Publish Date:Jun 12, 2026
హీరోయిన్ కావాలన్న కలతో సినీ రంగంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సైబరాబాద్ కు చెందిన యువతి కొందరి వేధింపులు, బెదరింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది.
ఆ యువతి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, సైదాబాద్‌కు చెందిన యువతి షార్ట్ ఫిల్మ్స్‌లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఓ యువకుడు ఆమె బాత్‌రూమ్‌లో ఉన్న దృశ్యాలను రహస్యంగా వీడియో తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆ వీడియోలను అడ్డంగా పెట్టుకుని గత ఆరు నెలలుగా ఆమెను వేధిస్తూ, బెదిరింపులకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ వేధింపులపై బాధిత యువతి పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు స్పందిం చలేదనీ, చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల మరోసారి కొందరు యువకుల నుంచి బెదిరింపులు రావడంతో ఆమె మళ్లీ పోలీసులను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయిందన్నారు.
నిరంతర వేధింపులు, మానసిక ఒత్తిడితో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి పది రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. తండ్రి లేని కుటుంబంలో తల్లి ఒంటరిగా జీవనం సాగిస్తుండగా, కుమార్తెను కోల్పోయిన ఆమె న్యాయం కోసం అధికారులను వేడుకుంటోంది. ఘటన జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువతి మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, బాధితురాలు ముందుగానే పోలీసులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. యువతి మరణానికి కారణమైన వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ ఆరోపణలపై పోలీసుల అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dream-of-becoming-a-heroine-shattered-36-222674.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.