ఇందిరాగాంధీ అడుగుజాడల్లో సోనియాగాంధీ?

Publish Date:Mar 14, 2022

Advertisement

కాంగ్రెస్ పార్టీ ఎంతో చరిత్రగల పార్టీ. ఎన్నో సంక్షోభాలను చూసింది. అవరోధాలను అధిగమించింది. అయితే, ఇప్పుడు ఎదుర్కుంటున్న గడ్డు పరిస్థితి ముందెన్నడూ, చూసింది కాదు, విన్నది కాదు. సో... ఇక కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వ వైభవం కాదుకదా, అదులో పావు వైభవం కూడా మళ్ళీ పొందే పరిస్థితి లేదు, నో ... ఛాన్స్. ది రైటింగ్ ఆన్ ది వాల్ ఈజ్ వెరీ క్లియర్... గోడ మీద రాత చాలా స్పష్టంగా వుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి చవిచూసిన నేపధ్యంలో, గత కొద్ది రోజులుగా దేశ రాజకీయాల్లో ఇలాంటి చర్చ చాలా జోరుగా సాగుతోంది. అయితే, నిజంగా కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తిరిగి పొందుతుందా, మళ్ళీ అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందా, అనే విషయాన్ని పక్కన పెడితే, కాంగ్రెస్ పార్టీ గతంలోనూ ప్రస్తుతం ఎదుర్కుంటున్న సక్షోభాన్ని మించిన సంక్షోభం ఎదుర్కుందని, చరిత్ర చెపుతోంది. 

అత్యవసర పరిస్థితి అనంతరం, 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీఅధికారం కోల్పోవడమే కాదు,  ప్రధాని హోదాలో సొంత నియోజక వర్గం రాయ్’బరేలి నుంచి పోటీ చేసిన ఇందిరా గాంధీ, అమేథీ నుంచి పోటీ చేసిన ఆమె కుమారుడు సంజయ్ గాంధీ ఇద్దరూ ఓడి పోయారు.ఆ ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ అనుకూల వ్యతిరేక వర్గాలుగా చీలి పోయింది. ఇదిరాగాంధీ వ్యతిరేక వర్గం, ఆమెను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. అంతవరకు ఇందిరా గాంధీ మంత్రి వర్గంలో హోమ్ మంత్రిగా ఉన్న కాసు బ్రహ్మనంద రెడ్డి పార్టీ అధ్యక్షుడయ్యారు. 

అయితే ఇందిరాగాంధీ, పార్టీ అధ్యక్ష పదవిని తిరిగి దక్కించుకునేందుకు, శత విధాలా ప్రయత్నించారు. అయినా, ఫలితం లేక పోవడంతో, చివరకు పార్టీని చీల్చేందుకు సిద్దమయ్యారు. ముందుగా, 20 మంది సభ్యులున్న, జాతీయ కార్యవర్గం సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. ఆమె వెంట 1977 డిసెంబర్ 7 మరో ఏడుగురు సభ్యులు రాజీనామా చేశారు. పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. దీంతో, కాంగ్రెస్ పార్టీ 1969 చీలిక తర్వాత మళ్ళీ అంతటి సంక్షోభ పరిస్థితిని ఎదుర్కుంది. నిజానికి 1969 చీలిక సమయంలో కూడా, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీనే పార్టీని వదిలి వెళ్ళారు. మెజారిటీ సభ్యులను తమ వెంట తిప్పుకుని పార్టీని హస్త గతం చేసుకున్నారు. అలాగే, 1977 సంక్షోభ  సమయంలోనూ ఇందిరా గాంధీ, అదే ఫార్ములాను ఫాలో అయ్యారు. 

పార్టీ పదవికి  రాజీనామ చేసిన కొద్ది రోజులకే ఇందిరా గాంధీ పార్టీలోని తమ  మద్దతుదారులతో, పార్టీని బలోపేతం చేసే పేరున సమావేశం ఏర్పాటు చేశారు. చరిత్ర పునరావృతం అయింది.
ఇందిరా గాంధీ ఏర్పాటు చేసిన సమ్మేళనాన్ని భగ్నం చేసేందుకు  బ్రహ్మానంద రెడ్డి వర్గం అన్ని ప్రయత్నాలు చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు బ్రహ్మనంద రెడ్డి, కాంగ్రెస్ పార్లమెంటరీ నాయకుడు వైబీ చవాన్,   ఇందిరా గాంధీ మీద విరుచు పడ్డారు. “ ఇందిరా గాంధీ వల్లనే పార్టీలో సంక్షోభం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ తమ ఆధిపత్యాన్ని నిలుపుకుని, పార్టీని తమ గుప్పిట్లో బంధీని చేసేందుకు, ఇందిరా గాంధీ సంక్షోభం సృష్టించారు” అంటూ ప్రకటనలు చేశారు. ఆమె వెంట వెళ్ళవద్దని విజ్ఞప్తులు చేశారు. అయిన 1978 జనవరి 1 న ఇందిరా గాంధీ ఏర్పాటు చేసిన సమ్మేళనం సక్సెస్ అయింది.

ఇక ఆ తర్వాత ఏమి జరిగింది నేడు చరిత్ర. ఇందిరా గాంధీ, కాంగ్రెస్ (ఇందిర) పేరిట సొంత పార్టీ పెట్టి, సంవత్సరం తిరగకుండానే, మొరార్జీ దేశాయ్ జనతా ప్రభుత్వాన్ని విజయవంతంగా కూల్చి వేశారు. ఎన్నికల్లో విజయం సాధించి, అధికారాన్ని, హస్తగతం చేసుకున్నారు. ఆ తర్వాత కొద్దికాలానికే రెడ్డి కాంగ్రెస్ అంచెలంచెలుగా ఇందిరా కాంగ్రెస్’లో కలిసి పోయింది. ఇందిరా కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్’గా మళ్ళీ గుర్తింపు పొందింది.  అయితే, ఇప్పుడు కూడా అదే పరిస్థితి వుందా? ఇందిరా గాంధీ అడుగు జాడల్లో సోనియా గాంధీ, అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, రాహుల్, ప్రియాంక సారధ్యంలో కొత్త కాంగ్రెస్’కు ప్రాణం పోస్తారా? అంటే, రాజకీయాల్లో ఎప్పుడైనా, ఏదైనా జరగవచ్చును అంటున్నారు. 

By
en-us Political News

  
చనిపోయిన రోగుల పేర్లపైనా బిల్లులు..ఏసీబీ దాడుల్లో బట్టబయలు.!
నడవడానికి కేటాయించిన ఫుట్‌పాత్‌పై కూడా ప్రశాంతంగా అడుగులు వేయలేని పరిస్థితి.. రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తప్పించుకోవడానికి కొందరు వాహనదారులు ఏకంగా పాదచారుల దారినే ఆక్రమిస్తున్నారు.
బంగారం ధరలు భారీగా పడిపోవడం ఆభరణాల కొనుగోలుదారులకు ఊరటనిస్తుంటే.. పసిడిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న వారికి మాత్రం కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? ముఖంపై చిన్న మొటిమ వచ్చినా.. చర్మంపై నల్లటి మచ్చ కనిపించినా అమ్మాయిలు ఆందోళన చెందుతారు.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెంగళూరుకు చేరుకోవడంతో యలహంక ప్యాలెస్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగంలో లోతైన సాంకేతిక నైపుణ్యం కలిగిన నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
మత్తుపదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నషా ముక్త్ భారత్ ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని సినీ నటుడు ప్రభాస్‌ను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆహ్వానించారు.
ఇద్దరు ఆడపిల్లలు పుట్టారన్న కారణంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.