కరువు ప్రాంతాల్లో గుప్తనిధుల వేట?
Publish Date:Oct 4, 2012
Advertisement
తరుచుగా కరువు ప్రాంతాల్లోనే గుప్తనిధుల వేట సాగుతోంది. ఈ ప్రాంతాల్లో పని దొరకక ఖాళీగా ఉండే వారిని కొందరు వ్యాపారులు గుర్తించి వారిని గుప్తనిధుల తవ్వకాలకు వినియోగిస్తున్నారని సమాచారం. దీంతో వారు తమకు పని, ఆదాయం లభిస్తోందని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులు ఏమి చెబితే దాన్ని యథాతథంగా అమలు చేస్తున్నారు. కొన్నేసార్లు పొరబాట్లు జరిగితే వాటిని భరించటానికి కూడా వెనుకాడటం లేదు. దీంతో గుప్తనిధుల వేట మూడుపువ్వులూ, ఆరుకాయలూలా విస్తరిస్తోందని తేలుస్తోంది. ప్రత్యేకించి ఈ పరిస్థితిని అథ్యయనం చేసిన పోలీసు అధికారులు కూడా ఆశ్చర్యపోయే అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కర్నూలు, కడప, చిత్తూరు తదితర రాయలసీమ జిల్లాల్లో ఇప్పటివరకూ ఈ గుప్తనిధుల తవ్వకాలు బారీస్థాయిలో జరిగాయి. కొత్తగా ఇప్పుడు తెలంగాణా జిల్లాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి.రంగారెడ్డి జిల్లా తక్కళ్లపల్లి గ్రామంలోని సాగర్ రహదారి దగ్గర గుప్తనిధుల తవ్వకాలు జరిగాయి. రాక్షసగుహలు ఇక్కడ ఉన్నాయని చెప్పుకుంటారు. అందువల్ల భారీగా లాభం వస్తుందని తవ్వకాలు జరిపేవారు ఆశపడుతుంటారు. ఈ తవ్వకాలకు జెసిబి వినియోగించారంటే తవ్వకందార్లు ఎంత తెలివిమీరారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎనిమిది అడుగుల లోతున తవ్వకాలు జరిగిన అధికార యంత్రాంగం మాత్రం స్పందించలేదు. ఆమ్యామ్యాలు అందుకున్నందునే అథికారులు స్పందించలేదని ఆరోపణలు వచ్చాయి. అయితే తవ్వకందార్లు లాభపడ్డారని మాత్రం తెలుస్తోంది. ఇప్పటిదాకా జరిగిన తవ్వకాలను బట్టి అన్ని ప్రాంతాలు కరువుకోరల్లో ఉన్నవే కావటం గమనార్హం.
http://www.teluguone.com/news/content/draught-area-24-17905.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





