జగన్ సంపాదనను, నా సంపాదనతో పోల్చవద్దుః పెమ్మసాని
Publish Date:Apr 29, 2024
Advertisement
దేశంలోనే అత్యంత రిచెస్ట్ సి.ఎం.గా జగన్ మోహన్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థుల్లో ధనవంతుడు గా కష్టపడి ఈ స్థాయికి వచ్చిన నన్ను, జగన్‌తో పోల్చొద్దంటారు. తాను 2001లో బిజినెస్ ప్రారంభించి.. 24 ఏళ్లలో ఈ స్థాయికి ఎదిగానని పెమ్మసాని స్పష్టం చేశారు. 30 ఏళ్లు కష్టపడి, అమెరికాలో 40 శాతం పన్ను కడితే ఈ స్థాయికి వచ్చానని ఆయన చెప్పారు. క్విడ్ ప్రోకో ద్వారా రాత్రికి రాత్రే ఎదిగిన జగన్‌కు, తనకు పోలికే లేదంటారు. జగన్ తండ్రి నీడలో కష్టపడకుండా ఎదిగిన జగన్‌కు తనకు పోలికే లేదని తేల్చి పడేశారు. 2004లో ఆయన ఆస్తి కోటి రూపాయిలు ఉంది. క్విడ్ ప్రోకో చేసి దాని మీద వైయస్ జగన్ బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో తనకు, వైయస్ జగన్‌కు కంప్లీట్ డిఫరెంట్ ఉందంటారు పెమ్మసాని. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో పెమ్మసాని తన ఆస్తుల విలువ రూ.5,705 కోట్లుగా ప్రకటించారు. దీంతో ఆయన గురించి చర్చ మొదలైంది. ఆయన ఎవరు.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి.. ఏమి చేసి ఈ స్థాయికి ఎదిగారు అని గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. వైఎస్ వారసుడిగా వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఆయన ఆస్తులు రూ.750 కోట్లు. ఆయనపై 26 కేసులు ఉన్నాయి. 11 సీబీఐ, 9 ఈడీ కేసులు ఉన్నాయి. మరో 6 ఇతర కేసులు ఉన్నాయి. అక్రమంగా ఆస్తులు కూడగట్టారనే అభియోగం కింద 2012 మే 27న సీబీఐ.. జగన్‌ను అరెస్టు చేసింది. ఈ కేసుకు సంబంధించి 16 నెలల పాటు జగన్ చంచల్ గూడ జైలులో ఉన్నారు. 2013 సెప్టెంబర్2లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జగన్ అన్ అఫీషియల్‌గా మోదీతో అండర్‌స్టాండింగ్, అవగాహనతో వున్నారు. అందుకే ఆయన కేసుల విషయంలో కనీసం అఫిడవిట్ వేయకుండా సిబిఐ సాగదీస్తోంది. జగన్, ఎన్‌డిఏలో లేకపోయినా, తన ప్రత్యర్థి టీడీపీతో బీజేపీ కలిసిన జగన్ సపోర్ట్ బిజెపికే. జగన్ పరోక్ష స్నేహసంబంధాలే గత 10 ఏళ్ళ గా కేసుల్ని పట్టించుకోవపోవడానికి కారణం. రాజశేఖర్‌రెడ్డి చనిపోయినపుడు రిలయన్స్ వారే చంపించారంటూ వాళ్ల పెట్రోల్ బంకులను దహనం చేసి.. ఎంతోమంది అమాయకులు బలైపోవడానికి కారణమయిన జగన్.. ముఖ్యమంత్రి అయ్యాక అంబానీ అనుచరుడికి రాజ్యసభ సీటు ఇచ్చారు. తన నాన్నను కాంగ్రెస్ వాళ్లే సీబీఐ కేసులో ఇరికించారని చెప్పిన జగన్, తన లాయర్ ద్వారా జగనే, వైఎస్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చేలా చేశారు. - ఎం.కె.ఫజల్
పెమ్మసాని చంద్రశేఖర్. ఈ ఇద్దరి గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ సంపాదనను, నా సంపాదనతో పోల్చవద్దు. ఆయనది అక్రమ సంపాదన అని సీబీఐ చెబుతోంది. నాది అలా కాదు. నేను ఎంతో కష్టపడి సంపాయించుకున్నా. సో.. ఆయనతో నన్ను పోల్చవద్దంటున్నారు పెమ్మసాని చంద్రశేఖర్.
పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఇంటర్మిడియట్‌లో రోజుకు 15 నుంచి 16 గంటలపాటు కష్టపడి చదివి, ఆ క్రమంలో 27 ర్యాంక్ సాధించారు. హైదరాబాద్ ఉస్మానియాలో సీటు సంపాదించారు. ఇలా ఉస్మానియాలో వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్... పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం 2000 సంవత్సరంలో అమెరికాకు వెళ్లారు. అక్కడ... పీజీ పూర్తి చేసిన అనంతరం.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో టీచింగ్ ఫ్యాకల్టీగా ఐదేళ్లపాటు కొనసాగారు. ఇదే సమయంలో... మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు సహాయం చేసేవారు. ఇందులో భాగంగా... తాను సొంతంగా తయారు చేసిన నోట్స్ ను తక్కువ ధరకు ఆన్ లైన్ లో అందించేవారు. ఆయన రాసిన మెటీరియల్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో... విద్యార్థుల కోసం యూ వరల్డ్ ఆన్ లైన్ ట్రైనింగ్ సంస్థను ప్రారంభించి.. ఫార్మసీ, నర్సింగ్, లా, ఫైనాన్స్, అకౌంటింగ్ విభాగాల్లో లైసెన్సింగ్ పరీక్షలకు శిక్షణ ఇచ్చేవారు. అలా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ అమెరికాలో ఒక యువ వ్యాపారవేత్తగా ఎదిగారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఈ వ్యాపారం ద్వారా ఆయన కోట్ల రూపాయిలను సంపాదించారు! అలా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ అమెరికాలో ఒక ఎంటర్ పెనియర్‌గా ఎదిగారు. అమెరికాలో ఉన్న తన కంపెనీలలో ఎంతో మంది తెలుగు వారికి జబ్స్ ఇచ్చారు. 30 ఏళ్ళుగా అమెరికాలో ఉన్నప్పటికీ.. అక్కడ గ్రీన్ కార్డు కోసం అప్లయ్ చేయలేదు. తన దగ్గర డబ్బుందని ఎన్నికల పోటీ చేస్తున్నానని చెప్పడం కరెక్ట్ కాదు. అవకాశం వచ్చింది కాబట్టి తన జన్మభూమికి ఏమైనా చేయాలన్న ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చంద్రశేఖర్ చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/dont-compare-jagans-earnings-with-mine-pemmasani-25-174765.html