ట్రంప్ టార్గెట్ భారత్.. ఫార్మా, కాపర్‌లపై టారిఫ్‌ బాదుడు

Publish Date:Jul 10, 2025

Advertisement

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రపంచ దేశాలపై టారిఫ్‌ల అస్త్రాన్ని ప్రయోగిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే అనేక దేశాలు టారిఫ్‌ల విషయంలో డీల్స్‌ చేసుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉండగా.. రోజుకో దేశానికి షాక్ ఇచ్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. లెటెస్ట్‌గా భారత్‌ను ఈ లిస్ట్‌లో చేర్చారు. ఓ వైపు ట్రేడ్‌ డీల్‌పై ఓ అవగాహనకు వస్తున్న సమయంలో భారత్‌ ఎగుమతి చేసే కాపర్, ఫార్మా ఉత్పత్తులపై భారీగా టారిఫ్‌లు విధిస్తామని అనౌన్స్ చేశారు. ఫార్మా ఉత్పత్తులపై 200 శాతం.. కాపర్‌పై 50 శాతం టారిఫ్‌ విధిస్తామని ఓ బాంబు పేల్చారు. 

 నిజానికి ట్రంప్‌ గతంలో సైతం భారత స్టాక్‌ మార్కెట్‌ను అల్లకల్లోలం చేసే వ్యాఖ్యలు చేశారు. కానీ అందులో అమలైనవి చాలా తక్కువే. కానీ ఈసారి ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు అమల్లోకి వస్తే మాత్రం భారత్‌కు పెద్దదెబ్బే అంటున్నారు. ఎందుకంటే భారత్‌ ఫార్మా ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఒక్క అమెరికాకే గత ఆర్థిక సంవత్సరంలో 9.8 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇది భారత ఫార్మా ఉత్పత్తిలో 40 శాతం. ఇక కాపర్ విషయానికి వస్తే.. టెక్, కన్‌స్ట్రక్షన్‌తో పాటు అనేక రంగాల్లో ఉపయోగించే కాపర్‌ను అమెరికాకు ఎగుమతి చేస్తోంది భారత్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2 బిలియన్ డాలర్ల విలువైన కాపర్‌ను ఎగుమతి చేసింది. ఆ క్రమంలో ట్రంప్‌ నిర్ణయాలు నిజంగా అమలైతే భారత్‌కు ఇబ్బందికర పరిస్థితులు తప్పవనే చెప్పాలి. 


ట్రంప్‌ ఇప్పటికే స్టీల్, అల్యూమినియం దిగుమతులపై టారిఫ్‌లు విధించారు. ఇప్పుడు ఆయన చూపు కాపర్, ఫార్మాపై పడింది. ఫార్మా కంపెనీలు తమ ఫ్యాక్టరీలను అమెరికాలోనే ఏర్పాటు చేసుకోవాలని ట్రంప్ అంటున్నారు. దీని కోసం ఏడాది సమయం ఇస్తామన్నారు. ఆ తర్వాత వారిపై 200 శాతం టారిఫ్‌లు విధిస్తామని చెబుతున్నారు.  ఇప్పటికే బ్రిక్స్‌ దేశాలపై అదనంగా 10 శాతం టారిఫ్‌లు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు అందులోని దేశాలపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. డాలర్‌ ఆధిపత్యం చేలాయించాలనేది ట్రంప్ ఆలోచన. కానీ బ్రిక్స్ దేశాలు అమెరికా ఆశలకు గండి కొట్టేలా ఉన్నాయనేది ఆయన భయం. అందుకే  తన అమ్ములపొదిలోని అత్యంత బలమైన అస్త్రంగా భావిస్తున్న టారిఫ్‌లను ప్రపంచదేశంపైకి వదులుతున్నారు. 


ఇప్పుడు ఇండియా ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి. ఇప్పటికే ట్రేడ్‌ డీల్‌పై అమెరికాతో మంతనాలు జరుపుతుంది భారత్. ఇక ఇండియన్ ఫార్మా కంపెనీలు తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌ను అమెరికాకు తరలించలేకపోయినా.. లేదా ఖర్చులను పెంచలేకపోయినా ఉత్పత్తిని నిలిపివేసే పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనరిక్ మందులు తక్కువ ఆదాయ మార్జిన్లను కలిగి ఉంటాయని.. ఈ క్రమంలో ఫార్మా కంపెనీలు రేట్లను పెంచలేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. 

దీనివల్ల ఉత్పత్తిని నిలిపివేస్తే అమెరికాలో మందుల కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ట్రంప్ తన టెంపరితనంతో నిజంగానే నిజంగానే టారిఫ్‌లను విధిస్తే మొదట ఆయా దేశాలకు తిప్పలు తప్పవు. అదే సమయంలో అమెరికాకు కూడా ఇబ్బందులు తప్పవనేది వాస్తవం. ఫార్మా కంపెనీలు ఏసియా దేశాల్లో చాలా తక్కువ ఖర్చుతో వీటిని ఉత్పత్తి చేస్తున్నాయి. అదే అమెరికాలో అయితే మరింత ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇది అమెరికన్లపై మరింత భారం మోపుతాయన్న చర్చ కూడా ఉంది. మరి ట్రంప్‌ ఆలోచన ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

By
en-us Political News

  
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫ‌కేష‌న్ జారీ చేయ‌గానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయ‌కుడు, మాజీ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ త‌ర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవ‌రిని ఎమ్మెల్సీ చేయాల‌ని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం న‌రేంద‌ర్ రెడ్డి.. నేడు ఆయ‌న రాజ‌కీయ స‌ల‌హాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్ద‌ల స‌భ‌లోకి స‌గ‌ర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.