియా సమావేశంలో ఎత్తి చూపారు. పార్టీ కోసం కాకుండా.. పార్టీలో ఉన్న కొందరి స్వార్థం కోసం తనను బలిపశువును చేశారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేశాయి.
2047నాటికి ఆంధ్రప్రదేశ్ ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యం అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట ఇస్తే అది జరిగి తీరుతుంది. ఆయన ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించడమే తన ముందున్న కర్తవ్యమని చెప్పారు.
లిక్కర్ పాలసీపై తప్పుడు కేసు పెట్టి ఆమ్ఆద్మీ పార్టీని అంతం చేయాలని ప్రధాని మోడీ, అమిత్ షాలు కుట్ర పన్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. సీబీఐ నమోదు చేసిన కేసులో తనతో పాటు అందరికీ క్లీన్ చిట్ ఇస్తూ న్యాయస్థానం చారిత్రక తీర్పు ఇచ్చిందన్నారు.
వైవీ తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంలో ఎంత సంపాదించుకున్నారో తనకు తెలియదు కానీ, మిగిలిన వ్యవహారాల్లో మాత్రం ఆయన బాగానే సంపాపదించారని పేర్కొన్నారు. ఒంగోలు నియోజకవర్గం నుంచి తాను ఇంత వరకూ ఏడు సార్లు పోటీ చేసి ఐదు సార్లు గెలిచానన్నబాలినేని, ఆ ఓడిపోయిన రెండు సందర్భాలలోనూ కూటమి చాలా బలంగా ఉందని గుర్తు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.