కుక్క రాజకీయాల విందు

Publish Date:May 18, 2023

Advertisement

రాజకీయ పార్టీలు ఒకరు మీద మరొకరు ఆరోపణలూ ఆక్షేపణలూ చేసుకోవడం మామూలే.! బిహార్ లోని బీజేపీ నేత విజయ్‌ కుమార్‌ సిన్హా జేడీయూ నేత లాలన్ సింగ్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
వ్యాపారంలో కాంపిటేషన్ వస్తున్న హోటల్ ను దెబ్బతీయాలన్న అక్కసుతో మరో కాంపిటేటర్ ఇలాగే కుక్క బిర్యానీ సప్లయ్ చేస్తున్నట్లు కొన్ని సంవత్సరాల క్రితం ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. విషయం ఏంటంటే బిహార్ లోని జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడు లాలన్ సింగ్ ఈ నెల 14న ముంగేర్‌లో పార్టీ కార్యకర్తలకు మాంసంతో కూడిన విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.ఈ సందర్భంగా కొందరు కర్రలతో కొట్టుకున్నారు. ఈ సిచ్యుయేషన్ని అడ్వాంటేజ్ తీసుకుని తన అక్కసు వెళ్లగక్కారు బీజేపీ నేత విజయ్‌ కుమార్‌ సిన్హా. జేడీయూ మటన్‌ విందు పార్టీ తర్వాత వందలాది కుక్కలు మాయమయ్యాయంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.జేడీయూ కార్యకర్తలకు కుక్క మాంసంతో విందు ఇచ్చినట్లు పరోక్షంగా ఆయన ఆరోపించారు. అలాగే మద్యం కూడా సరఫరా చేసి ఉంటారని, దీనిపై దర్యాప్తు జరుపాలని డిమాండ్‌ చేశారు.కాగా, జేడీయూ కార్యకర్తలకు ఇచ్చిన ఈ విందుపై బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హా బుధవారం వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ విందు పార్టీ తర్వాత నగరంలో వందల సంఖ్యలో కుక్కలు మాయమైనట్లు చాలా మంది తనకు చెప్పారని అన్నారు.ఆ పార్టీ కార్యకర్తలకు వేలాది జంతువుల మాంసంతో విందు ఇచ్చారని ఆయన ఆరోపించారు. దీని వల్ల ఏ వ్యాధి వ్యాపిస్తుందో అని అనుమానం వ్యక్తం చేశారు. అలాగే జేడీయూ కార్యకర్తలకు విందు సందర్భంగా మద్యం కూడా సరఫరా చేశారా లేదా అన్నదానిపై దర్యాప్తు జరుపాలని డిమాండ్‌ చేశారు.మరోవైపు బీజేపీ నేత విజయ్‌ కుమార్‌ సిన్హా చేసిన ఈ వ్యాఖ్యల వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.దీనిపై జేడీయూ స్పందించింది.మానసిక పరిస్థితి సరిగా లేక ఆయన ఇలా మాట్లాడుతున్నారని జేడీయూ అధికార ప్రతినిధి అభిషేక్ ఝా విమర్శించారు. తన ప్రజలకు ఇచ్చే విందులో ఏ జంతువు మాంసాన్ని వడ్డిస్తారో విజయ్ కుమార్ సిన్హా చెప్పాలని అన్నారు.
ఈ వార్త చదివిన తర్వాత రాజకీయ పార్టీలు పెట్టే విందులు, వినోదాలకు ప్రత్యర్థి పార్టీలు భయంతో డుమ్మా కొడతాయేమో ...

By
en-us Political News

  
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్‌ నియోపోలిస్‌ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.
తండ్రి అంటే పిల్లలకు ఉండే ప్రాణం, ఆప్యాయత ఎంతో గొప్పవి. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు ఊహకందని వింత నిర్ణయాలకు దారితీస్తుంది.
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.