ట్రంప్, మస్క్ మధ్య ఎక్కడ చెడింది?
Publish Date:Jun 6, 2025
Advertisement
విరాళాలిచ్చి మరీ ట్రంప్ ని గెలిపించిన మస్క్ రివర్స్ కు కారణమేంటి? ఇన్నాళ్లూ కలసి మెలసి అలాయ్ బలాయ్ అన్న ఈ బాబాయ్- అబ్బాయ్ ఇప్పుడు సడెన్ గా ఎందుకు విడిపోయినట్టు? ట్రంప్ కీ మస్క్ కి ఎక్కడ చెడినట్టు? విరాళాలిచ్చి మరీ ట్రంప్ ని గెలిపించిన ఎలాన్ మస్క్ ఇప్పుడు బిగ్ బిల్ విషయంలో ఇంత వ్యతిరేకత ఎందుకు వ్యక్తం చేస్తున్నాడు? ఇదీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరి మెదళ్లనూ తొలుస్తున్న ప్రశ్న. దీనిపైనే ప్రపంచదేశాలలో సామాన్యుల నుంచి అధికారుల వరకూ, దేశాధినేతల నుంచి మేథావుల వరకూ జోరుగా సాగుతున్న చర్చ. ట్రంప్ మీద మస్క్ వరుస విమర్శనాస్త్రాలను గురి పెడుతున్నారు. మొన్న బిగ్ బిల్ ని పంది మాంసంతో పోల్చిన మస్క్.. ఇప్పుడు మరో బాంబు పేల్చారు.. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్‌రీ ఎప్ స్టైన్ తో ట్రంప్ నకు సంబంధాలున్నాయని.. కొత్త అప్ డేట్ ని ట్రంప్ వ్యతిరేకుల చేతికి ఇచ్చారు. ఏంటీ ఎప్ స్టైన్ స్కామ్ అన్నది అలా ఉంచితే.. మస్క్ ఏంటి ట్రంప్ కి ఇలా రివర్స్ తిరిగాడన్నది చర్చనీయాంశంగా మారిందిప్పుడు. నిజానికి ఎలాన్ మస్క్ 2024 ఎన్నికల్లో ట్రంప్ కోసం ఏకంగా 288 మిలియన్ డాలర్లు విరాళం ఇచ్చి మరీ ప్రోత్సహించారు. ఇది భారత కరెన్సీ ప్రకారం చెబితే ఏకంగా పాతిక వందల కోట్ల రూపాయలు. ఇందుకు మస్క్ కి మిగిలింది.. టెస్లా కార్ల షోరూములు ధ్వంసం కావడం, తన కంపెనీ షేర్ ధరలు అమాంతం 50 శాతం పడిపోవడం. ఆయన సంపద 100 బిలియన్ డాలర్లకు తగ్గడం. ఇవన్నీ ఒకెత్తైతే.. ఆయనకు వచ్చిన చెప్పపేరు మరో ఎత్తు. తన స్నేహితుడు ఐజాక్ మాన్ ను నాసా చీఫ్ గా ప్రకటిస్తానని మాటిచ్చిన ట్రంప్ మాట మార్చడంతో.. ఇటు గోడ దెబ్బ అటు చెంపదెబ్బగా మారింది మస్క్ పరిస్థితి. ఒక వేళ బిగ్ బిల్ గానీ అమల్లోకి వస్తే టెస్లా ఈవీల కొనుగోలు దారులకు ఇచ్చే మినహాయింపులు కట్ చేల్సి వస్తుంది. దీని ద్వారా.. మరో 1. 2 బిలియన్ డాలర్ల నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక పక్క తాను డోజ్ సలహాదారుగా ఉండి తీసుకున్న నిర్ణయాలు కూడా బెడిసికొట్టాయి. ట్రంప్ పాలనా పరమైన లోపాలన్నిటికీ మస్కే కారణం అన్న చెడ్డ పేరు అమెరికన్లలోకి భారీగా వెళ్లిపోయింది. దీంతో స్పేస్ ఎక్స్, టెస్లా వంటి తన కంపెనీల ప్రభ మసకబారడం మొదలైంది. దీన్నిబట్టీ చూస్తే అంతరిక్షంలోకి మనిషిని పంపి యాజ్ ఇటీజ్ నేలకు దించినంత ఈజీ కాదు రాజకీయాలంటే! అని మస్క్ కి తెలిసి వచ్చింది . కార్లు తయారు చేసి జనం మెప్పు పొందినంత ఈజీ కాదు రాజకీయాల్లో రాణించడం అంటే!అన్న తత్వం మస్క్ కి బెధపడింది. బేసిగ్గా ఇలాంటి వ్యాపారులు రాజకీయాల్లోకి వచ్చేదే తమ వ్యాపారాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలని. ఇందుకు రివర్స్ అయితే ఈ రాజకీయాలెందుకు? వాటికి ఇంత భారీ ఎత్తున విరాళాలు ఇవ్వడమెందుకు? ట్రంప్ కోసం తన గుడ్ విల్ ని, వ్యాపార సామ్రాజ్యన్నీ ఫణంగా పెట్టినందుకు మస్క్ కు మిగిలిందేమిటంటే పూడ్చుకోలేనంత నష్టం. దీంతో తండ్రి ఎరోన్ మస్క్.. తన కొడుకు ఎలాన్ మస్క్ సలహా ఇచ్చారు. అర్జెంటు గా ఆ ట్రంప్ సహవాసం వీడి.. భారత్ కి రా.. ఇక్కడి ఆలయాలను సందర్శించు. మనశ్శాంతిని పొందు! అని ససలహా ఇచ్చారట. ఇదిలా ఉంటే మస్క్ కూడా భారత్ కి రావల్సి ఉంది. కానీ ఎందుకో వాయిదా పడింది. కారణం.. టెస్లా కార్ల తయారీకి ఇక్కడ అవకాశం లేక పోవడం. కేవలం అమ్మకాలతో సరిపెట్టుకోవల్సి రావడం ఒక కారణం కాగా.. మరొకటి ఇక్కడ అధికార గణంతో ఎక్స్ కంటెంట్ మోడరనేషన్ విషయంలో చిన్న పాటి సమస్యలు తలెత్తాయి. దీంతో మస్క్ భారత్ ట్రిప్ ఆగింది. ప్రస్తుతం మస్క్ న్యూరాలింక్ అనే కొత్త ప్రాజక్ట్ లో ఉన్నారు.. దీన్నిబట్టీ చూస్తే వెన్నుముక విరిగిపోయిన వారికి కొత్త జీవితం ప్రసాదించడం, కంటి చూపు పోయిన వారిని చూడగలిగేలా చేయడం అనే మిషన్లో బిజి బిజిగా ఉన్నారు మస్క్. ఇలాంటి తన బిజినెస్ ఐడియాలు పొలిటిక్స్ లో వాడ్డం కుదరదని భావించి.. మొదట డోజ్ నుంచి బయటకొచ్చారు మస్క్. తర్వాత ట్రంప్ తీసుకుంటున్న బిగ్ బిల్ వంటి నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఎప్ స్టైన్ కి ట్రంప్ కి ఉన్న లింకులు బయట పెట్టి.. నేను ట్రంప్ కి డెడ్ యాంటీ అనే సిగ్నళ్లు పాస్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకంటే ట్రంప్ తీసుకునే నిర్ణయాల వెనక తాను లేను. తద్వారా నన్ను ఆడిపోసుకోకండి. నేను కూడా మీలాగా ట్రంప్ బాధితుడ్నే.. అని ఆయన జనాలకు క్లియర్ కట్ మెసేజ్ ఇస్తున్నట్టు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మస్క్ ఇంత భారీ ఎత్తున విరాళాలిచ్చి మరీ.. రాజకీయాల్లోకి రావడం వెనక ఒక ఉద్దేశముందని అంటారు. తాను కూడా ఒకనాటికి ట్రంప్ లా అధ్యక్షా! అనిపించుకోవాలని ఆశ. కానీ, విచిత్రమైన విషయమేంటంటే ఆదిలోనే హంసపాదు అన్నట్టు.. మస్క్ కి వరుస దెబ్బలు తగలడంతో.. ఇదిగో ఇలా రివర్స్ గేర్ వేస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు అమెరికన్ ఎనలిస్టులు.
http://www.teluguone.com/news/content/donald-trump-and-musk-became-rivas-25-199436.html





