పార్టీ మారడం లేదు.. కేటీఆర్‌ను సీఎం చేయడమే నా లక్ష్యం.. మల్లారెడ్డి క్లారిటీ.!

Publish Date:Jul 24, 2026

Advertisement

తెలంగాణ రాజకీయాలలో తన విలక్షణ శైలితో నిత్యం వార్తల్లో నిలిచే  మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి గత కొంత కాలంగా కారు దిగడానికి సిద్ధంగా ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయన ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. కేటీఆర్ జన్మదిన వేడుకలలో శుక్రవారం (జులై 24నపాల్గొన్న ఆయన   తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ కేవలం నిరాధారమైన ప్రచారం, వదంతులు మాత్రమేనని స్పష్టత ఇచ్చారు. 

కేటీఆర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న చామకూర మల్లారెడ్డి తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించడమే కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ అని అన్నారు. కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మల్లారెడ్డి కల్వకుంట్ల తారకరామారావు..నూటపాతికేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు.

 కేటీఆర్ నాయకత్వంలోనే తాను కొనసాగుతానని, బీఆర్‌ఎస్ పార్టీ విజయం కోసం   కృషి చేస్తానని మల్లారెడ్డి స్పష్టంచేశారు. రాబోయే రాజకీయ సమరంలో బీఆర్‌ఎస్ తరఫున తాను కీలక పాత్ర పోషిస్తానని, కేటీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టే వరకు విశ్రమించనని శపథం చేశారు. 

Malla Reddy Party Change, KT Rama Rao, BRS Party Telangana, Malla Reddy Clarity, Telangana Politics, KTR Birthday

By
en-us Political News

  
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ తెలంగాణ భవన్‌
మందుల సామేల్ వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి కౌంటర్..!
దేశంలో ప్రస్తుతం నిరుద్యోగ యువత విద్యార్థుల భవిష్యత్తు తీవ్ర గందరగోళంలో పడింది.
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ కీలక అడుగు వేసింది.
పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత మళ్లీ తీవ్ర రూపం దాల్చింది.
నా నియోజకవర్గానికి జోలికి వస్తే మీకు మర్యాద దక్కదు.. ఘాటు హెచ్చరిక..!
ఢిల్లీలోని జంతర్ మంతర్ వీధులు ఈరోజు కేవలం నిరసనలకు వేదికగా మాత్రమే లేవు
చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి ..పేరెంట్-టీచర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీత రెడ్డికి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
చివరికి మర్డర్ చేయించింది కూడా సవతి తల్లే..!
హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితి జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం భారీ విషాదం చోటుచేసుకుంది.
పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం
నిందితులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి, తన తీర్పును ఈనెల 27కి రిజర్వ్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.