జగన్ తానే మారెనా.. తీరే మారెనా?

Publish Date:Apr 4, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందా అంటే.. సోమవారం జరిగిన పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, నియోజకవర్గ ఇన్ చార్జిలతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగం విన్న వారంతా ఔననే సమాధానమిస్తున్నారు. వైనాట్ 175 నుంచి గ్రాఫ్ పెంచుకోకపోతే గెలుపు సులభ సాధ్యం కాదు అనే స్థాయికి ఆయన ధీమా దిగజారిపోయిందంటున్నారు.

 దీంతో ఆయన అసంతృప్త ఎమ్మెల్యేలు, నాయకులను బుజ్జగించడానికి త్వమేవ శరణం నాస్తి అన్నట్లుగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు అంటూ ఇంత కాలం ఎమ్మెల్యేలకు, మంత్రులకు హెచ్చరికలు మాత్రమే జారీ చేసిన జగన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. ఇటీవలి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనూరాథ విజయానికి తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగే కారణమంటూ కనీసం వారి సంజాయిషీ కూడా కోరకుండా సస్పెన్షన్ వేటు వేసిన ఆయన ఇప్పుడు స్వయంగా తన నోటితోనే పార్టీలో దాదాపు 60 మంది వరకూ ఎమ్మెల్యేలలో అసంతృప్తి గూడుకట్టుకుని ఉందన్న విషయాన్ని వెల్లడించారు.

సరే ఇది విపక్ష తెలుగుదేశం ఆరోపణగా చెప్పారనుకోండి అది వేరే విషయం. అయినా అసంతృప్త ఎమ్మెల్యేల సంఖ్య భారీగానే ఉందని ఆయన అంగీకరించినట్లుగానే భావించాల్సి ఉంటుందని అందుకు ఆయన ఎవరినీ వదులు కోవడం తన అభిమతం కాదన అనడంతోనే తేటతెల్లమైందని పరిశీలకులు అంటున్నారు.  

చాలాకాలం తర్వాత జగన్‌ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఎలాంటి క్లాసులూ, హెచ్చరికలు, బెదరింపులూ లేకుండా.. బుజ్జగింపు మాటలు, బతిమలాడుకునేలా జగన్ ప్రసంగం ఉండటంతో జగన్ లో మార్పు ప్రస్ఫుటంగా కనిపించిందనీ,   గతంలో పనిచేయకపోతే టికెట్లు ఇచ్చేది లేదని, మీకు అనేక అవకాశాలు ఇచ్చానని   బెదిరింపు ధోరణితో మాట్లాడిన జగన్‌.. ఈసారి మాత్రం చాలా సాత్వికంగా, ప్రశాంతంగా ‘నేను మీ వాడిని’, ‘మిమ్మల్ని మళ్లీ గెలిపించడమే నా లక్ష్యం’ అంటూ మాట్లాడటంపై ఎమ్మెల్యేలలోనే ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బకు తమ అధినేత దిగి వచ్చాడన్న చర్చ మొదలైంది. ఇక ఎమ్మెల్యేలు ఏళ్ల తరబడి చేస్తున్న పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కూ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.  అన్నిటికీ మించి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ఆయన సిట్టింగులందరికీ టికెట్లిస్తానని చెప్పారు.

 ఈ సమావేశం అనంతరం పలువురు ఎమ్మెల్యేలు జగన్ దిగి వచ్చేశారనీ, గతంలోలా ఆయనలో వైనాట్ 175 ధీమా ఇసుమంతైనా కనిపించడం లేదనీ, బొటాబొటీగానైనా మెజారిటీ స్థానాలు సాధించి మళ్లీ అధికారంలోకి వస్తే అదే పదివేలు అన్న భావన వ్యక్తమైందని అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన నాలుగేళ్ల తరువాత ఆయనకు ఎమ్మెల్యేల విలువ ఏంటో తెలిసినట్లుందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.   

By
en-us Political News

  
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు.
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత యువ షూటర్, తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ అద్భుత ప్రతిభ కనబరిచారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్‌లో మరోసారి ఆదాయపు పన్ను శాఖ దూకుడు పెంచింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంక్షేమ అధ్యాయానికి తెరలేచింది.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
ఒకవైపు ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, మరోవైపు అదే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పాల్గొనడం వల్ల ఆ తప్పులకూ, లోపాలకు చట్టబద్ధత కల్పించినట్లవుతోందన్న ఆయన ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.