తెలుగుదేశం మహానాడుకు బస్సులు పంపితే కబడ్డార్.. రవాణా శాఖ హెచ్చరికలు

Publish Date:May 24, 2022

Advertisement

తెలుగుదేశం మహానాడుకు బస్సులు పంపితే కబడ్డార్ అంటూ ఏపీ రవాణా శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బస్సులను మహానాడుకు పంపించకుండా ఆయా యాజమాన్యాలకు హెచ్చరికలు చేసింది. అంతటితో ఆగకుండా మహానాడుకు ఒక రోజు ముందే అంటే బుధవారం సాయంత్రాని కల్లా అన్ని బస్సులూ, వ్యానులూ తమకు అప్పగించాలంటూ గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ప్రైవేటు ఆపరేటర్లు, స్కూళ్లు కాలేజీల యాజమాన్యాలకు రవాణా శాఖ అధికారులు పోన్లు చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

అప్పగించకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని చెబుతున్నారు. అలా అప్పగించమనడానికి వారు చెబుతున్న కారణం హాస్యా స్పదంగా ఉంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ మంత్రుల బస్సు యాత్ర 25వ తేదీ నుంచీ మొదలౌతోందనీ, అందు కోసం 25 సాయంత్రాని కల్లా వాహనాలను తమకు అప్పించాలనీ చెబుతున్నారు.  ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెంలో ఈ నెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్న సంగతి తెలిసిందే.  ఏపీకి పూర్వ వైభవం రావాలంటే తెలుగుదేశం మళ్లీ  అధికారంలోకి వచ్చి తీరాలని కోరుకుంటూ మండువవారిపాలెం రైతులు తమ భూములను మహానాడు కోసం ఇచ్చిన సంగతి విదితమే. ఈ నెల 27 ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 12 వేల మందితో మహానాడు సభ జరుగుతుంది. ఆ రోజున మహానాడు వేదిక నుంచి 17 తీర్మానాలు ప్రవేశపెట్టాలని టీడీపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ నెల 28 సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని  నిర్ణయించారు.  అదే రోజు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు కూడా టీడీపీ ప్రారంభిస్తుంది. రెండో రోజున అదే ప్రాంగణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో మహానాడుకు జనం ప్రభంజనంలా రాబోతున్నారన్న అంచనాలున్నాయి. ఇలా ఉండగా టీడీపీ మహానాడుకు జగన్ సర్కార్ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది.

 మహానాడు కోసం ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకుని చలానా కూడా  కట్టేసిన తరువాత బస్సులు ఇచ్చేది లేదని జగన్ సర్కార్ చెబుతోంది. మహానాడు కోసం వాహనాలు పంపిస్తే.. వాటిని సీజ్ చేస్తామంటూ రవాణాశాఖ అధికారులు ప్రైవేట్ ఆపరేటర్లను బెదిస్తోంది.  జగన్ సర్కార్ తీరు పట్ల తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. మహానాడుకు బస్సులు ఇవ్వవద్దంటూ ప్రైవేటు ఆపరేటర్లు, స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలకు  ఫోన్లు చేసి బెదరించిన రవాణా శాఖ అధికారుల వివరాలు సేకరించామనీ, వారందరూ త్వరలోనే తగు మూల్యం చెల్లించక తప్పదనీ తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు అన్నారు.

 గత నాలుగు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పార్టీ మహానాడును ఘనంగా నిర్వహించేందుకు తెలుగుదేశం శ్రేణులు సన్నద్ధమయ్యాయి. జగన్ సర్కార్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలుగు తమ్ముళ్లు బెదరరని అచ్చన్నాయుడు అన్నారు.  మహానాడు సక్సెస్ కాకుండా చేయాలనే కుట్రతోనే వైసీపీ సర్కార్ అధికారుల ద్వారా పావులు కదుపుతోందని, విమర్శించారు. స్టేడియం ఇస్తామని కలెక్టర్ చెబితే.. అద్దె కూడా కట్టామని, అయితే.. ఆ తరువాత తీరిగ్గా స్టేడియంను ఇచ్చేది లేదని కలెక్టర్ చెప్పారని ఆయన విమర్శించారు.  

By
en-us Political News

  
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
దసరా, దీపావళి పండగ సీజన్‌ సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది రైల్వే సిబ్బందికి అదిరిపోయే శుభవార్త అందించింది.
మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.