హీరో రాజశేఖర్ ‘గోటీల ఫ్యాక్టరీ’ గుట్టురట్టు... అసలు నిజం ఇదీ!

Publish Date:Mar 16, 2026

Advertisement

 

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా వేదికగా సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్‌కు సంబంధించి ఒక వింత ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయనకు సొంతంగా ‘గోటీల ఫ్యాక్టరీ’ (గోళీల వ్యాపారం) ఉందని, దాని ద్వారా ఆయన కోట్లాది రూపాయలు గడిస్తున్నారంటూ కొన్ని కథనాలు నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా ఈ అంశంపై రాజశేఖర్ తో పాటు ఆయన భార్య జీవిత కూడా స్పందిస్తూ అసలు విషయాన్ని బయటపెట్టారు.

ఈ ప్రచారం ప్రకారం.. రాజశేఖర్ నెలకు దాదాపు 3 కోట్ల రూపాయల వరకు ఈ వ్యాపారం ద్వారా సంపాదిస్తున్నారని, అక్కడ పనిచేసే ఉద్యోగులకు లక్షల్లో జీతాలు ఇస్తున్నారని మీమ్స్, వీడియోలు హల్చల్ చేశాయి. కేవలం మీమ్స్‌కే పరిమితం కాకుండా, ఏఐ (AI) టెక్నాలజీని ఉపయోగించి రాజశేఖర్ దంపతులు ఫ్యాక్టరీని సందర్శించినట్లు కొన్ని నకిలీ వీడియోలను కూడా సృష్టించారు. ఇది కాస్తా ముదిరిపోయి, నిజంగానే ఆయనకు అటువంటి వ్యాపారం ఉందని అభిమానులు, సామాన్యులు నమ్మే పరిస్థితి వచ్చింది.

తమపై వస్తున్న ఈ వార్తలపై రాజశేఖర్ నవ్వుతూ స్పందించారు. తనకు ఎటువంటి గోటీల ఫ్యాక్టరీ లేదని ఆయన స్పష్టం చేశారు. "ఆ వీడియోలు చూసినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. అంత ఆదాయం వచ్చే ఫ్యాక్టరీ ఎక్కడుందో నాకు కూడా చెప్పండి, నేను వెళ్తాను" అంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. తన సన్నిహితులు, స్నేహితులు కూడా ఫోన్ చేసి నిజంగానే వ్యాపారం మొదలుపెట్టావా అని ఆరా తీస్తుండటంతో క్లారిటీ ఇవ్వక తప్పలేదని ఆయన పేర్కొన్నారు.

అయితే ఇదే విషయంపై జీవిత రాజశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి సరదా వార్తలను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని ఆమె తెలిపారు. రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి ఫేక్ వార్తలను నమ్మి ఎవరూ మోసపోవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం రాజశేఖర్ శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘బైకర్’  చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఆయన ఈ రూమర్లపై పూర్తిస్థాయిలో స్పందిస్తూ ‘గోటీల ఫ్యాక్టరీ’ పుకార్లకు చెక్ పెట్టారు. సినిమాల పరంగా బిజీగా ఉన్న రాజశేఖర్, తన పాత పాట 'ఇదేమిటమ్మా మాయ మాయ' మళ్లీ ట్రెండ్ అవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
 

By
en-us Political News

  
ఈ డీల్ వెనుక పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌ల దౌత్యం ఉంది. ఇరాన్‌కు ఇచ్చిన గడువు ముగియడానికి గంటల ముందు ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా యుద్ధ విరామం ప్రకటన చేశారు.
డోనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న దూకుడు రాజకీయాలు, ఇతర దేశాలపై హేతురహితంగా ప్రకటించిన టాక్స్ వార్ కారణంగా ప్రపంచ దేశాలలో అమెరికా తన పరపతిని వేగంగా కోల్పోతున్నది. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ట్రంప్ అహంకారమే కారణమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది. ఇరాన్ పై అమెరికా దాడులు, దాని పర్యవశానాల కారణంగా అమెరికా ఆర్థిక విశ్వసనీయత ప్రశ్నార్థకమైందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
షూటింగ్ ఖరీదైన క్రీడ.. ఒక మధ్యతరగతి యువకుడు ఆ రంగంలో అడుగుపెట్టడమే గొప్ప అనుకుంటే.. అక్కడితో ఆగకుండా భారత కీర్తి పతాకను ప్రపంచ దేశాలలో రెపరెపలాడిస్తూ.. అంతర్జాతీయ స్థాయిలో పతకాలను సాధించి దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాడు.
తాడేపల్లి, ఉండవల్లితో పాటు మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. సుమారు ఆరు గంటల పాటు సాగిన ఈ సోదాల్లో విశాఖపట్నం ఎండాడలో ఒక విలాసవంతమైన ఫ్లాట్, తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లిలో జీప్లస్ 2 భవనాన్ని గుర్తించారు. వీటితో పాటు 770 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి వస్తువులు, రూ.1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో మరో రూ.3 లక్షలు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం ఉన్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.
అదలా ఉంటే.. ఇరాన్ తమ భూభాగంలోకి ప్రవేశించిన అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేసిన సమయంలో ఆ విమానంలోని ఇద్దరు పైలట్ల ఇరాన్ భూభాగంలో చిక్కుకుపోయారు. వారిలో ఒకరిని అమెరికా రక్షణ దళాలు వెంటనే కాపాడాయి. కానీ రెండో పైలట్ ఆచూకీ కనిపించలేదు. దీంతో అమెరికా తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టింది. మరో వైపు ఇరాన్ అప్రమత్తమైంది. ఇరాన్ భూభాగంలో చిక్కుకున్న అమెరికా పైలట్ ను ప్రాణాలతో అప్పగించిన వారికి భారీ నజరానా ప్రకటించింది.
హైకోర్టు పిటిషనర్లకు హైకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకునే చర్యలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో కాళేశ్వరం వ్యవహారం న్యాయపరంగా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే కోర్టు తీర్పుతో ఈ వ్యవహారంలో స్పష్టత రానుంది.
శంషాబాద్ విమానాశ్రయం ఔట్‌పోస్ట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ కనకయ్య, ఎస్‌ఐ సిద్ధేశ్వర ఒక నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కేసు విచారణలో భాగంగా బాధిత కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.
ఎండల తీవ్రత కారణంగా నీటిని వెతుక్కుంటూ ఓ చిరుతపులి పిల్ల అడవిలో నుంచి గ్రామంలోకి వచ్చింది. నీటి కోసం వచ్చిన చిరుతపులి పిల్లపై వీధి కుక్కలు దాడి చేయడంతో ఆ చిరత పిల్ల మరణించింది.
జీవనోపాధి కోసం ఊరు వదిలి వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఒక నిర్లక్ష్యపు తమాషా ప్రాణాంతకంగా మారింది
కర్ణాటక రాజకీయాల్లో ఒక మాజీ శాసనసభ్యుడి వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
పంజాబ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది.
మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.