చంద్రబాబు లెటర్ ప్యాడ్ లో అమరావతి అని ఎందుకు లేదు?

Publish Date:Apr 11, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  రాజధాని అంశం ఎప్పుడూ ఒక మండుతున్న నిప్పుకణమే. గత పదేళ్లుగా ఈ పేరు మారుతూ, రూపు మారుతూ ప్రజలను అయోమయంలో నెట్టేస్తోంది. తాజాగా  అమరావతికి చట్టబద్ధత లభించింది. అయితే వైసీపీ అధినేత రాజధానిగా ప్లాన్ బి అంటూ చేసిన మావిగన్ ప్రతిపాదన సంచలనంగా మారింది. దానిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది కూడా. ఈ నేపథ్యంలోనే తెలుగువన్ వాస్తవ వేదిక లో జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్, తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ రాజధాని భవిష్యత్ పై సమగ్రంగా చర్చించారు.  

ఈ చర్చలో డోలేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు   రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అసలు ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్' అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై డోలేంద్ర ప్రసాద్  తెలుగువన్ వాస్తవ వేదికలో కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. ప్రభుత్వ విధానాల్లో ఉన్న అస్పష్టతను, రాజకీయ నాయకుల ద్వంద్వ విధానాలనూ ఎండగట్టారు. ముఖ్యంగా జగన్ మావిగాన్' కాన్సెప్ట్,   ప్రస్తుత అమరావతి అభివృద్ధిపై ఆయన నిష్కర్షగా తన అభిప్రాయాలను వెల్లడించారు.  రాజధాని అనేది కేవలం భవనాల సముదాయం కాదని, అది ఒక జీవకళతో ఉట్టిపడే నగరం కావాలన్నారు. 
 
2014లో విభజన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం, అక్కడ భారీ స్థాయిలో భూసేకరణ చేపట్టింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన  జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులంటూ  అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించి పాలన వికేంద్రీకరణ అంది. అయితే అది మాటలకే పరిమితమైంది. ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తింపు పొందిన తరువాత జగన్ అమరావతిపై తన వ్యతిరేకతను స్పష్టంగా చాటుతూ.. విజయవాడ-గుంటూరు ప్రాంతాన్ని కలిపి  మావిగాన్  అంటూ చేసిన కొత్త ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాస్తవ వేదికలో డోలేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు.  

అమరావతి పేరు ముఖ్యమంత్రి లెటర్ హెడ్ మీద  ఉందా అని ప్రశ్నించారు. అమరావతి పేరు సీఎం లెటర్ హెడ్ మీదే లేకుంటేఇన్వెస్టర్లకు నమ్మకం ఎలా కలుగుతుందని నిలదీశారు. అమరావతి-విజయవాడ ప్రాంతానికి వాస్తు దోషం ఉందంటూ వస్తున్న ప్రచారాన్ని  పాలకులు  ఎలా విస్మరిస్తారన్నారు.   రాజధానిలో కేవలం మాల్స్ కడితే సరిపోదని, అక్కడ జనం రాకపోకలు   ఉండాలని, అప్పుడే వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయన్నారు.  పేద, మధ్యతరగతి ప్రజల జీవనోపాధికి అక్కడ చోటు ఉండాలన్నారు.  తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో రాజకీయ నాయకుల మధ్య సంకుచిత మనస్తత్వం ఎక్కువైందని, ఒక ప్రభుత్వం మొదలుపెట్టిన పనిని మరొక ప్రభుత్వం నాశనం చేయడం రాష్ట్ర దౌర్భాగ్యమన్నారు.  

రాజధాని ఒక డెడ్ సిటీలా మారకుండా ఉండాలంటే తక్షణమే అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ విద్యాసంస్థలు, ఆసుపత్రులు,  ఉపాధి అవకాశాలు మెండుగా ఉండాలని చెప్పారు. చంద్రబాబు అమరావతి నిర్మాణం విషయంలో ఇసుమంతైనా జాప్యం లేకుండా మళ్లీ ఎన్నికలు వెళ్లేలోగానే పూర్తి చేయాలన్నారు.  వచ్చే రెండు మూడేళ్లలో అమరావతికి ఒక స్పష్టమైన రూపురేఖలు వస్తాయని, ఆ తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా దాన్ని కాదనలేని విధంగా అభివృద్ధి జరగాలన్నారు.  

జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్, తెలుగువన్ ఎండీ కంఠంనేనిల చర్చను తెలుగువన్ వాస్తవ వేదికలో వీక్షించండి

 

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.