కేబుల్ బ్రిడ్జ్ ఆధునీకరణపైనే అనుమానాలు..140 కి చేరుకున్న మృతుల సంఖ్య

Publish Date:Oct 31, 2022

Advertisement

సాయింత్రాలు సరదాగా గడపడానికి పార్కులు, సినిమాలు సరేసరి. కానీ సరదాలు హఠాత్తుగా విషాదభరితంగా  మారు తుందని ఎవ్వరూ ఊహించరు. గుజరాత్ లో అదే జరిగింది. అక్కడి కేబుల్ బ్రిడ్జ్ ఉన్నట్టుండి అమాంతం నీటిలోకి కూలిపోయింది. ఈ సంఘటనలో  మరణించినవారి సంఖ్య 140కి చేరుకుంది. బ్రిటీష్ కాలంనాటి వంతెనను కొద్ది మాసాల క్రితం మరింత మెరుగులు దిద్ది బావుచేశారని చెబుతున్నారు. నాలుగురోజుల నుంచే వంతెన మీదకు సందర్శకులను అనుమతిస్తు న్నారు. ఈ సంఘటనలో 177 మందిని రక్షించగా, తీవ్ర గాయాలకు గురయిన 20 మందిని చికిత్సకు ఆస్పత్రికి తరలించారు. కాగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ బ్రిగేడ్ వారు రంగంలోకి దిగారు.  

కానీ కొంత భాగం ఇటీవలే ఆధునీకరించిన  వంతె ఈవిధంగా కూలిపోవడం పట్ల పర్యాటకులు విస్తు పోయారు. ఇది  ఎవరి లోపం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బ్రిటీష్ కాలం నాటి వంతెనను ఆధునీ కరించిన  అధికారుల మీద అనుమానాలకు దారితీయిస్తోంది. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటు న్న వంతెన పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారా అన్న అనుమానాలు, ప్రశ్నలు వినవస్తు న్నాయి.

అయితే ఈ సంఘటనలో ప్రాణాలతో బయట పడినవారు మాత్రం కూలడానికి కారణం అల్లరిమూక లనే చెబుతున్నారు. వారు హఠాత్తుగా వంతెనపై ఆడుతూ విపరీతంగా ఊపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనే అంటు న్నారు. అయినప్పటికీ అంతమాత్రాన కూలిపోతుందని అనుకోవడానికీ వీలులేదు. అల్తరి మూకలు ఆ విధంగా వ్యవహరించడం నేరమే కావచ్చు కాని వంతెనను బాగు చేయించిన కొద్ది మాసాలకే ప్రమాదం జరగడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. 

వాస్తవానికి ప్రమాదం జరిగిన సమయంలో 500 మంది వరకూ సందర్శకులు ఉన్నారని, వీరంతా నదిలోకి పడిపోయా రని తెలుస్తొంది. హఠాత్తుగా పడడంతో వెంటనే నదిలోకి దిగి కాపాడేవారు అంతగా లేపోవడంతో వెంటనే స్పందించి రక్షణ చర్యలు తీసుకునేందుకు అవకాశం లేకపోవడం వల్లనే  మరణించినవారి సంఖ్య పెరిగిందని అంటున్నారు. 

By
en-us Political News

  
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.