Publish Date:Aug 12, 2022
ఏపీ మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయం టీవీ సీరియల్ లా సా...గుతోంది. రోజుకో కుదుపు.. పూటకో మలుపులా ఈ కేసు విచారణ తీరు మారింది. సీబీఐ దర్యాప్తు ఒక అడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కు చందంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే వివేకా హత్య కేసు దర్యాప్తు విషయంలో ఆయన కుమార్తె డాక్టర్ సునీత సుప్రీంను ఆశ్రయించారు.
తన తండ్రి హత్య కేసు విచారణ సుప్రీం కోర్టు పర్యవేక్షణలో కొనసాగాలని ఆమె దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐని ఆమె ప్రతివాదులుగా చేర్చారు. అత్యంత దారుణంగా, అమానవీయంగా జరిగిన తన తండ్రి హత్య కేసులో సీబీఐ విచారణలో ఎలాంటి పురోగతీ కనిపించడం లేదని తన పిటిషన్ లో సునీత పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులే దర్యాప్తు అధికారులపై కేసులు పెడుతున్న వైనాన్ని కూడా తన పిటిషన్ లో సునీత పేర్కొన్నారు.
2019 మార్చి 15న వివేకానందరెడ్డిని పులివెందులలోని తన నివాసంలోనే దారుణం హత్యకు గురైన సంగతి విదితమే. ఈ కేసుకు సంబంధించి ఎర్ర గంగిరెడ్డి, వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరి, సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిందితులుగా ఈ ఐదుగురి పేర్లు తెర మీదకు వచ్చినా.. వీరి వెనక సూత్రధారులు ఉన్నారనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. వివేకా హత్య జరిగి మూడేన్నరేళ్లు పూర్తయినా ఇంకా దోషులెవరనేది తేలనే లేదు.
అయితే.. తన తండ్రి హత్య కేసు విషయంలో ఆయన కుమార్తె సునీతారెడ్డి పట్టు వీడకుండా న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే నిందితులు ఉల్టా కేసులు వేయడం, సీబీఐ అధికారుల కారు డ్రైవర్ పై బెదిరింపులకు పాల్పడడం వంటి ఘటనలతో విచారణ నత్తనడక నడుస్తోంది. దీంతో సునీతారెడ్డి తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన తండ్రి హత్య కేసు విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలంటూ ఆమె పిటిషన్ వేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/doctor-sunita-file-pitition-in-supreme-on-probe-of-her-fathers-murder-case-39-141806.html
Publish Date:May 10, 2026
సాధారణంగా శుభకార్యాలకు నవమిని రిక్త తిథిగా పరిగణిస్తారు. రాముడు పుట్టింది నవమి రోజే కదా? అని కొందరు సమర్థించినా, రాజ్యాధికారానికి నవమి అంత మంచి తిథి కాదు. నవమి రోజు ప్రారంభించే పనుల్లో తరచూ ఆటంకాలు లేదా మధ్యలో విరామాలు వచ్చే అవకాశం ఉంటుందంటారు. ఇది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి, భాగస్వామ్య పక్షాల నుంచి ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి వెలువడే ప్రమాదం ఉంది.
గత కొద్ది రోజులుగా తమిళ రాజకీయాల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆరు రోజుల పాటు ఎడతెగకుండా సాగిన రాజకీయ ఉత్కంఠకు ముగింపు పలుకుతూ, మెజారిటీ పార్టీల అండతో విజయ్ పీఠాన్ని అధిష్టించబోతున్నారు.
హైదరాబాద్ లోని పెట్రోలియం శాఖకు చెందిన మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్టును ప్రధాని మోడీ ఆదివారం ( మే 10) జాతికి అంకితం చేయనున్నారు. ఈ టూర్ కు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సురేష్ గోపి, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారికి ఆహ్వానం అందింది. అయితే ఈ ఆహ్వాన పత్రికలో బండి సంజయ్ పేరు మాత్రం లేదు.
ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం సాయంత్రం 4:40 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్తారు. అక్కడ ఇరువురు నేతలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. అన్నిటికీ మించి ప్రధాని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కావడం ఎన్డీయే కూటమి ఐక్యతను చాటడంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.