ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్.. ఏ విషయంలోనంటే?
Publish Date:Aug 20, 2026
Advertisement
ఇరాన్ తో యుద్ధం, హర్మూజ్ జలసంధి విషయంలో అమెరికా తాజాగా చేసిన క్లెయిమ్ ల నేపధ్యంలో ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు ఓ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ కి ఏ రకమైన సహాయ సహకారాలు అందించినా.. లేదా ఆ దేశానికి ఆర్థిక సహకారం అందించినా, అందించే ప్రయత్నం చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఆయన ప్రపంచ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌పై కనీవినీ ఎరుగని రీతిలో ఆర్థిక ఆంక్షలు విధిస్తామన్న ట్రంప్.. దీనిని ఆర్థిక యుద్ధంగా పరిగణించాలంటూ.. తన అధికారికి సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్ లో ప్రకటించారు. ఏ దేశమైనా తమ భూభాగంలోని ఆర్థిక సంస్థలు, బ్యాంకింగ్ వ్యవస్థలు, విమానాశ్రయాలు, ప్రభుత్వ రంగ సంస్థలను ఇరాన్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు ఉపయోగిస్తే.. ఆయా దేశాలు కూడా అమెరికా ఆర్థిక ఆంక్షలను ఎదుర్కోవలసి వస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ ఆర్థిక రంగానికి ఊతమిచ్చే నకిలీ కంపెనీల కార్యకలాపాలు, చమురు అక్రమ రవాణా, నిధుల బదిలీలను వెంటనే నిలిపివేయాలని అల్టిమేటమ్ ఇచ్చారు. ఇప్పటికే కొనసాగుతున్న ఆంక్షలు, సైనిక చర్యల కారణంగా ఇరాన్ నావికాదళం, వాయుసేనతో పాటు మిలిటరీ మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్న ట్రంప్. ప్రభుత్వం కూడా కుప్పకూలే స్థితికి చేరుకుందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఇరాన్ అణ్వస్త్ర సామర్థ్యాన్ని సాధించకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని, దీనికోసం అంతర్జాతీయ సమాజం సహకరించాలని పిలుపునిచ్చారు. Donald Trump warning to World countries, US Iran economic war, Trump Truth Social post, Iran sanctions, Iran nuclear dispute
http://www.teluguone.com/news/content/donald-trump-warning-to-world-countries-36-229315.html





