ట్రంప్ ను ఖతం చేస్తే.. 96 కోట్లు.. ఇరాక్ సాయుధ గ్రూప్ ఫత్వా.!
Publish Date:Jul 17, 2026
Advertisement
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ ఇరాక్‌కు చెందిన ఒక సాయుధ గ్రూప్ ఫత్వా జారీ చేసింది. డొనాల్డ్ ట్రంప్‌ను ఖతం చేసిన వారికి 10 మిలియన్ డాలర్ల అంటే ఇండియన్ కరెన్సీలో 96 కోట్ల రూపాయలు నజరానా ప్రకటించింది. పశ్చిమాసియా ప్రాంతంలో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతలు నడుస్తుండగా.. ఈ తాజా ప్రకటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ ప్రకటన వెనుక ఉన్న కారణాలు, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్ ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ తో పాటు రష్యా ప్రభుత్వ మీడియా సంస్థ అయిన ఆర్‌టీ తమ ప్రత్యేక కథనాల్లో ఇరాక్ సాయుధ గ్రూపు ప్రకటనక అత్యంత ప్రాధాన్యత ఇచ్చాయి. తమను తాము ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్ గా పేర్కొన్న ఆ సాయుధ సంస్థ ట్రంప్ పై ఫత్వా ప్రకటించింది. ఇందుకు కారణంగా ఐసిస్ ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడుతూ మరణించిన తమ కమాండర్ల గురించి గతంలో డొనాల్డ్ ట్రంప్ అవమానకరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనీ, తమ నేతలను కించపరిచినందుకు ప్రతీకారంగానే ట్రంప్ తలపై భారీ నజరానాను ప్రకటిస్తున్నట్లు ఆ గ్రూప్ పేర్కొంది. అయితే.. ఈ భారీ రివార్డు సొమ్మును హంతకులకు ఎలా అందజేస్తారు, దీనికి సంబంధించిన చెల్లింపుల ప్రక్రియ ఎలా ఉంటుంది అనే విషయాలపై సదరు గ్రూప్ స్పష్టత ఇవ్వలేదు. అదలా ఉంటే.. ఇరాన్ ప్రభుత్వ సంస్థ ఐఆర్ఎన్ఏ, రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ ఆర్‌టీలు ఈ సాయుధ గ్రూప్ చేసిన ప్రకటనను స్వతంత్రంగా ధ్రువీకరించలేదని తమ కథనాల్లో పేర్కొన్నాయి. ఈ పరిణామాలు పశ్చిమాసియా దేశాల్లో, అమెరికా దౌత్య వర్గాల్లో అలజడి రేపాయి. ఇరాన్, ఇరాక్ దేశాల్లో అమెరికా వ్యతిరేకత ఈ ప్రకటనతో ప్రస్ఫుటమైంది. Donald Trump bounty, Iraqi armed group, Trump assassination reward, Islamic Resistance in Iraq, Russia RT news, Trump news Telugu
http://www.teluguone.com/news/content/donald-trump-bounty-36-226230.html





