కాకరకాయ వండేటప్పుడు విత్తనాలు తొలగిస్తున్నారా..వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకవుతారు..!

Publish Date:Aug 21, 2026

Advertisement

కాకరకాయ అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది దాని చేదు రుచే.  అయితే కాకరకాయను చేదు లేకుండా వండే క్రమంలో చాలామంది వాటిని ఉప్పులో, చింతపండు రసంలో నానబెడుతూ ఉంటారు.  వీటి కారణంగా  అందులో విత్తనాలు వచ్చేస్తుంటాయి.  మరికొందరు కావాలనే  కాకరకాయ నుండి విత్తనాలను తీసేసి పారేస్తుంటారు. అయితే కాకరకాయలోని విత్తనాల్లో కూడా కొన్ని పోషక విలువలు ఉంటాయని చాలామందికి తెలియదు.  కాకరకాయ నుండి విత్తనాలు తొలగించే ముందు  అందులో ఉన్న పోషకాల గురించి వివరంగా తెలుసుకోవాలి. అవేంటంటే...

కాకరకాయ విత్తనాలలో పోషకాలు..

కాకరకాయలోని విత్తనాల్లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌తో పాటు  బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. అయితే విత్తనాల పోషక విలువ కాకరకాయ రకం, పక్వత, వంట విధానాన్ని బట్టి మారతాయట.

కాకరకాయ విత్తనాలు ప్రయోజనాలు..

 జీర్ణక్రియకు ఉపయోగపడొచ్చు

కాకరకాయలో ఫైబర్ ఉంటుంది. సరైన మోతాదులో తీసుకుంటే ఆహారంలో ఫైబర్ పెరగడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా ఉండటానికి, మలబద్ధకం తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. కాకరకాయ విత్తనాలు తినడానికి ఇష్టపడని వారు వాటిని కారం పొడిలాగా కూడా చేసుకుని తింటారు.

యాంటీఆక్సిడెంట్లు..

కాకరకాయలో వివిధ యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను ఎదుర్కోవడంలో సహాయపడే సామర్థ్యం కలిగి ఉండవచ్చు.

రక్తంలో చక్కెర..

కాకరకాయను రక్తంలో చక్కెర నియంత్రణకు ఉపయోగిస్తారని చాలాకాలంగా చెబుతుంటారు. కాకరకాయలోని కొన్ని సమ్మేళనాలు గ్లూకోజ్ మెటబాలిజంపై ప్రభావం చూపుతుంది. కాకరకాయనే కాకుండా కాకరకాయ విత్తనాలను కూడా ఆహారంలో తీసుకోవడం మరీ మంచిది.

విత్తనాలు ఎప్పుడు తీసేయాలి?

కాకరకాయ చిన్నగా, లేతగా ఉన్నప్పుడు దాని విత్తనాలు సాధారణంగా మృదువుగా ఉంటాయి. అలాంటి కాకరకాయను వండేటప్పుడు విత్తనాలను  తీసేయాల్సిన అవసరం ఉండదు.

అయితే కాకరకాయ బాగా ముదిరినది అయితే అందులో విత్తనాలు గట్టిగా ఉంటాయి. ఇలాంటి విత్తనాలను కారం పొడి వంటి వంటకంగా తయారు చేసుకుంటే మంచిది.


                                                                                                                                                  *రూపశ్రీ.

By
en-us Political News

  
మునగాకు (Moringa Leaves) మనకు ప్రకృతి అందించిన పోషక విలువలు ఉన్న ఆహారాల్లో ఒకటి. మునగాకులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.
దాహంగా అనిపించినప్పుడు, గొంతు పొడిగా మారినప్పుడు నీరు తాగడం సహజం.  అయితే ఇలా నీరు తాగగానే.. మళ్లీ కాసేపటికే వెంటనే దాహం వేస్తుంది కొందరికి.
రెస్టారెంట్లలో భోజనం తర్వాత స్వీట్ సొంపు ఇస్తుంటారు.  చాలామందికి ఈ సొంపు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది.  కొందరు ఇంట్లో కూడా భోజనం తర్వాత స్వీట్ సొంపు తినడం లేదా సొంపు కండ చెక్కర కలిపి తినడం చేస్తుంటారు.
 నేటికాలంలో డెస్క్ ఉద్యోగాలు, గంటల తరబడి స్క్రీన్ చూడటం, ఎక్కువ దూరం ప్రయాణాలు.. ఇవి మాత్రమే కాకుండా తీరిక సమయంలో సోఫాలో కూర్చునే అలవాటు వంటివి  రోజువారీ శారీరక శ్రమను చాలా తగ్గించాయి.
ఆహారాన్ని తాగాలి.. నీళ్లను తినాలి.. అనే మాట మన పెద్దలు తరచుగా చెబుతుంటారు. మొదట వింటే ఇది కాస్త విచిత్రంగా అనిపిస్తుంది.
ఆహారాన్ని తాగాలి.. నీళ్లను తినాలి.. అనే మాట మన పెద్దలు తరచుగా చెబుతుంటారు. మొదట వింటే ఇది కాస్త విచిత్రంగా అనిపిస్తుంది.
గ్యాస్, ఎసిడిటీ, ఛాతిలో మంట, తరచూ తేన్పులు రావడం వంటి సమస్యలను చాలామంది సాధారణమైనవిగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు.
మోకాళ్ల నొప్పులు, కీళ్ల సమస్యలు ఒకప్పుడు 60–70 ఏళ్ల వయసులో ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు 40లలో ఉన్నవారిలో కూడా మోకాళ్ల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొందరికి చిన్న వయసులోనే Knee Replacement అవసరమయ్యే పరిస్థితి ఎందుకు వస్తోంది?
గుడ్లు పోషకాహారం యొక్క పవర్హౌస్.  ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి.
కాళ్లు, చేతులు తిమ్మిరిగా అనిపించడం, జలదరింపు రావడం చాలామందికి అప్పుడప్పుడు ఎదురయ్యే సమస్య. ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో కూర్చోవడం లేదా నరాలపై ఒత్తిడి పడటం వల్ల తాత్కాలికంగా తిమ్మిర్లు రావచ్చు.
స్ట్రెస్, ఆందోళన, బీపీ వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ జీవితంలో ఒత్తిడి పెరగడంతో మనసుతో పాటు శరీరంపై కూడా ప్రభావం పడుతుంది. ఇలాంటి సమయంలో శ్వాసపై దృష్టి పెట్టే ప్రాణాయామాలు కొంతమందికి రిలాక్సేషన్‌కు సహాయపడవచ్చు.
మన శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో పొటాషియం (Potassium) ఒకటి. శరీరంలో పొటాషియం స్థాయి సరైన మోతాదులో ఉండటం చాలా ముఖ్యం.
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అంటారు. కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటే జీవితం చాలా వరకు దిగులు లేకుండా ఉంటుంది.   కంటికి ఏదైనా సమస్య వస్తే.. దాని ప్రభావం జీవితం మీద చాలా ప్రస్పుటంగా కనిపిస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.